విశాఖ

మెనూ అమలులో అవకతవకలకు పాల్పడితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 12: ఆశ్రమ పాఠశాలల్లో మెనూ అమలులో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి హెచ్చరించారు. డుంబ్రిగుడ మండలం జామిగుడ ఆశ్రమ బాలికల పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆశ్రమంలోని వంట గది, సరుకులు నిల్వ చేసే గదులను ఆయన పరిశీలించి, మెనూ అమలు, మంచినీరు, విద్యుత్ సదుపాయాలపై బాలికలను అడిగి తెలుసుకున్నారు. జామిగుడ ఆశ్రమంలో మెనూ అమలులో లోపాలను గుర్తించిన ఆయన వార్డెన్‌పై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. మెనూ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవకతవకలకు పాల్పడినా చర్యలకు గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రాజెక్టు అధికారి ఆశ్రమాన్ని తనిఖీ చేసిన సమయంలో నలుగురు ఉపాధ్యాయులు ఉదయం పది గంటల 45 నిమిషాల వరకు విధులకు హాజరు కాకపోవడంతో ఆగ్రహాం వ్యక్తం చేసారు. సమయ పాలన పాటించని ఎ.ఎస్.వరలక్ష్మి, ఆర్.కొండబాబు, కె.పుప్పలత, టి.లవకుశ అనే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. గిరిజన విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన చేసి నాణ్యమైన విద్యను అందించాలని ఆయన ఆదేశించారు. విధుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేసి విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆశ్రమాల్లోని విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని అంకిత భావంతో పనిచేసినపుడే లక్ష్యాలను అధిగమించగలమని ఆయన అన్నారు. రానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను పూర్తిగా సన్నద్ధం చేసి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ఆశ్రమంలో విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని బాలాజి చెప్పారు.

వై.సంపలు గ్రామానికి రోడ్డు నిర్మిస్తాం
* ఎమ్మెల్యే ఈశ్వరి హామీ
పాడేరు, డిసెంబర్ 12: పాడేరు మండలం వంజంగి పంచాయతీ వై.సంపలు గ్రామానికి నెల రోజుల్లోగా రహదారి సౌకర్యం కల్పిస్తామని స్థానిక శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి హామీ ఇచ్చారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజులుగా గిరిజనులు స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపడుతున్నారు. గిరిజన సంఘం, సి.పి.ఎం. ఆధ్వర్యంలో గిరిజనులు దీక్ష చేస్తూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే గిరిజనుల దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉపాధి హామీ పనులు, మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు చెల్లించలేదని, అంగన్‌వాడీ కేంద్రానికి భవన సదుపాయం లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిరిజనులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఈశ్వరి వై.సంపాలు గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయడమే కాకుండా నెల రోజుల్లోగా రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించి అంగన్‌వాడీ కేంద్రానికి భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఉపాధి పనులు, మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు చెల్లింపుపై అధికారులతో చర్చించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే హామీతో గిరిజనులు దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, సి.పి.ఎం. నాయకులు విశే్వశ్వరరావు, మత్యరాజు, కొండబాబు, నీలన్న, ఎల్.సుందరరావు, గిరిజనులు పాల్గొన్నారు.