విశాఖ

కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 15: ప్రముఖ శాస్తవ్రేత్త, మాజీ రాష్టప్రతి దివంగత అబ్ధుల్ కలాంను విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సూచించారు. ఇంటర్‌మీడియట్ బోర్డు స్వర్ణోత్సవాల సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభించిన ర్యాలీని ఆమె శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి లోకానికి కలాం మార్గనిర్ధేశికులని అన్నారు. విద్యార్థుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగిన ఆయన వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమించారని ఆమె చెప్పారు. శాస్తవ్రేత్తగా కలాం సాధించిన విజయాలు ప్రపంచం గర్వించతగినవని, ఆయన అడుగుజాడల్లో విద్యార్థులు పయనిస్తే తాము కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని ఆమె అన్నారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించిన వారు ఎందరో ఉన్నత పదవులను చేపట్టారని ఈశ్వరి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ విద్యను సద్వినియోగం చేసుకుంటే రానున్న కాలంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు డి.ఎస్.పి. రాజ్‌కమల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.్భమశంకరరావు, అద్యాపకులు కె.పార్వతి, కె.సూరిబాబు, ఎం.ఎస్.ఎస్.వర్మ, ఒ.రాజారావు, ఎస్.క్రాంతికుమార్, ఉద్యోగుల సంఘం నాయకుడు ఎస్.గంగరాజు, విద్యర్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాముల వర్థంతి వేడుకలు
పాడేరు, డిసెంబర్ 15: అమరజీవి పొట్టి శ్రీరాములు 66వ వర్థంతిని పాడేరులో శనివారం నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది శ్రీరాములు వర్థంతి వేడుకలను నిర్వహించి వౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన సేవలను అధికారులు, ఉద్యోగులు స్మరించుకున్నారు. కాగా స్థానిక అక్షర పబ్లిక్ పాఠశాల ఆవరణలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకమార్, ఐ.టి.డి.ఎ. పరిపాలన అధికారి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కొండలరావు, పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గిరిజన యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలి
అరకులోయ, డిసెంబర్ 15: గిరిజన యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి మరింత రాణించేలా ప్రోత్సహించాలని వైసీపీ ఎస్.టి.సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు చెప్పారు. స్థానిక ఎన్.టి.ఆర్. మైదానంలో వై.ఏస్.ఆర్. స్మారక వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన శనివారం ప్రారభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ గిరిజన యువకులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేరిట స్మారక టోర్నమెంట్‌ను అరకులోయలో నిర్వహిస్తున్నామని అన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజన క్రీడాకారులకు ప్రోత్సాహం కరువవ్వడంతో క్రీడల్లో రాణించలేకపోతున్నారని ఆయన చెప్పారు. దినదినానికి కనుమరుగవుతున్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు నియోజకవర్గం స్థాయిలో పోటీలు ఏర్పాటు చేసామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని 135 పంచాయతీల నుంచి 102 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలిచిన జట్లలో మొదటి బహుమతి కింద 50 వేలు, ద్వితీయ స్థానం జట్టుకు 25 వేలు, తృతీయ స్థానంకు 15 వేలు, చతుర్థశి స్థానంలో నిలిచిన జట్టుకు 10 వేల రూపాయలు నగదు బహుమతిని అందిస్తామని ఆయన వివరించారు. పోటీల్లో పాల్గొన్న అన్న జట్లకు ఉచితంగా వాలీబాల్ కిట్లను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వాలీబాల్‌ను గిరిజన ప్రాంతాలలో ఆచరించేలా స్ఫూర్తి కలిగించేందుకు అరకులోయలో దీనిని నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు. గిరిజన యువత క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని, యువకులు క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొంటే శరీరానికి, మనస్సుకు హాయిగా ఉంటుందని రవిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సమర్డి భాస్కరరావు, పాంగి చిన్నారావు, విజయకుమార్, మత్యరాజు, సుక్రయ్య, కొండలరావు, సుందరరావు, రమణమూర్తి, సుబ్రహ్మాణ్యం, రాందాసు, ప్రసాద్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములుకు నివాళి
అరకులోయ, డిసెంబర్ 15: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్థంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఎం.పి.డి.ఒ. విజయకుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

