విశాఖ

ఘనంగా ముక్కోటి ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాదేవిపేట, డిసెంబర్ 18: మండలంలో ఎ ఎల్‌పురం, నాగాపురం గ్రామాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు. ఎ ఎల్‌పురం గొల్లవీధిలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయం లో భక్తులు పూజలు నిర్వహించారు. తుంపా శ్రీను దంపతుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులచే ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారికి పూజలు చేసారు. స్థానిక యాదవ సంఘం ప్రతినిధులు పెదబాబు, కృష్ణ, రమణ, వాసు తదితరులు ముక్కోటి ఏకాదశి పూజల్లో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పూజలు
చోడవరం, డిసెంబర్ 18: మండలంలోని వైష్ణవ దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి (ఉత్తర ద్వార దర్శనం) పూజలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. మంగళవారం చరిత్ర ప్రసిద్ధి కలిగిన కేశవస్వామి ఆలయం, స్థానిక ఆపదహర శ్రీనివాస క్షేత్రం, గోవాడ వేంకటేశ్వర స్వామి ఆలయం, లక్కవరం భూపతి వేంకటేశ్వర స్వామి ఆలయం తదితర దేవాలయాల్లోని స్వామివారి ఉత్సవమూర్తులు వైకుంఠనాథుని అలంకారంలో ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామునుండి భక్తులు ఆలయాలకు చేరుకుని వైకుంఠద్వారం నుండి లోనికి ప్రవేశించి స్వామివారిని పూజించారు. స్థానిక ఆపదహర శ్రీనివాస క్షేత్రంలో కేశవ స్వామి ఆలయం వద్ద ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామిని, కేశవ స్వామిని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు దర్శించి పూజలు చేసారు. అలాగే గోవాడ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైకుంఠ ద్వారంలో ఉన్న స్వామివారిని ఫ్యాక్టరీ యాజమాన్య సిబ్బంది, కార్మిక నాయకులు తదితరులు దర్సించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో మండలంలోని పలు గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లు పాటించడంతో ఎమ్మెల్యే రాజు కూడా అదే క్యూలైన్ ద్వారానే స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధానంగా కేశవ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామిని నాణేలతో అలంకరించి భక్తిప్రపత్తులతో పూజలు చేసారు.

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
సీలేరు, డిసెంబర్ 18: వైకుంఠ ఏకాదశి వేడుకలు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా తెల్లవారు నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తులకు ఉత్తర మార్గం ద్వారా దర్శనం కల్పించారు. తులసి మాలలతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. స్థానిక రామాలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
మునగపాక, డిసెంబర్ 18: మండలంలో పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మేజర్ పంచాయితీ మునగపాక పంచాయితీ వీధిలో గల రామాలయం, వేపచెట్టు దగ్గర రామాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. నాగులాపల్లి, సంతబయల , కాకరాపల్లి, తోటాడ, గవర్ల అనకాపల్లి, చూచుకొండ, గణపర్తి, అరబుపాలెంలో రామాలయాల్లో తెల్లవారు నాలుగు గంటల నుండి రామాలయాలు భక్తులతో కిటికిటలాడాయి. పిధాయ్ తుపాన్ గాలులను సైతం లెక్కచేయకుండా భక్తులు వేకువ జామునే చన్నీటి స్నానాలు అచరించి దేవాలయాలకు చేరుకొని దేవునిపట్ల తమకున్న భక్తిబావాన్ని చాటుకున్నారు. అలాగే నాగులాపల్లి శ్రీ వేంకటేశ్వరునికి నాగులాపల్లి గ్రామస్తులు పూజలు నిర్వహించి పల్లకి సేవలు చేపట్టారు. వైకుంఠ ఏకాదశిరోజు పూజలు నిర్వహించిన భక్తులకు ఎంతో మోక్షం లభిస్తుందని ప్రధాన పూజారి రేజేటి రాంబాబు భక్తులను ఆశ్వీర్వదించారు.
భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి
కొయ్యూరు, డిసెంబర్ 18: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని మండల వ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకున్నారు. మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు ఉపవాస దీక్షలను చేపట్టారు.
ఘనంగా ముక్కోటి ఏకాదశి
కోటవురట్ల, డిసెంబర్ 18: ముక్కోటి ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. మండలంలో కైలాసపట్నం రాజగోపాలస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు రాజగోపాలస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేసారు. లింగాపురం దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, స్థానిక శివాలయంలో భక్తులు పూజలు నిర్వహించారు.
ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు
మాకవరపాలెం, డిసెంబర్ 18: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని మండలంలోని తామరంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు పూజలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని మంగళవారం ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాని మాకవరపాలెం నుంచి నగర సంకీర్తనలో ఊరేగించి, ఐదు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. అదే విధంగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకవారా, పాలాభిషేకాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో గోవింద నామస్మరణతో భక్తులు ప్రత్యేక పూజలు చేసారు. ఈకార్యక్రమంలో నగర సంకీర్తన సంఘం నాయకులు రఘుబాబు, చక్రవర్తి, ధర్మకర్తలు ప్రభాకర్‌రాజు, భక్తులు పాల్గొన్నారు.

