విశాఖ

అరకులోయలో స్వచ్ఛ సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, డిసెంబర్ 17: అరకులోయ పట్టణంలో స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీ పరిధిలోని అరకులోయలో స్వచ్ఛ సంక్రాంతి కింద చెత్తా చెదారాలను ఏరివేసి, పిచ్చి మొక్కలను తొలగించి, మురుగు కాలువలను శుభ్రం చేసారు. తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షంలో స్థానిక ఎం.పి.డి.ఒ. విజయకుమార్ పంచాయతీ పారిశుధ్య కార్మికులతో పరిసరాలను శుభ్రం చేయించారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పలు దుకాణాల వద్ద నిల్వ ఉన్న చెత్తా చెదారాలను తొలగించారు. పరిశుభ్రత పాటించాలని, దుకాణాల ఎదుట ఉన్న చెత్తను యజమానులే తొలగించుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఎం.పి.డి.ఒ. హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెదలబుడు పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపిడిఒగా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
బుచ్చెయ్యపేట, డిసెంబర్ 17: మండలపరిషత్‌కు ఎంపిడిఒగా పి విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డుంబ్రిగుడ ఎంపిడిఒగా పనిచేసిన ఈమె గత కొంతకాలంగా సెలవులో ఉన్నారు. ఇక్కడ ఎంపిడిఒగా పనిచేసిన కొండలరావుకు డిఎల్‌పిఒగా ప్రమోషన్‌పై విశాఖకు బదిలీ అయ్యారు. దీంతో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రసాదరావుకు ఎంపిడిఒగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. విజయలక్ష్మి బుచ్చెయ్యపేట నూతన ఎంపిడిఒగా బదిలీపై రావటంతో సోమవారం ఆమెకు ప్రసాదరావు భాద్యతలను అప్పగించారు.

పిఎసిఎస్‌ల సిబ్బంది సమ్మె
బుచ్చెయ్యపేట, డిసెంబర్ 17:రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు మండలంలోని ఆరు పిఎసిఎస్‌ల్లో పనిచేస్తున్న సిఇఒలతో సహా సిబ్బంది అందరూ సమ్మెలోకి వెళ్లారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిఎసిఎస్‌ల సిబ్బంది సోమవారం నుండి సమ్మె చేస్తున్నట్టు ఇంతకు ముందే అల్టిమేటమిచ్చారు. ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవటంతో సోమవారం మండలంలోని ఆరు పిఎసిఎస్‌ల సిబ్బంది పిఎసిఎస్‌లను మూసివేసి విధులకు గైర్జారై, సమ్మెలో పాల్గొన్నారు. ఈమేరకు వడ్డాది పిఎసిఎస్ సిఇఒ నాగేశ్వరరావు అధ్వర్యంలో పిఎసిఎస్ సిబ్బంది పిఎసిఎస్ అధ్యక్షులు దొండా సన్యాసిరావును కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. అలాగే మాడుగుల సెంట్రల్ బ్యాంక్ మేనేజరును కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతు, తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని చెప్పారు.