క్రేన్ వాహనం వస్తే వాహనదారులకు హాడల్
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 15: ఆదమరచి వాహనాన్ని రోడ్డుపై పార్కుచేసి ఇతర పనులుపై ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి వచ్చేసరికి ఆ వాహనం కనిపించకపోతే నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళవల్సిందే. పట్టణంలోట్రాఫిక్‌ని నియంత్రించడానికి ప్రత్యేక చర్యల్లోభాగంగా గత కొన్ని రోజులు క్రితం ట్రాఫిక్ క్రేన్ వాహనం వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు నుండి అనేక పనులుపై వచ్చేవారు తమ వాహనాలను ఆయా దుఖాణాలు ఎదురుగా రోడ్డుకు ఇరువైపులా పార్కుంగ్ చేసి వచ్చిన పనుల్లో నిమగ్నమై ఉంటారు. అయితే పార్కుంగ్ చేసిన వాహనాలు బైక్, కారు, ఆటోతదితర వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉందని పోలీసులకు ఏ మాత్రం అనిపించినా ఈ వాహనాలను క్రేన్ వాహనంలోఎక్కించి స్టేషన్‌కు తరలిస్తున్నారు. వాహన దారుడు వచ్చిన పని ముగించుకొని వాహనం వద్దకు వచ్చేసరికి సంబందిత వాహనం కనిపించదు. నిత్యం క్రేన్ వాహనం ప్రధానా మార్గాల్లో సంచరించి ఇటువంటి చర్యలు తీసుకోవడంతో వాహనదారులు రోడ్డుపై వాహనాన్ని పార్కుంగ్ చేయడానికి వెనుకాడుతున్నారు. శనివారం స్థానిక పూడిమడక రోడ్డులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రోడ్డుపై పార్కుంగ్ చేసిన రెండు బైక్‌లను పోలీస్టేషన్‌కు తరలించారు.దీంతోఈ వాహనం ఏ మార్గంలో సంచరించినా ఆయా ప్రాంతాల్లో వాహనదారులు హాడలిపోతున్నారు.

తుమ్మపాల సుగర్స్ విజయం ప్రజాసంఘాలదే
*టన్నుకు మూడువేలు ప్రకటించాలి *సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నర్సింగరావు
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 15: గత మూడు సీజన్లునుండి మూతపడి ఉన్న తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకోవడం వెనుక ప్రజా సంఘాలు కృషి, పోరాట పలితమేనని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు అభినందన వ్యక్తం చేసారు. శనివారం ఆయన సుగర్ ఫ్యాక్టరీని సందర్శించి కార్మికులు చేస్తున్న అయిలింగ్ పనులను పరిశించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సీజన్లుగా ఫ్యాక్టరీ మూతపడి ఉండడంతో చెరకురైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కార్మికులు, రైతులు, ప్రజాసంఘాలు చేసిన పోరాటాలకు ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి తిరిగి క్రషింగ్‌కు సిద్దం చేయడం పట్ల కార్మికులను అభినందించారు.ప్రభుత్వం ఈ నిర్ణయం నాలుగేళ్ళక్రితం తీసుకొని ఉంటే ఈపాటికి ఫ్యాక్టరీ ఆదునీకరణ పూర్తిఅయి ఉండేదన్నారు. 42మంది కార్మికులు, పదిమంది రైతులు చనిపోయి ఉండక పోనని వ్యాఖ్యానించారు. చెరకు రైతులకు టన్నుకు మూడువేలు చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం అన్నారు. ఈ పర్యటనలో కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎ బాలకృష్ణ, సిఐటియు డివిజన్ అధ్యక్షులు మళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.