మోదకొండమ్మను దర్శించుకున్న వైసిపి నేత అమర్
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 18: స్థానిక గాంధీ బొమ్మ జంక్షన్‌లోకొలువైయున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వైసిపి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాధ్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఘటాలు ఉరేగింపులోవీరు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు మొగ్గ నూకరాజు, కోరుకొండ రాఘవ, పొలమరశెట్టి మొరళీకృష్ణ, సాయిరాజు అధ్వర్యంలో అమర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసారు.్భక్తులు అధిక సంఖ్యలోపాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ లైటింగ్‌తోఅలంకరించారు.

పారిశుద్ధ్యంతో ప్రజలు ఇబ్బందులు
*ఎక్కడ చూసిన చెత్తకుప్పలు *పందులు సె్తైర్యవిహారం
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 18: పట్టణంలోజనాభా తగ్గట్టుగా పారిశుద్ధ్యకార్మికులు లేకపోవడంతో పారిశుద్ధ్యపనులు పూర్తిస్థాయిలోనిర్వహించడంలో విఫలమవుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.పారిశుద్ధ్య కార్మికులు పట్టణంలో ప్రధానా ప్రధాన మార్గాలకు ప్రధాన్యత ఇస్తూ మారుమూల వీధుల్లో పనులు నిర్వహించలేకపోతున్నారు.పట్టణంలోకొన్నిప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా రోడ్లుపై చెత్తపేరుకుపోయి కుప్పలుగా దర్శినమిస్తున్నాయి. దాసరిగెడ్డరోడ్డు, బారువారి వీధి, శారదా కోలనీ, పూడిమడక రోడ్డు తదితర ప్రాంతాల్లోప్రజలు పారిశుద్ద్య సమస్యలుతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై వ్యర్ధాలుతో పేరుకుపోతున్న చెత్తకుప్పల్లో పందులు సె్తైర్యవిహారం చేసి సంచరించడంతోవాటి మూలంగా లేనిపోని అంటువ్యాధులు వ్యాపిస్తాయని ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా పడుతున్న చెదురుమదురు చికులకు చెత్తకుప్పలు తడిసి తీవ్ర దుర్గంధమైన వాసన వేధజల్లుతుందని అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజి కాలువల్లో పూడిక తొలగించక పోవడంతోకొన్ని ప్రాంతాల్లో కాలువలు శిధిలమై మెరుగు నీరు రోడ్లుపై ప్రవహిస్తుందని, తాగునీటి కోలాయి వద్ద మెరుగునీరు నిల్వ ఉండిపోవడంతో ఆ కోలాయి వద్దకు వెళ్ళడానికి స్థానికులు ఇష్టపడటలేదని పూడిమడక రోడ్డుకు ఆనుకోని ఉన్న ఒక వీధివారు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మార్గాల్లోనే కాకుండా చిన్నచిన్న వీధుల్లోకూడా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి శుభ్రం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయాప్రాంత ప్రజలుకోరుతున్నారు.

రంగురాళ్ళ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు
గొలుగొండ, డిసెంబర్ 18: సాలికమల్లవరం రంగురాళ్ళ క్వారీలో అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం రూరల్ సీ ఐ రేవతమ్మ అన్నారు. మంగళవారం మండలంలోని సాలికమల్లవరం గ్రామంలో గ్రామస్తులతో రంగురాళ్ళ తవ్వకంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీ ఐ రేవతమ్మ మాట్లాడుతూ సాలికమల్లవరం గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్‌లో రంగురాళ్ళ క్వారీ ఉందని, ఈక్వారీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలకు పాల్పడితే ఎంతటి వ్యక్తులపైనైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గ్రామస్తులు కాని, ఇతరప్రాంతాలకు చెందిన వారెవ్వరైనా ఈప్రాంతంలో తవ్వకాలు సాగించినట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తప్పవని సీ ఐ రేవతమ్మ హెచ్చరించారు. గత నాలుగు రోజుల క్రితం ఈ క్వారీ ప్రాంతంలో ఆధునిక యంత్రాలతో తవ్వకాలు సాగించారని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా పప్పుశెట్టిపాలెం, కరక రంగురాళ్ల క్వారీ ప్రాంతాల్లో తవ్వకాల నిరోధానికి నిఘా చర్యలు చేపట్టామన్నారు. ఎప్పటికప్పడు తమసిబ్బందితో పాటు అటవీ శాఖ కూడా ఈక్వారీల్లో దాడులు నిర్వహిస్తుందన్నారు. ఈసదస్సులో స్థానిక ఎస్సై ఉమామహేశ్వరరావుతో పాటు స్థానిక సర్పంచ్ భర్త డీవీ ఎస్ మల్లేశ్వరరావు,గ్రామస్తులు పాల్గొన్నారు.