మంత్రి అయ్యన్నపై ఆరోపణలు అర్ధరహితం
* ఎ ఎంసీ చైర్మెన్ అడిగర్ల
గొలుగొండ, డిసెంబర్ 17: తన 35 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మంత్రి అయ్యన్నపాత్రుడు అక్రమ సంపాదనకు కాని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదని ఎ ఎంసీ చైర్మెన్ అడిగర్ల అప్పలనాయుడు అన్నారు. సోమవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అడిగర్ల మాట్లాడుతూ సాలికమల్లవరం రంగురాళ్ళ క్వారీలో మంత్రి అయ్యన్న హస్తం ఉన్నట్లు వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త ఆరోపణలు చేయడం అర్ధరహితమని ఇటువంటి ఆరోపణలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అడిగర్ల అన్నారు. రెండు మండలాలను కలిపేందుకే కోట్లాది రూపాయలు వెచ్చించి లింక్ రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు. అక్రమ రంగురాళ్ళ క్వారీ ద్వారా తనకు ఏనాడు సంపాదించాలనే ఆలోచన లేదన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ళ కాలంలో మండలానికి కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ది పనులు చేపట్టారన్నారు. గత వారం రోజుల క్రితం నాతవరం నుండి రోడ్డు పరిశీలన నిమిత్తం సాలికమల్లవరం మంత్రి వచ్చారన్నారు. రెండు మండలాల సరిహద్దు దూరాన్ని 30 కిలో మీటర్ల నుండి కేవలం 10 కిలో మీటర్ల దూరం సౌకర్యం ఉండడంతో ఎంతో ఉపయోగకరం అని భావించారన్నారు. వైసీపీ నాయకుడు గణేష్ తన స్థాయిని మరిచి మంత్రిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి ఆరోపణలు మానుకోక పోతే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. మంత్రి పరిశీలనలో కోటి 70 లక్షల రూపాయలు అదనంగా నిధులు మంజూరు చేసారని , ఈనిధులతో సైడ్ వాల్స్, మిగతా అభివృద్ది పనులకు కేటాయించారన్నారు. 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మంత్రి అయ్యన్న మచ్చలేని నాయకుడిగా ఎదిగారని ఇది గణేష్‌కు తెలియనిదా అని పేర్కొన్నారు. ఇటువంటి ఆరోపణలు వైసీపీ నాయకులు చేయడం పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. ఈసమావేశంలో దేశం పార్టీ నాయకులు సుర్ల సీతారామ్మూర్తి, చిటికెల సాంభమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు.

యలమంచిలిలో బలపడుతున్న జనసేన
టీడీపీ, వైఎస్సార్ పార్టీల గుండెల్లో రైళ్లు
అచ్యుతాపురం, డిసెంబర్ 17: యలమంచిలి నియోజవర్గంలో జనసేన పాగా వేయడానికి జోరుగా సన్నాహాలు చేస్తోంది. నానాటికి జనసేన పార్టీ బలపడుతుంది. నియోజవర్గం మాజీ టీడీపీ కన్వీనర్ సుందరపు విజయ్‌కుమార్ జనసేన పార్టీలో చేరడంతో ఆ పార్టీ వర్గాల్లో నూతనోత్తేజం ఏర్పడింది. జనబాట కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యిటిస్తున్న సుందరపు అన్ని వర్గాల మద్దతు కోరుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వడి అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా, అవినీతిలేని పాలన పవన్‌కళ్యాణ్‌తో సాధ్యమని గ్రామాల్లో ఓటర్లను ఉత్తేజపరుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నిశ్శబ్ధంగా ఉన్న జనసేన ఒక్కసారిగా ఊపందుకుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసి మెజార్టీతో గెలుపొందడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామాల్లో పార్టీలో చేరడానికి స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ప్రతి గ్రామంలో యువకులకు ప్రాదాన్యత కల్పిస్తూ చేరికలు జరుగుతున్నాయి. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురంలో జనసేన క్యాంప్ కార్యాలయాన్ని మాజీ మంత్రి జనసేన నాయకులు పసుపులేటి బాలరాజు చేతుల మీదగా అదివారం ప్రారంభించారు. జనసేన పార్టీ రోజురోజుకు బలం పుంజుకోవడంతో అధికారం పార్టీతో పాటు, ప్రధానప్రతిపక్షమైన వైఎస్సార్ పార్టీ నాయకుల గుండెల్లో రెళ్లు పరిగెత్తుచున్నాయి. ప్రధానంగా సుందరపువిజయ్‌కుమార్ స్థానికుడు కావడంతో పాటు నియోజకవర్గంలో అందరికి సుపరిచితుడు కూడ. దీంతో బలమైన సామాజిక కులానికి చెందిన నాయకుడు కావడంతో ఆ కులంలో కూడ సుందరపు గెలుపుకు కృషి చేయడానికి తీవ్రప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజవర్గంలో మంచినీటి సమస్యలపై, రోడ్లు విస్తరణపైన, సెజ్, నేవల్ నిర్వాసితుల సమస్యలపై, అలాగే మత్స్యకారుల సమస్యలపై, రైతు సమస్యలపై సుందరపు దృష్టిసారించి పోరాటాలు చేస్తున్నారు. దీంతో ఎటువంటి అధికారం లేకపోయిన సరే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సుందరపు మద్దతు ఇవ్వాలని నియోజవర్గం ప్రజలు చూస్తున్నారు. గ్రామాల్లో తనదైన శైలీలో సుందరపు జనసేన బాటను కొనసాగిస్తున్నారు. అవినీతి పాల్పడే నాయకులను తరిమి కొట్టాలని సుందరపు పిలుపునిస్తున్నారు. రానున్న ఆసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని గెలుపించాలని జనసైనికులు టీంలగా ఏర్పడి గ్రామాల్లో పార్టీ బలోపితానికి గురిచేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గ్రామాల్లో పర్యటించి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో బిజిబిజిగా ఉన్నారు. టీడీపీతోనే గ్రామాలు అభివృద్ధి జరిగాయని, రాష్ట్ర విభజన జరిగినప్పటికి అనుభవం కల్గిన చంద్రబాబునాయుడుతో ఈ రాష్ట్రం అన్ని విధాలగా అభివృద్ధి జరుగుతందన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన అభివృద్ధిపై వివరిస్తూ ఆయన ప్రవేశపెట్టి పధకాలు అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని, నవరత్నాలు అమలుతో ప్రజా సమస్యలు పరిష్కారమని జగన్ రావాలి, జగన్ కావాలి అనే కార్యక్రమం ద్వారా పల్లె గ్రామాల్లో తన అనుచరులతో కలసి మమ్మురంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో కన్నబాబు పాలన చూశాం, ప్రస్తుతం పంచకర్ల రమేష్‌బాబు పాలన చూస్తున్నాం త్రిముఖపోటీ నెలకొన్నప్పటికి కొత్తవారికి రానున్న ఎన్నికల్లో పట్టం కట్టడానికి ప్రజలు ఉన్నట్టు విశే్లషకులు అంటున్నారు. రోజురోజుకు ప్రజల్లో జనసేన పట్ల ప్రజల్లో అభిమానం పెరుగడంతో పాటు తన బలాన్ని పుంజుకుంటుంది. దీంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల గుండెల్లో తీవ్రస్థాయిలో గుబులు పెగుగుతుంది.

పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రితో ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కారం
అచ్యుతాపురం, డిసెంబర్ 17: సమాజం పట్ల బాద్యత కల్గిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. అచ్యుతాపురం సెజ్ రోడ్డులో జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయాన్ని ఆయన అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై జనసేన కార్యకర్తలు నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నానాటికి జనసేన పార్టీ బలపడుతుందన్నారు. దేశంలో బిజెపీకి, రాష్ట్రంలో టీడీపీకి పవన్‌కళ్యాణ్ మద్దతు పలికి గెలుపుకు కృషి చేశారన్నారు. ఎన్నికలు అనంతరం ప్రజాసమస్యలు పరిష్కరించడంలో దొందూ దొందే అన్నట్టు వ్యవహారించడంపై పవన్ బావోద్వేగాలకు గురియ్యారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని అందలం మెక్కిస్తే ప్రజలకే శఠగోపం పెట్టిన ఘనత టీడీపీ, బిజెపి దక్కిందన్నారు. సెజ్‌లో స్థానికలకు ఉపాధి అవకాశాలు వస్తాయని తమకు జీవనాధారమైన పంట భూములను ధారదత్తం చేసిన రైతుల కుటుంబాలను అదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గం సమన్వయకర్త సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ టీడీపీ, వైఎస్సార్ పార్టీలను ఇంటికి పంపే గడియలు దగ్గరల్లో ఉన్నాయన్నారు. జనసైనికలు క్రమశిక్షణతో మెలగాలన్నారు. క్రమశిక్షణకు మారుపేరు జనసేన పార్టీ అన్నారు. రేపటి తరం బాగుండాలంటే నేటి తరం యువకులంతా అన్యాయాన్ని నిలదీయాలన్నారు. ప్రతి జనసైనికుడికి అండగా ఉంటానని బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కో- కన్వీనర్ కోన తాతారావు, చోడవరం, పాయకరావుపేట నాయకులు క్రిష్టమూర్తి, పివిఎన్‌రాజు, గంగాభవాని, జనసేన నాయకులు కట్టేంపూడి సతీష్, సూర్యప్రకాష్, కరెడ్ల ప్రకాష్, పైల రామునాయుడు, లోవరాజు, వడిశల నాయుడు, చోప్పా శ్రీను, విజయ్, అన్నం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.