విశాఖపట్నం

విద్యుత్ సిబ్బంది సెలవులు రద్దు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: విద్యుత్‌శాఖ ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దయ్యాయి. ఎటువంటి పరిస్థితుల్లోను ఏ ఒక్కరూ సెలవు పెట్టేందుకు వీల్లేదంటూ శనివారం ఈపీడీసీఎల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. తుపాను కారణంగా ఎదురయ్యే నష్టాలను అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతిఒక్కరూ సైనికుల్లా సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే ఈపీడీసీఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర ఆదేశాలు జారీ చేశారు. ఇందులోభాగంగా విశాఖ జిల్లా ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సూర్యప్రకాష్ శనివారం ఉదయం నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలో ఆపరేషన్ సర్కిల్ కార్యాలయంతోపాటు అనకాపల్లి, పాయకరావుపేట, జోన్-1,2 కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యుత్‌కు సంబంధించిన ఏ విధమైన పిర్యాదులునైనా దీని ద్వారా 0891-2718091 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే ప్రతీ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రెండు క్రేన్లు, మరో రెండు జనరేటర్లను ముందస్తుగానే అందుబాటులో ఉంచామన్నారు. సాగరతీరం ప్రాంతాల్లో ఉండే సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్ల పరిరక్షణ, దెబ్బతినే ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు సత్వరమే చేపట్టేందుకు వీలుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే తుపాను కారణంగా దెబ్బతినే విద్యుత్ వ్యవస్థను ఎప్పటికపుడు పునరుద్ధరించడం కోసం 1500 మంది ఉద్యోగులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. క్షేత్రస్థాయి నుంచి ప్రతిఒక్కరూ శని,ఆదివారాల్లో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సోమవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటేంత వరకు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు.

తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి
* జీవీ ఎంసీలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు * టోల్‌ఫ్రీ నెంబర్ 1800-425-00009
విశాఖపట్నం, డిసెంబర్ 15: తుఫాను హెచ్చరికల కేంద్రం, ఆర్‌టీజీ ఎస్ సూచనల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీ ఎంసీ కమిషనర్ హరినారాయణన్ కోరారు. ఫెథాయి తుఫాన్‌ను ఎదుర్కోవడానికి అన్ని జోన్లలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారని, అధికారులు విధి నిర్వహాణకు సంసిద్థంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా భారీ వర్షాలు, తుఫాను దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సమాచారాన్ని అందించాలన్నారు. దీని కోసం జీవీ ఎంసీలో టోల్‌ఫ్రీ నెంబర్ 180042500009కు ఫోన్‌చేసి అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని, లేకుంటే ప్రధాన కార్యాలయం నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. తుఫాన్ తీవ్రత ముగిసే వరకూ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఆవిష్కరణలకు ఏయూ సంపూర్ణ ప్రోత్సహం
* ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు
విశాఖపట్నం, డిసెంబర్ 15: విద్యార్థులు నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు వర్శిటీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు అన్నారు.శనివారం ఉదయం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో రోల్ ఆఫ్ ఐపి ఆర్ ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్ అండ్ అకడామీ- ఇండ్రస్టీ కొలాబరేషన్ ఒక రోజు వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేధో హక్కులను, ఆలోచనలను పరిరక్షించడం ఎంతో అవసరమన్నారు. నూతన ఆవిష్కరణలు జరిపే వారు పేటెంట్‌లు పొందే దిశగా ప్రయత్నించాలని, తద్వారా దేశానికి ఎంతో ప్రతిష్ట పెరుగుతుందన్నారు. ఎన్ ఆర్‌డీసీ సీ ఎండీ డాక్టర్ హెచ్.పురుషోత్తం మాట్లాడుతూ మేధో హక్కుల పరరక్షణతోనే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఉన్నతంగా రాణించడం సాధ్యపడుతుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మేధో హక్కుల సంరక్షణ, పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. ప్రశ్నించే తత్వం, అణ్వేషనాసక్తిని విద్యార్థుల్లో పెంపోందించడం ఎంతో అవసరమన్నారు. సి ఎస్ ఐ ఆర్- ఐ ఐసిటి ఛీప్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్‌వి సత్యనారాయణ మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యా వ్యవస్థలు, ప్రభుత్వం సమన్వయంతో సమిష్టిగా పనిచేస్తే ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వ పరంగా దీనికి ఎంతో సహకారం అవసరం ఏర్పడుతుందన్నారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీ ఈవో విన్నీ పాత్రో మాట్లాడుతూ కళాశాల నుంచి పరిశ్రమల ఆవిర్భావం జరుగుతాయన్నారు. కాఫీరైట్, ఐపి ఆర్‌లపై విస్తృత అవగాహన కలిగి ఉండాలని,నేడు దశాబ్థాల చరిత్ర కలిగిన సంస్థల కంటే ఆంకుర పరిశ్రమలల్లోనే ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయన్నారు. సదస్స సమన్వయకర్త ఆచార్య పి.జె రావు,సిజిపిడిటి ఎం కార్యాలయ అసిస్టెంట్ కంట్రోలర్ డాక్టర్ ఉషారావు, ఎన్‌ఆర్‌డిసిఐఫి ఎఫ్‌సి మేనేజర్ బికె సాహు, తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలి
* జిల్లా పరిషత్ చైర్‌పర్స్‌న్ లాలం భవానీ భాస్కర్
విశాఖపట్నం, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిర్థేశించిన లక్ష్యాల మేరకు త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా జిల్లా పరిషత్ చైర్‌పర్స్‌న్ లాలం భవానీ భాస్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన జెడ్పీ ప్రజాపరిషత్ స్థాయి సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. రాష్ట్భ్రావృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. డ్వామా పీడీ దయానిది మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు జరుగుతున్నాయన్నారు. ఫారం పాండ్స్, ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్లు, ఆట స్థలాలు, ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు, శ్మాసన వాటిక నిర్మాణాలు, మొక్కలు పెంపకం తదితర పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీ ఆర్ గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు గృహాలను కేటాయించడం జరిగిందన్నారు. ఎస్సీ కార్పోరేషన్ ఈడీ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి 60శాతం సబ్సిడితో స్వయం ఉపాధి పథకాలను అందిస్తామన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగశే్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 116 పరిశ్రమలను స్థాపించి సుమారు 80వేల మందికి పైగా ఉపాధి అవకాశం కల్పిస్తున్నామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ జిల్లాలో మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ప్లూ తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటూ అవసరమైన మందులను అందిస్తున్నామన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ గీతాదేవి మాట్లాడుతూ ఆదరణ పథకం ద్వారా 43,856 మందికి పనిముట్లు అందించడానికి చర్యలు చేపడుతున్నామని, ఈ నెల 28న మెగా గ్రౌడింగ్ మేళా నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీ ఎం చంద్రబాబు హాజరు కానున్నారన్నారు. ఈ స్థాయి సంఘ సమావేశాలకు శాసనమండలి సభ్యులు పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, పీలా గోవింద సత్యనారాయణ, జెడ్పీ సీ ఈవో రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లును అభినందించిన వీసీ
విశాఖపట్నం, డిసెంబర్ 15: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆటల్ బీహరి వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యానిటరింగ్ ఆన్డ్ అలైడ్ స్పోట్స్, దర్శశాల, హిమాచల్ ప్రదేశాల్లో నిర్వహించిన జాతీయ సాహస శిక్షణా శిబిరంలో పాల్గొన్న పది మంది ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులను ఏయూ వీసీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సాహస శిక్షణ శిబిరంలో శిక్షణ పొందడంతో విద్యార్థులు, క్రమశిక్షణ, ధైర్యం భవిష్యత్‌లో ఎలాంటి విప్తత్తులైన ఎదుర్కోనే యుక్తి పెంపోందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో- ఆర్డినేటర్ ఆచార్య సంపత్‌కుమార్, రమణ కుమార్ పాల్గొన్నారు.