పెథాయ్ తుఫాన్‌కు నీట మునిగిన వరి
గూడెంకొత్తవీధి, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్‌కు విశాఖ మన్యంలో రైతు తీవ్రంగా నష్టపోయాడు. తుఫాన్ కారణంగా గూడెంకొత్తవీధి మండలం కొంగపాకలు, ఏనుగుబయలు,పి.కొత్తూరు గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతు తమ పంట పొలాలను చూసి బోరున విలపిస్తున్నారు. మండలంలోని వేలాది హెక్టార్లలో వివిధ రకాల వరి సాగును చేపట్టారు. వీటిలో కోసిన కుప్పులు పెట్టుకున్నారు. మరికొన్ని కోతకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని పంటలు కోసి వరి పనలను పొలాల్లో వదిలేసారు. ఈపరిస్థితుల్లో పెథాయ్ తుఫాన్ సంభవించిన నేపధ్యంలో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట తడిసిపోయింది. కుంకుంపూడి, అగ్రహారం, పెదవలస, గూడెంకొత్తవీధి, దారకొండ తదితర గ్రామాల్లో పంటకు నష్టం వాటిల్లింది. కూలీల కొరత వలన పంట కోత చేపట్టలేకపోయామని, మరికొన్నిచోట్లచోట్ల నూర్పులు జరుగలేదని రైతులు వాపోతున్నారు. ఐదు రోజుల క్రితం ఏనుగుబయలు గ్రామంలో వరి కోసి పొలంలో వదిలేయడంతో తడిసిపోయింది. ఇలా అనే గ్రామాల్లో పెథాయ్ కారణంగా వరితో పాటు పలు పంటలు నీట మునగడంతో ఆదుకునే వారి కోసం గిరి రైతు ఆశగా ఎదురుచూస్తున్నాడు.

టీబీపై అప్రమత్తంగా వ్యవహరించండి
గూడెంకొత్తవీధి, డిసెంబర్ 18: టీబీ వ్యాధిపై అప్రమత్తంగా వ్యవహరిస్తూ సరైన సమయంలో వైద్య సేవలు పొందితే ఈ వ్యాధి త్వరగా నయం అవుతుందని జీకేవీధి వైద్యాధికారి లక్ష్మీకాంత్ అన్నారు. గూడెంకొత్తవీది మండల కేంద్రంలో మంగళవారం పలకరింపు, టీబీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇక్కడ 45 మందికి చికిత్సలు చేసి వారికి ముందులు ఉచితంగా అందించారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది కిశోర్, లావణ్య పాల్గొన్నారు.

మందగించిన నెట్ వర్క్, బ్యాంకు లావాదేవీల్లో జాప్యం
రావికమతం, డిసెంబర్ 18: మండల కేంద్రం ఆంధ్రా బ్యాంకులో లావాదేవీలు మంగళవారం తీవ్ర జాప్యం అయ్యాయి. దీంతో ఖాతాదారులు అసహనానికి గురయ్యారు. తుఫాన్ కారణంగా బీ ఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్‌లో సిగ్నల్ మందగించడంతో బ్యాంకుల చెందిన సర్వర్లు మొరాయించారు. దీంతో అన్ని రకాల సేవల్లో జాప్యం జరిగింది. నెట్క్ వర్క్ స్పీడ్ గణనీయంగా తగ్గడంతో తాత్కాలికంగా పనులు ఆలస్యం అవుతున్నాయని డీ ఎం కె.నాయుడు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకు సిబ్బందికి సహకరించాలని కోరారు.

సమస్యల పరిష్కారానికై పోస్టల్ ఉద్యోగుల ధర్నా
కృష్ణాదేవిపేట, డిసెంబర్ 18: కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తక్షణమే కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఎ ఎల్ పురంలో పోస్టల్ సిబ్బంది దర్నా నిర్వహించారు. ఈమేరకు పోస్టల్ అదనపు సిబ్బంది అధ్యక్షుడు ప్రసాద్, గవర్రాజు ఆధ్వర్యంలో స్థానిక పోస్టల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా అదనపు సిబ్బందిగా పని చేస్తున్న తమను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని, రిటైర్డ్ అయిన వారికి ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. పలు డిమాండ్లతో కూడిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.

