విశాఖపట్నం

4న కవులనోట పాట-ప్రకృతి సాగుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం,జనవరి 2: నేటి సమాజంలో రసాయాన ఎరువల వాడకంతో సంభవిస్తున్న భూతాపాన్ని తగ్గించేందుకు ప్రతీ ఒక్కరూ సేంద్రియ వ్యసాయాన్ని అలవర్చుకొవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నెల నాల్గోవ తేదిన నగరంలోని ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ హాల్‌లో రైతులకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు జట్టు స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ డి.పారినాయుడు తెలిపారు. నగరంలో బుధవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన కార్యక్రమాలను వివరించారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే పాటలతోనే సాధ్యపడుతుందని భావించి కవులనోట పాట- ప్రకృతి సాగుబాట పేరిట ప్రజలకు అర్థమయ్యే విధంగా వినూత్నంగా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. రసాయనిక ఎరువుల వినియోగం పూర్తిగా మానుకోవడమే కాకుండా, పలు రకాల అంతర పంటలు, మిశ్రమ పంటలు వేసుకుంటూ ఎల్లవేళ్లలా భూమిని కప్పివుంచడం చేయవలసిన తక్షణావశ్యమన్నారు. ప్రభుత్వాలు చేసే అరకొర ప్రయాత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడం లేదని, ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఆలోచనా విధానాలు మారాలని, మరింతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖలో సేంద్రియ ఎరువుల వాడకంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు పాల్గొంటారని, వీరితో పాటు ప్రజాకవి,గాయకుడు గద్దర్,లోకకవి అందెశ్రీ, ప్రజాకవి గోరేటి వెంకన్న, సీని నటుడు డాక్టర్ ఎం.్భపాల్‌రెడ్డి, గాయకుడు గొడిశాల జయరాజ్, ఏయూ రెక్టార్ ఆచార్య ప్రసాదరావు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రామ్మోహన్‌రావు, థియోటర్ ఆర్ట్స్ విభాగాధిపతి ఆచార్య మధుసూధనరావు, ఉత్తరాంధ్ర ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు పాల్గొని , సేంద్రియ ఎరువల వాడకంతో వచ్చే అనార్థాలపై ప్రజలకు ఆట-పాటలతో ఆలరించనున్నారన్నారు. అదే విధంగా 21 దేశాల నుంచి వివిధ పరిశోధకులు రాసిన ఆంగ్ల పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేసి 3 ఇంకా 60 ఏళ్లు2 వ్యాస సంపుటిని సీనియర్ పాత్రికేయుడు గాంధీ రచించిన పుస్తకాన్ని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు రైతాంగ సమస్యలపై పాటాలు పాడారు.