విశాఖపట్నం

విజయవంతంగా ముగిసిన మెడ్‌టెక్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక/ఉక్కునగరం, డిసెంబర్ 15: ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెదగంట్యాడ వద్ద ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్‌లో మూడు రోజులు పాటు నిర్వహించిన అంతర్జాతీయ వైద్య ఉపకరణాల సదస్సు-2018 విజయవంతంగా ముగించింది. అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలకు చెందిన 1046 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రతినిధులంతా విశాఖనగరంలో గల పలు హోటళ్లుల్లో వసంత కల్పించారు. నగరం నుండి ప్రతీ రోజు ప్రత్యేక వాహనాల్లో మెడిటెక్ జోన్‌కు తీసుకు రావడం, సదస్సు అనంతరం తిరిగి వాహనాల్లో హోటళ్లుకు చేర్చడం జరిగింది. అంతర్జాతీయ సదస్సు ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అలాగే మెడిటెక్ జోన్‌ను జాతికి అంకితం చేశారు. మొదటి దశ పనులను ప్రారంబించడం, రెండవ దశ పనులకు శంకుస్థాపన చేశారు. రెండవ రోజు సదస్సుకు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, అశ్వినీకుమార్ చౌబేలు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు మెడిటెక్ జోన్ బ్రాండ్ అంబాసిడర్ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహవాగ్ హాజరయ్యారు. సదస్సు ముగింపు అనంతరం విదేశీయ అతిధులంతా తిరిగి ప్రయాణం అయ్యారు. శనివారం మధ్యాహ్నాం నుండే అతిధులు వారి వారి లగేజీలను సరుదుకుని తిరిగి ప్రయాణం కావడం కనిపించింది. సదస్సు ముగింపు అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్య అధికారులంతా తిరిగి ప్రయాణం అయ్యారు. అతిధులకు శుక్రవారం నగరంలో ఒక ప్రైవేటు హోటల్‌లో విందు ఇచ్చారు. విందుకు విదేశీయ అతిధులు అధికంగా హాజరయ్యారు. సదస్సు అనంతరం అబ్దుల్ కలాం కాన్వన్షన్ హాల్‌లో గల మినీ ఆడిటోరియంలో వైద్య ఉపకరణాలపై సెమినార్స్‌ను నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది సైంటిస్టులు, వైద్యులు హాజరయ్యారు. విదేశీయ డెలిగేట్స్‌కు సెమినార్‌లో సైంటిస్టులు, వైద్యులు డౌట్స్‌ను నివృత్తి చేశారు. అతిధులంతా మెడిటెక్ పార్కులో గల వివిధ పరిశ్రమలను సందర్శించారు. అలాగే వైద్య ఉపకరణాల తయారీ అనంతరం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక 18 ల్యాబ్స్‌ను అతిధులు సందర్శించారు. అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన విదేశీయ, స్వదేశీయ అతిధులను ఆంధ్రభూమి పలకరించింది. మెడిటెక్ జోన్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిందన్నారు. ఆహ్లాదమైన వాతావరణం మధ్య అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి మెడిటెక్ జోన్ ప్రపంచంలో ఎక్కడా లేదని, అన్ని ఒకే చోట లభించడం అరుదు అన్నారు. మెడిటెక్ జోన్ మంచి ఫలితాలు ఇస్తుందన్న భావం వ్యక్తం చేశారు. విదేశీయ పెట్టుబడులకు ఇటువంటి సదస్సులు దోహద పడుతాయన్న భావాన్ని వ్యక్తం చేశారు.