సహకార సంఘ సిబ్బంది సమ్మె
* మూతపడిన సంఘాలు
రావికమతం, డిసెంబర్ 18: మండలంలో ప్రాథమిక సహకార సంఘాల సిబ్బంది మంగళవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా కొత్తకోట, మేడివాడ, రావికమతం, చినపాచిల ప్రాథమిక సంఘాలు మూతపడ్డాయి. ప్రాథమిక సహకార సంఘాల్లో పని చేస్తున్న సిబ్బందికి సీనియార్టీ ప్రాతిపదికన జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు కల్పించాలని పదవీ విరమణ వయోపరిమితి 60కు పెంచాలని డిమాండ్‌తో నిరవధిక సమ్మె చేస్తున్నామని కొత్తకోట సహకార సంఘ ప్రతినిధి జి.రఘు, కె.రమణ తెలిపారు.
అభివృద్ధికి అడ్రస్‌గా చోడవరానికి గుర్తింపు
*ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు
చోడవరం, డిసెంబర్ 18: అభివృద్ధికి అడ్రసుగా చోడవరాన్ని తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అన్నారు. మంగళవారం స్థానిక హార్డింజ్ అతిధిగృహంలో 25లక్షల రూపాయలు ఎన్టీపీసి, ఎంపి ల్యాడ్ నిధులతో నిర్మించనున్న కల్యాణ మండపంకు భూమి పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోడవరం పట్టణాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్ది అభివృద్ధికి అడ్రస్‌గా గుర్తుండిపోయేలా కోట్లాది రూపాయల నిధులతో కల్యాణ మండపాలు, సిసి రోడ్లు, ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీవార్డులోను శుభకార్యాలను నిర్వహించుకునేందుకు వీలుగా కల్యాణ మండపాలు నిర్మించడం జరుగుతుందన్నారు. హార్డింజ్ అతిధిగృహంలో ఏర్పాటు చేస్తున్న కల్యాణ మండపాలను అన్ని హంగులతో అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా అన్ని రంగాలలో చోడవరాన్ని అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇవో సత్యనారాయణమూర్తి, జెడ్పీటిసి సభ్యులు కనిశెట్టి మత్స్యరాజు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
బాలికల హక్కులను కాపాడాలి
జి.మాడుగుల, డిసెంబర్ 18: బాలికల హక్కులు కాపాడటానికి అందరూ సమిష్టిగా కృషి చెయ్యాలని మండల విద్యాశాఖ అధికారి కె.నాగభూషణం అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రాధమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు మీనా ప్రపంచం అనే కార్యక్రమం ద్వారా బాలికల హక్కులపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల హక్కులను కాపాడేందుకు తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. లింగవివక్ష లేకుండా బాలికలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని, వారిపట్ల వివక్ష చూపరాదని ఆయన చెప్పారు. బాలికలు కౌమర దశకు చేరుకున్నప్పుడు మన ప్రాంతంలో వివిధ రకాల కారణాలతో చదువును మాన్పించడం, ఇష్టం ఉన్న రంగాల వైపు బాలికలను పంపించకపోవడం వంటివి చేస్తుంటామని ఇలా చేయడం కూడా బాలికల హక్కులను హరించడంలోకే వస్తుందని ఆయన అన్నారు. గా గ్రామీణ ప్రాంతాలలో బాలికల పట్ల వివక్ష ఎక్కువగా ఉన్నట్టు ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయులు ఇటువంటివి గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్సు పర్సన్లు అప్పారావు, పుష్పవతి, శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
అరకులోయ, డిసెంబర్ 18: విశాఖపట్నంలో ఈ నెల 19వ తేది బుధవారం నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని అరకులోయ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు పాచిపెంట శాంతకుమారి కోరారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తమ పార్టీ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ 86వ జయంతి సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసారని చెప్పారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో ద్రోణంరాజు జయంతి వేడుకల అనంతరం కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమేన్‌చాంధ్, పి.సి.సి. అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పలువురు సీనియర్ నాయకులు హాజరవుతున్నట్టు ఆమె చెప్పారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆమె కోరారు.

జీ ఓ నెంబర్ 132ను తక్షణం రద్దు చేయాలి
కొయ్యూరు,డిసెంబర్ 18: గిరిజన విద్యను బలహీన పరిచే జీ ఓ నెంబర్ 132ను తక్షణం రద్దుచేయాలని గిరిజన సంఘం జిల్లా నేత సూరిబాబు , సీటు నేత అప్పలనాయుడులు డిమాండ్ చేసారు. ఏజన్సీ వ్యాప్తంగా గిరిజన డీ ఎస్సీని తీయకపోవడంతో గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే గిరిజన ప్రత్యేక డీ ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేసారు.