విశాఖ

బీజేపీకి ఐదు రాష్ట్రాల పలితాలు గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, డిసెంబర్ 12: రానున్న ఎన్నికల్లో బిజెపి కుదేలు కావడం ఖాయమని అందుకు నిదర్శనంగా నిన్న వెలువడిన ఐదు రాష్ట్రాల పలితాలు సూచికగా నిలుస్తుందని అనకాపల్లి నియోజకవర్గ కన్వీనర్ ఐఆర్ గంగాధర్ వ్యక్తం చేసారు. నిన్న వెలువడిన ఐదురాష్ట్రాల ఎన్నికల పలితాల్లో మూడురాష్ట్రాలులోకాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని పురష్కరించుకొని ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయుకులు నియోజకవర్గ కన్వీనర్ ఐఆర్ గంగాధర్ అధ్వర్యంలో నాయుకులు, కార్యకర్తలు బుధవారం స్థానిక నెహ్రూచౌక్ కూడలిలో సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు తినిపించుకొని భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ సందర్బంగా గంగాధర్ మాట్లాడుతూ బిజెపి విధానాలను దేశ ప్రజలు తిరస్కరించారని,ఇప్పటికైనా వారి విధానాలను మార్చుకోవాలన్నారు.ప్రజా వ్యతిరేక పాలనతోదేశ ప్రజలు విసుగుచెంది ఉన్నారని, రానున్న ఎన్నికల్లోకూడా బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చేప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. పట్టణ అధ్యక్షులు బోయిన బానుమూర్తియాదవ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి మూడు రాష్ట్రాలు పలితాలు తొలి మెట్టు అన్ని ఆనందం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు వెలుగుల బాబూరావు, పట్టణ ఉపాధ్యక్షులు తుట్టారమణ, గైపూరి త్రిమూర్తులు, కొండబాబు, దూది సత్తిబాబు పార్టీ నాయుకులు పాల్గొన్నారు.

వృద్దులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు
అనకాపల్లిటౌన్, డిసెంబర్ 12: కంటి వ్యాధులతోఇబ్బందులు పడుతూ వైద్యం చేయించుకోలేని వృద్దులకు అండగా నిలుస్తున్న ఏఎంఎవిఎం రోటరీ కంటి ఆసుపత్రి అధ్వర్యంలో బుధవారం 50మంది వృద్దులకు కంటి వైద్య పరిక్షలు నిర్వహించారు. అందులో 10మందికి ఆపరేషన్లు చేయవలసి ఉండగా కంటి వైద్య నిపుణులు డాక్టర్ మంజుల ఆపరేషన్లు చేసారు. రోటరీ సహయ గవర్నర్ బుద్ద రమణాజి, ఆసుపత్రి చైర్మన్ వి రవిరామ్ అధ్వర్యంలో రోగులకు ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేసారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎ కామేష్, కార్యదర్శి పిజె నాయుడు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం ప్రకటించాలి
*ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
అనకాపల్లిటౌన్, డిసెంబర్ 12: తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల నష్టపోయిన వరి, చెరకు పంటలకు తక్షణమే పంట నష్టపరిహారాన్ని ఇచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ రైతు సమాఖ్య అధ్యక్షులు దాడి రత్నాకర్ అధ్వర్యంలో రైతులతో కలిసి అర్డీవోకార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా రత్నాకర్ మాట్లాడుతూ వరిపంటకు 28వేలు, చెరకుపంటకు 35వేలు నష్టపరిహారాన్ని తక్షణమే ప్రభుత్వం రైతులకు మంజూరుచేసి ఆదుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంట పోలాలకు వెళ్ళి పంట నష్టాన్ని నమోదుచేయాలన్నారు. రైతులు ఫసల్ భీమా సౌకర్యం పొందేందుకు డబ్బులు చెల్లించినప్పటికీ నష్టపరిహారం మంజూరు చేయడంలో అధికారులు అనేక నిబందనలు చెబుతున్నారని ఆరోపించారు. కరువు పరిస్థితులు కారణంగా అనకాపల్లి మండలంలో చెరకు పంట 50శాతం నష్టం రాగా, వరి 70శాతం పోయిందన్నారు. కశింకోట మండలంలో రెండుపంటలు వందశాతం పోయి ఒక్కరూపాయి కూడా దక్కని పరిస్థితి నెలకొందన్నారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసందానం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. రైతు సమాఖ్య కన్వీనర్ బాలకృష్ణ మాట్లాడుతూ పంట నష్టపరిహారం విషయమై నుండి నెల రోజుల్లోస్పష్టమైన ప్రకటన రానియడల రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపట్టి జాతీయ రహదారిని కూడా దిగ్భందం చేస్తామన్నారు.సిపిఐ పార్టీ నాయుకులు వైఎన్ భద్రం మాట్లాడుతూ రైతు సమాఖ్య తరుపున రెండు నెలలుగా వ్యవసాయ అధికారులకు పంటనష్టం అంచనాకు వినతి అందజేసినా కనీస స్పందన లేదన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాధాలు చేసారు. రైతు సమాఖ్య అధ్యక్షులు రత్నాకర్ ఆధ్వర్యంలో అర్డీవో సూర్యకళకు వినతిపత్రం అందజేసారు. దీనిపై స్పందించిన ఆమె మాట్లాడుతూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తక్షణం చర్యలు చేపట్టి రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగాకృషి చేస్తానన్నారు.ఈకార్యక్రమంలో బొడ్డపాటి చిన్నరాజారావు,కొణతాల హారినాధ్‌బాబు, కోరిబిల్లి శంకర్రావు, కాండ్రేగుల విశే్వశ్వరావు, భీశెట్టి కృష్ణ అప్పారావు, రాపేటి తాతారావు,బొడ్డేడ అప్పారావు, వియ్యపు శ్రీనివాస యాదవ్, శ్రీనివాసరెడ్డి,బి గంగాధర్ రైతులు పాల్గొన్నారు.

