విశాఖపట్నం

హమ్మయ్య కొత్త ఓటర్లు వచ్చేస్తున్నారు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: కొత్త ఓటర్లు వచ్చేస్తున్నారు...వచ్చే నెల మొదటి వారానికి ఇందుకు సంబంధించిన జాబితా సిద్ధం కానుంది. ఆ తరువాత అధికారిక ప్రకటన ఉంటుంది. దీనివల్ల రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఓటుహక్కు వినియోగం కోసం పెరుగుతున్న అవగాహన, ఇటీవల కోర్టు తీర్పుతో ఆధార్‌కార్డు కంటే కూడా గుర్తింపుకార్డుగా ఓటరుకార్డు అవసరం పెరగడంతో ఇపుడు యవత కూడా దీనిపట్ల ఆసక్తి చూపుతోంది. ఇందులో అధికశాతం కాలేజీల విద్యార్ధీనీ, విద్యార్థులే. ఓటుహక్కు కోసం యువత పరుగులు తీస్తోంది. మునుపెన్నడూలేనివిధంగా ఓటరుగా నమోదయ్యేందుకు విశాఖ నగరంలో ఉన్న కాలేజీల విద్యార్థులు స్వచ్ఛంధంగా ముందుకొస్తున్నారు. సంబంధితాధికారులు నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలకు, అవగాహనా కార్యక్రమాలకు ఆసక్తి పెరుగుతోంది. ఇందులోభాగంగా అనేక గత ఏడాదిన్నర కాలంగా కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయి. అర్హులైన వారంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ గుర్తింపుకార్డును పొందాలంటూ గత కొంతకాలంగా చేస్తున్న ప్రచారం ఇపుడిపుడే లక్ష్యాలకు చేరుకుంటుంది. విశాఖ జిల్లాలో ఓటర్లు దాదాపుగా 31 నుంచి 32 లక్షల వరకు ఉంటారనేది అధికారుల అంచనా. అయితే ఇందులో అనేక కారణాలతో చనిపోయిన, బదిలీపై వెళ్ళిన, నకిలీకార్డులు, వలసలు వంటి కారణాలతో ఓటర్లు తగ్గారు. ఈ విధంగా తగ్గిన ఓటర్ల స్థానంలో కొత్త ఓటర్లు ద్వారా భర్తీ చేసేందుకు అధికారులు చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. దాదాపు లక్షన్నర మేర కొత్త ఓటర్లు వస్తే సరిపోతుంది. వీరంతా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు సంబంధితాధికారి ఒకరు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 150నుంచి 200 కాలేజీల వరకు ఉండగా, వీటన్నింటి ద్వారా 20నుంచి 30శాతం మేర 18ఏళ్ళు పైబడిన విద్యార్ధినీ, విద్యార్థులు ఉన్నట్టు సంబంధితాధికారులు లెక్కలు కట్టారు. వీరితోపాటు పేద, మధ్యతరగతి వర్గాలకు సంబంధించి 18ఏళ్ళు నిండి ఉన్న యువతీ,యువకులు ఓటర్ గుర్తింపు కార్డు కోసం నమోదు చేయించుకునే కార్యక్రమాన్ని అంగన్‌వాడీ, డ్వాక్రామహిళా సంఘాలకు అప్పగించారు. ఈ విధంగాను మరో పది శాతం మేర ఫలితాలను సాధించగలిగింది. ఈ విధంగా దాదాపు 40శాతం మేర కొత్త ఓటర్లు వచ్చే అవకాశాలున్నట్టు సంబంధితవర్గాలు చెబుతున్నాయి. ఏ విధంగా చూసుకున్నా విశాఖ జిల్లా ఓటర్లు 33 లక్షలకు మించనుంది.