విశాఖపట్నం

విభజన హామీల అమలుకు ఎంపీలు చిత్తశుద్ధితో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనైనా రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌తో పాటు, విభజన చట్టంలోని అంశాల అమలుకు ఎంపీలంతా చిత్తశుద్ధితో గొంతు విప్పాలని వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పైడి వెంకటరమణ మూర్తి అన్నారు. నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్ తదితర హామీలు అమలు చేస్తామని ప్రజలు ముందు ప్రగల్భాలు పలికారని, అధికారం చేపట్టాక నయవంచనకు పాల్పడ్డాయని దుయ్యబట్టారు. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నీలదీస్తూ అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ, టీడీపీ ఎంపీలు చిత్తశుద్దితో పార్లమెంట్ సమావేశాల్లో గళం విప్పాలన్నారు. అదే విధంగా జగన్‌పై జరిగిన దాడి కేసును తక్షణమే హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ ఐ ఏ)కు అప్పగించాలన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొవాలన్నారు. నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్ గాంధీ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ మాట్లాడుతూ తాజాగా వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మాదిరిగా ఏపీలో కూడా టీడీపీ ప్రభుత్వానికి ఓటమి పాల్పవడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని వీడదీసిన కాంగ్రెస్ పార్టీ, విభజన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించదన్నారు. త్వరలోనే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇంటి ముఖం పట్టడం తప్పదన్నారు. ప్రజలంతా వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జాన్‌వేస్లీ, పీలా వెంకటలక్ష్మీ, శ్రీనివాస్, షబీరాబేగం, తదితరులు పాల్గొన్నారు.
విమర్శలకు ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితాను తయారుచేయండి
విశాఖపట్నం, డిసెంబర్ 11: విమర్శలకు ఆస్కారం లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఈ ఆర్వోలను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం డిప్యూటి ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ సందీప్ సక్సేనా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ పనుల ప్రగతిని సమీక్షించారు. పటిష్టమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ఈ ఆర్‌వోలతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమావైశమై ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు. ఈపీ రేషియో, జెండర్ రేషియోలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఈ ఆర్‌వో వెబ్‌సైట్‌ను ఈ నెల 16తేదినాటికి ఫ్రీజ్ చేస్తున్న నేపథ్యంలో, ఇదే సమయంలోగా డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లు,సెక్షన్లును ఈ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌డ్ చేయాల్సి ఉందన్నారు.మిగిలి ఉన్న సందేహస్పద ఓటర్ల విచారణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. జాబితాలో డూప్లిక్లేట్ ఓటర్లు, లాజికల్ ఎర్రర్స్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొవాలన్నారు.అర్హులైన ఓటర్లుంతా ఓటర్లు జాబితాలో ఉండాలని, వీ ఐపీలు, వికలాంగులు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేకంగా మార్క్ చేయాలన్నారు. ఎన్నికల సంఘం ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం జనవరి మూడో తేది లోపుసప్లమెంటరీ జాబితాలను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిరి, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మూర్తి, ఈ ఆర్‌వోలు పాల్గొన్నారు.

కేంద్ర రైల్వేబోర్డు డివిజన్ సలహా సభ్యుడిగా జీఏ నారాయణ
విశాఖపట్నం, డిసెంబర్ 11: కేంద్ర రైల్వేజోన్ డివిజన్ సలహా మండలి సభ్యుడిగా జీ ఏ నారాయణరావును నియమిస్తూ ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం డివిజన్ ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రయాణీకుల సంక్షేమమం, అభివృద్ధి కోసం సలహా సభ్యుడిగా నియమించారు. ఈ పదవీ రెండు ఏళ్లు పాటు ఉంటుంది. ఈ సందర్భంగా జీ ఏ నారాయణ రావు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అప్పగించిన బాధ్యతను సక్రమంగా అమలు చేస్తానన్నారు. రైల్వే ప్రయాణీకుల సంక్షేమం, భధ్రత విషయాల్లో సంస్కరణలు తేచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మెరుగైన సౌకర్యాలు అందజేయాడానికి కృషి చేస్తానని, ఉత్తరాంధ్ర చిరకాల కోరికైయిన విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధనకు కృషి చేస్తానన్నారు.

