విశాఖపట్నం

లింగ వివక్షత కారణంతోనే బాలికల సంఖ్య తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం,జనవరి 2: గ్రామీణ ప్రాంతాలలో నేటికీ బాలికా శిశు జననం ఆర్ధిక భారంగా భావించే పరిస్థితి ఉండటంతో మగ పిల్లల సంఖ్యతో పోలిస్తే బాలికా శిశు జననాలు తక్కువుగా ఉంటున్నాయని, ఈ విషయంలో ప్రజలను చైతన్య పరచాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. బాలికా శిశువును రక్షించండి అనే నినాదంతో ఓబిజి సొసైటీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గీతం, ఆంధ్రా మెడికల్ కళాశాల సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపీ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పుట్టబోయే పిల్లలు ఆడ,మగ అనేది తెలుసుకోవడానికి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కూడా నేరమన్నారు. గైనకాలజిస్ట్‌లు సమాజ చైతన్యం కోసం ర్యాలీని నిర్వహించడం అభినందనీయమన్నారు. గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు శ్రీ భరత్ మాట్లాడుతూ సాంకేతిక ప్రగతిలో, వివిధ రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నప్పటికీ లింగ వివక్షణ సమాజాన్ని వదలకపోవడం విచాకరమన్నారు. స్ర్తి,పురుషలు అన్న భావన ఉన్నప్పుడు సమాజం ప్రగతి సాధిస్తుందన్నారు. అబ్‌స్టెస్టిక్ అండ్ గైనకోలాంజికల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బరాజు, ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.రాధ, డాక్టర్ పద్మావతి, కార్యదర్శి వాణి, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, ఎన్టీ ఆర్ వైద్యవిద్యాలయం మాజీ వీసీ డాక్టర్ రవిరాజు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వీసీ కె.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్కేబీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి వై ఎం సీ ఏ వరకూ జరిగిన ర్యాలీలో దాదాపు 500 మంది వైద్య విద్యార్థులు, నర్శింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.