అభ్యంతరాలు వారం లోగా తెలియజేయాలి
చోడవరం, డిసెంబర్ 12: అందించిన ఓటర్ల జాబితాల్లో అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా తెలియజేయాలని చోడవరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ డి.పుష్పమణి వెల్లడింఛారు. బుధవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ భవనంలో రాజకీయ పక్షాలు, బిఎల్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న తప్పులను సవరించి నివేదికలు సమర్పించాలన్నారు. ఆయా జాబితాల్లో ఏమైనా తప్పులుంటే వారం రోజుల్లో తమకు అందజేయాలని సూచించారు. ఇటీవల 85, 96 సంవత్సరాలు ఉన్నవారి పేర్లు కూడా నమోదై ఉన్నాయని, వారు ప్రస్తుతం ఉన్నారా లేదా అని సర్వేలు జరిపి తయారుచేయడం జరిగిందన్నారు. అందులో అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలన్నారు. ప్రధానంగా ఖచ్చితమైన ఓటర్ల జాబితాను అందజేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అయితే ఇటువంటి లోపాలను సవరించి అందజేసినందున ఆయా రాజకీయ పక్షాల వారు పరిశీలించి పొరపాట్లు చోటుచేసుకుంటే తమకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం, పిఎస్ పేట, గాంధీగ్రామం తదితర గ్రామాలకు చెందిన రాజకీయ పక్షాల నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన బొడ్డేడ నాగగంగాదర్, సీపీఐ నుండి రెడ్డిపల్లి అప్పలరాజు, సీపీఎం నుండి నాగిరెడ్డి సత్యనారాయణ, వైసీపీ నుండి శ్రీకాంత్‌లు సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఎంపీడీవో చిట్టిరాజు, తహశీల్దార్ కె. రవికుమార్‌లు కూడా ఓటర్ల జాబితాల సవరణలపై ప్రసంగించారు.

మార్షల్ ఆర్ట్స్‌తో యువతకు రక్షణ
చోడవరం, డిసెంబర్ 12: ఇటీవల నిర్వహించిన రాష్టస్థ్రాయి కరాటే పోటీల్లో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కెఎఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన కారాటే పోటీల్లో చోడవరం డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి చిరికి వెంకటేష్ కరాటే బ్లూ బెల్ట్ ఆఫ్ గోల్డ్‌మెడల్‌ను సాధించారు. ఈసందర్భంగా ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో విద్యార్థిని ఎస్‌ఐ మల్లేశ్వరరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ అభ్యసన యువతకు ప్రధానంగా ఉండాలన్నారు. ప్రస్తుత సమాజంలో బాలికలకు ఇది మరింత అవసరమన్నారు. బాలికలు అత్యాచారాలు, వేధింపులు నుండి తమను తాము రక్షించుకోవడానికి మానసిక, శారీరక ధారుడ్యాన్ని అందించే మార్షల్ ఆర్ట్స్‌ను విధిగా అభ్యసించాలన్నారు. ఈ సందర్భంగా కోచ్ కె. వెంకట్రావును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట
మునగపాక, డిసెంబర్ 12: టీడీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చినప్పుడే అభివృద్ధి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరి అవుతున్నాయని యలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు పేర్కొన్నారు. బుధవారం వాడ్రాపల్లిలో గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా నూతన నిర్మించిన తడిపొడి చెత్తకేంద్రాన్ని, వేంకటేశ్వస్వామీ దేవాలయంకు వెళ్లె రోడ్డుకు, తిమ్మరాజుపేట వాడ్రాపల్లి గ్రామాలను కలుపుతూ ఏర్పాటుచేసిన రోడ్డును పంచకర్ల రమేష్‌బాబు ప్రారంభించారు. ఈసంధర్భంగా గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణి చేసారు. ఈసంధర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ వాడ్రాపల్లి పంచాయితీలో సుమారు ఆరుకోట్లతో అభివృద్ధి పనులుచేసుకున్నామని అన్నారు. గతంలో సంక్షేమ కార్యక్రమాలు పార్టీల పరంగా చూసి ఇచ్చెవారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా అభివృద్ధి చూచేసి చూపిస్తున్నామని అన్నారు. వాడ్రాపల్లిలో 10లక్షలతో ఇంటింటి కొలాయిలు ఏర్పాటుకు వారం రోజుల్లో 10లక్షలు మంజూరు చేస్తానని మహిళలకు భరోసా పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఆడారి మంజు, కొయిలాడ వెంకట్, మండల పార్టీ అధ్యక్షుడు దాడి ముసిలిఅప్పారావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మొల్లేటి సత్యనారాయణ, ఎంపిటిసిలు టెక్కలి పరశురాము, ఉల్లింగల గోవింద్, అనకాపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు, స్థానిక నేతలు మళ్ల వరహనర్శింగరావు, మళ్లశేషు, కొయిలాడ రాంబాబు, కె నూకఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఒక్కపోన్‌కాల్ చేస్తే ఇల్లు మంజూరు చేస్తా
మునగపాక, డిసెంబర్ 12: యలమంచిలి నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకోవడానికి ఒక్కపోన్‌కాల్ చేస్తే ఇళ్లు మంజూరు చేస్తానని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, యలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు పేర్కొన్నారు. బుధవారం గ్రామదర్శినిలో భాగంగా వాడ్రాపల్లిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకోవడానికి పరిమితిలేదని, ఎన్ని ఇల్లులైన మంజురూ చేస్తానని ప్రజలకు భరోసా పలికారు. ఇళ్ల ఎంపికలో అవక తవకలకు పాల్పడితే క్షమించేదిలేదని ఆయన కార్యకర్తలకు హెచ్చరించారు. పంచాయితీలో ప్రభుత్వం భూమి ఉంటే ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో పట్టాలు మంజూరు చేసి గృహలు నిర్మిస్తామని తెలిపారు. మండలంలో కొంతమంది ఇల్లు నిర్మాణం చేసుకుంటుంటే కొత్తగా భయలుదేరిన కొంతమంది రాజకీయ నాయకులు కమ్మలపాకల దగ్గర పోటోలు తీసుకొని ఇప్పటికి పేదలకు ఇల్లు మంజూరు కాలేదని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేసారు. ఈకార్యక్రమంలో స్థానిక తహశీల్ధార్ ఆదిమహేశ్వరావు, ఎంఇఒ పద్మావతి, మాజీ ఎంపిపిలు కొయిలాడ వెంకట్ , ఆడారి మంజు, మండల ఉపాధ్యాక్షుడు ఉల్లింగల గోవింద, మాజీ సర్పంచ్‌లు యల్లపు వెంకట భాస్కరావు, కర్రి భాస్కరావు, రాపేటి పరమేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

అన్నీ ఉన్నా ఆ ఒక్కటీ లేదు
* లోపాన్ని అధిగమించేందుకు చర్యలు * జి.ఒ.నెంబరు 132ను రద్దు చేస్తాం
* ప్రాంతీయభావమే టి.ఆర్.ఎస్.ను గెలిపించింది. * మంత్రి కిడారి
పాడేరు, డిసెంబర్ 12: విశాఖ మన్యంలోని ఆసుపత్రులలో సకల సదుపాయాలు ఉన్నప్పటికీ ఒకే ఒక లోపం వలన గిరిజనులకు సరైన వైద్య సేవలు అందించేందుకు వీలుకావడం లేదని రాష్ట్ర ప్రాధమిక వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక పి.ఎం.ఆర్.సి. కార్యాలయ అతిధి గృహంలో మంగళవారం రాత్రి ‘ఆంధ్రభూమి’ తో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీకి ముఖ్యమైన ఆసుపత్రులలో పాడేరు, అరకులోయ ఏరియా ఆసుపత్రులలో నిపుణులైన వైద్యులు పనిచేస్తున్నారని, ఎటువంటి శస్త్ర చికిత్సలను చేసేందుకైనా అవసరమైన సామాగ్రితో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయితే శస్త్ర చికిత్సలు చేసేందుకు ముఖ్యమైన ఎనస్థీషియన్ (మత్తు వైద్యుడు) లేకపోవడం వలన ఏ శస్త్ర చికిత్స చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఆసుపత్రులలో మహిళలకు సంబంధించిన వైద్య నిపుణులు కూడా కొరతగా ఉందని ఆయన చెప్పారు. దీంతో అవసరమైన వైద్య నిపుణులను నియమించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుని ఈ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మన్యం ఆసుపత్రులలో ఎనస్థీయన్, మహిళా, దంత వైద్య నిపుణులను త్వరలోనే నియమించనున్నామని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతంలో పనిచేసేందుకు నిపుణులైన వైద్యులు ముందుకురాకపోవడం వలన దీర్ఘకాలికంగా సమస్యను ఎదుర్కొవలసి వస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో పనిచేసేందుకు ముందుకు వచ్చే వైద్యులకు అన్ని రకాల వసతులను కల్పించి నెలకు లక్షా 40 వేల రూపాయల జీతాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో పనిచేసేందుకు ముందుకు వచ్చే వారికి అన్ని సౌలభ్యాలు కల్పిస్తున్నా ఎవరూ ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేసారు. దీంతో గిరిజనులలోనే నిపుణులైన వైద్యులను ఈ ప్రాంతంలో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే అవసరమైన వైద్య నిపుణులను నియమిస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా మైదాన ప్రాంతంలోని కార్పోరేట్ ఆసుపత్రులలో పనిచేసే వైద్య నిపుణులతో ఒప్పందాన్ని కుదుర్చుకుని ఏజెన్సీలో పనిచేసేలా వారిని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నామని ఆయన అన్నారు. వైద్య నిపుణులతో పాటు క్షేత్ర స్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆసుపత్రులలో అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పాడేరు ఏరియా ఆసుపత్రిలో డయాలిసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో అధికంగా ఉన్న సికిల్‌సెల్ ఎనిమియా చికిత్స కోసం గతంలో ఎక్కడకో వెళ్లి వైద్యం పొందాల్సి ఉండేదని, ప్రస్తుతం పాడేరులోనే దీనికి చికిత్స అందుబాటులో ఉండడం గొప్ప పరిణామమని ఆయన చెప్పారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రదానోపాధ్యాయుల అధికారాలను తొలగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ.నెంబరు 132ను త్వరలోనే రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ జి.ఒ. అమలును ప్రస్తుతానికి నిలిపివేసామని, అయితే పూర్తిగా దీనిని రద్దు చేసే విషయమై ప్రిన్సిపాల్ కార్యదర్శితో చర్చించినట్టు ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖలో ఉండడం వలన ఆలస్యవౌతుందని, అవసరమైతే ముఖ్యమంత్రితో చర్చించి జి.ఒ.ను రద్దు చేస్తామని ఆయన తెలిపారు. జి.ఒ. రద్దును కోరుతూ ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనను విరమించాలని ఆయన కోరారు. విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాలని, అనవసరమైన అపోహలతో వారి చదువులను పాడు చేయవద్దని ఆయన కోరారు. తెలంగాణలో ప్రాంతీయ భావం బలంగా ఉండడం వలనే టి.ఆర్.సి. అధికారంలోకి వచ్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రావణ్‌కుమార్ చెప్పారు.
డి.ఎస్.ఒ.కు ఘనంగా వీడ్కోలు
పాడేరు, డిసెంబర్ 12: స్థానిక ఐ.టి.డి.ఎ.లో డి.ఎస్.ఓ.గా పనిచేసి రంపచోడవరం ఐ.టి.డి.ఎ.కు ఎస్.ఒ.గా పదోన్నతిపై బదిలీపై వెళుతున్న ఎం.వెంకటేశ్వరరావుకు ఐ.టి.డి.ఎ. అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆయనను అధికారులు, సిబ్బంది సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి మాట్లాడుతూ మన్యంలో ప్రతిష్టాత్మకమైన కాఫీ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేయడంలో వెంకటేశ్వరరావు కృషి శ్లాఘనీయమైనదని అన్నారు. తన పనితీరుతో ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారని, ఆయన చేసిన సేవలను ప్రతి అధికారి, ఉద్యోగి ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకుమార్, ఐ.టి.డి.ఎ. సహాయ ప్రాజెక్టు అధికారులు వి.ఎస్.ప్రభాకరరావు, ఎస్.వి.ఎస్.ఎస్.కుమార్, పరిపాలన అధికారులు నాగేశ్వరరావు, వేగి అప్పారావు, ప్రాజెక్టు ఉద్యానవన అధికారి జి.ప్రభాకరరావు, పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.