దేశ రక్షణలోమత్స్యకారుడే తొలి సైనికుడు
* ఆత్యాధునిక సాంకేతికను, భధ్రతను వినియోగించుకోవాలి
* విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్
విశాఖపట్నం, డిసెంబర్ 11: దేశ రక్షణలో మత్స్యకారుడే తొలి సైనికుడని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు, శత్రుదేశాల బోట్లు సమాచారం అనేకసార్లు అందించి, తమ దేశభక్తిని చాటుకున్న మత్స్యకారులు సేవలు మారువలేనివన్నారు. దేశ భధ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మత్స్యకారులు తమ భధ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొవాలని, సముద్రం నుంచి సురక్షితంగా రావాలన్నారు.జీపీ ఆర్ ఎస్, సెల్‌ఫోన్లు,లైప్‌బోయ్‌లు, ఈకో సౌండ్ సిస్టమ్ వంటి భధ్రతా పరికరాలను అందుబాటులో ఉంచుకొని చేపలవేటకు వెళ్లాలన్నారు.వేటకు వెళ్లే సమయంలో బోటు లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రం, బయోమెట్రిక్, ఆధార్‌కార్డు, తప్పనిసరిగా తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ కమాండెంట్ ఆర్ ఎస్ ఎస్ బీశెట్టి, మత్స్యశాఖ ఏడీ లక్ష్మణరావు, ఎఫ్‌డివో విజయ, మత్స్యకార సంఘం నాయకులు సత్యనారాయణ, కొండబాబు, బాలజీ,తదితరులు పాల్గొన్నారు.
* బాధిత కుటుంబానికి పదివేలు ఆర్థిక సాయం
సంద్రంలో చేపలవేటకు వెళ్లి గలంతైన మత్స్యకారుడు బర్రి అప్పన్న కుటుంబానికి తక్షణ సహయంగా పదివేల రూపాయాలు ఆర్ధికంగా అందించారు. దయనీయస్థితిలో ఉన్న అప్పన్న కుటంబానికి ధైర్యం చెప్పి తక్షణ సాయంగా స్వంత నిధులు అందించడంతో పాటు, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. ఇదే సమయంలో మత్స్యశాఖ ఏడీ లక్ష్మణరావు మరో రెండు వేల రూపాయాలను ఆయా కుటుంబసభ్యులకు ఇచ్చారు.

డ్రెయిన్లలో పూడికను తొలగించి పరిశుభ్రం చేయండి
* పాతనగరంలో శిథిల భవనాలను తోలగించడానికి చర్యలు
* క్షేత్ర పర్యటనలో అధికారులను ఆదేశించిన కమిషనర్ హరినారాయణన్
విశాఖపట్నం, డిసెంబర్ 11: నగరంలోని అన్ని ప్రధాన డ్రెయిన్లలో పూడికలను తోలగించాలని జీవీ ఎంసీ కమిషనర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం 23,24 వార్డుల్లో పర్యటించి పలు శిథిల భవనాలను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ పోగులు లేకుండా చూడాలని, మ్యాన్‌హోల్స్ ఓపెన్ చేసి మురుగుకు అవరోధం లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కాలువల్లో ఆయిల్‌స్ప్రే కొనసాగించాలని,రోడ్ మార్జిన్లును పరిశుభ్రం చేయాలన్నారు. కంపెక్టార్‌బిన్స్ కింద పరిశుభ్రం చేసి, నీటితో కడగాలని ఇచ్చిన ఆదేశాలను అనుసరించని శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆదిప్రకాష్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని గృహాలకు యుజీడీని అనుసంధించాలని, కనకమహాలక్ష్మీ కోవెల వీధి, కంచరవీధి, ఘోషా ఆసుపత్రివీధి, పంజా జంక్షన్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజారోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజల పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు చోరవ చూపాలన్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ చిట్టిబాబు, ఎ ఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్, ఈ ఈ గణేష్‌కుమార్, ఏసీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

దైవారాధనతోనే మెరుగైన ఫలితాలు వస్తాయి
* తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆశీస్సులు అందించిన స్వామిజీ
* త్వరలోనే శారదాపీఠాన్ని సందర్శిస్తా:కేసీ ఆర్
విశాఖపట్నం, డిసెంబర్ 11: భక్తిశ్రద్దలతో దైవాన్ని ఆరాధనచేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అనడానికి చక్కటి ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ(టీఆర్‌ఎస్) గెలుపే నిదర్శనమని శ్రీ విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలవడంతో ఆయన మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రాలకు చింతకాయాలురాలుతాయా అనే హేతువాదులకు తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలుపే నిదర్శనమన్నారు. కేసీ ఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందుతుందని భావించిన ప్రజలంతా తిరిగి చంద్రశేఖర్‌రావునే ఎన్నుకున్నారన్నారు. స్వశక్తితో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా బలంగా ఉండాలనే కేసీ ఆర్ విశాఖ శారదాపీఠం తరుపున రాజ్యశ్యామల మహా యాగాన్ని నిర్వహించారని, ఆ జగన్మాత ఆశీస్సులు పరిపుర్ణంగా కలిగి తిరిగి సీ ఎంగా కేసీ ఆర్‌కే తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం ఎంతో ముదావహమన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కేసీ ఆర్‌కు తమ ఆశీస్సులు అందించామని, త్వరలోనే విశాఖ శారదాపీఠాన్నికి వచ్చి శారదామాతను సందర్శిస్తానని ఫోన్‌లో తెలిపారని స్వామీజీ తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు సరఫరాను పునరుద్ధరించండి
విశాఖపట్నం, డిసెంబర్ 11: విశాఖ జిల్లాలోని అన్ని మండలాల అంగన్‌వాడీ కేంద్రాల్లో బలహీనంగా ఉన్న బాలలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పాలు పంపిణీని తక్షణమే పునరుద్దరించాలని చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గొండు సీతారామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇసుకతోటలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యతప్రమాణాలతో కూడిన కోడిగుడ్లు అందుతున్నాయా లేదా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహర, బలవర్థక ఆహరాపుపట్టికలో ప్రధానంగా పాలుసరఫరా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తన దృష్టికి రావడంతో పరిశీలన చేపడుతున్నామన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, మహిళా,శిశు సంక్షేమ శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పాలుసరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. అప్పటికీ అధికారులు స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఫోరమ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పాలు సరఫరాను కొనసాగించాలని, బాలలను అనారోగ్య పరిస్థితుల నుంచి గట్టెక్కించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ సభ్యులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఏడీ ట్రాఫిక్ సమస్యకు నివారణ చర్యలు
* ఎన్‌ఎస్‌టీఎల్ ప్రహరిగోడ తోలగించి వాహనాలు రాకపోకలు
* అధికారులను ఒప్పించిన ఎమ్మెల్యే గణబాబు
విశాఖపట్నం, డిసెంబర్ 11: మహా విశాఖ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే ప్రధాన కూడలైన ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్య ఇబ్బంది మారడం, ఇదే సమయంలో ఎన్‌ఏడీలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కోంటున్న ట్రాఫిక్ ఇబ్బందలు నుంచి నివారణ కలిపించడానికి స్థానిక ఎమ్మెల్యే గణబాబు మంగళవారం ఎన్‌ఎస్‌టీఎల్ అధికారులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌టీల్ డైరెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించి, ఎన్‌ఏడీ ట్రాఫిక్ సమస్యను ఒక కొలిక్కి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఎన్‌ఎస్‌టీఎల్ అధికారులను ఒప్పించి ప్రవారిగోడను తోలగించి ఆమార్గం ద్వారా రాకపోకలు సాగించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ తాజా నిర్ణయం ద్వారా నగర ప్రజలతో పాటు, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణించే అవకాశం కలగనుంది. ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌టీఎల్ అధికారులను ఒప్పించి తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాణ దశలోఫ్లై ఓవర్ పనులు మరింత వేగవంతంగా చేసుందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది.