విశాఖపట్నం

ప్రజలు సొత్తు ప్రతి పైసాకూ లెక్క చెప్పాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 2: ప్రజల సొమ్మును ఖర్చు చేసే ప్రభుత్వాలు బాధ్యతతో మెలగడంతో పాటు ప్రతి పైసా సద్వినియోగం చేసి లెక్కలు చెప్పాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖ పార్లమెంట్‌కు సంబంధించి నాయకులు, కార్యకర్తలతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని, రాష్ట్రానికి సహాయం అందించే విషయంలో గతంలోను, వర్తమానంలోను, భవిష్యత్‌లోనూ ఎటువంటి రాజీ పడబోమని ఉద్ఘాటించారు. ఈ సంవత్సరం బీజేపీకి కీలకమని, నాయకులు, కార్యకర్తలు కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేసి, ప్రజల మనసుల్లో చోటు సంపాదిస్తే అదే బీజేపీని విజయపథాన నడిపిస్తుందన్నారు. దీనికోసం పార్టీ నిర్ధేశించిన 23 అంశాలను పార్టీ యంత్రాంగం చిత్తశుద్ధితో పాటించాలన్నారు. దేశ భవిష్యత్ యువతరం చేతుల్లో ఉందని, అటువంటి యువత కలలను సాకారం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రస్తుత తరంలో యువత ప్రశ్నించే తత్వం కలిగి ఉన్నారని, వారికి ఖచ్చితమైన సమాధానం లభిస్తే వారు సంతృప్తి చెందుతారన్నారు. మంచి వౌలిక సదుపాయాలు కల్పించాలని యువత కోరుకుంటోందని, వాటిని కల్పించేది ఎవరు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కావాలనుకుంటున్నారని, వాటిని అందించగలిగింది ఎవరు. అవినీతిని అసహ్యించుకుంటోందని, అవినీతిపై చర్యలు తీసుకుంటున్నది ఎవరు. యువత ఆలోచనల మేరకు సమర్ధవంతంగా పనిచేస్తున్నది బీజేపీ ప్రభుత్వమే అనే నమ్మకం కలిగించాలన్నారు. నిత్యం ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూ రాజకీయాలు చేసే పార్టీలను ప్రజలు, యువత సమర్థించరన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ లక్ష్యంగా విమర్శలకు దిగుతోంది. యువత వారిపై ఏహ్య భావంతో ఉన్నారు. అటువంటి యువతను స్వయంగా కలవండి, వారికి బీజేపీ లక్ష్యాలు వివరించండి అంటూ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. యువత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చూడాలని, వారికి నరేంద్ర మోదీ యాప్ గురించి వివరించి, బీజేపీ పట్ల ఆకర్షితులయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పార్టీ సీనియర్ నాయకులు పీవీ చలపతి రావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి
* నాయకులకు దిశానిర్ధేశం చేసిన పవన్

విశాఖపట్నం, జనవరి 2: పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, కార్యకర్తలను ఆదిశాగా కార్యోన్ముఖులను చేయాల్సింది నాయకులేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో అధినేత పవన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా ఈ విషయాన్ని ఉద్ఘాటించారని మాజీ మంత్రి, జనసేన నాయకుడు పీ బాలరాజు తెలిపారు. త్వరలోనే ఎన్నికలకు సిద్ధం కావాల్సిన తరుణంలో పార్టీ పట్ల ప్రజలను ఆకర్షితులు చేయాల్సిందిగా అధినేత ఆదేశించినట్టు తెలిపారు. జనతరంగం తొలి విడత విజయవంతమైన విధంగానే రెండో విడతలో కూడా లక్ష్యాన్ని అందుకోవాలని స్పష్టం చేశారన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితోనే గడిపేలా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారన్నారు. ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని సూచించారన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తొలిస్థానమే లక్ష్యం
* ప్రజల సహకారంతోనే ఉత్తమ ర్యాంక్ సాధ్యం * రేపటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోటీ ప్రారంభం
* ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జీవీ ఎంసీ అధికార యాంత్రాంగం
విశాఖపట్నం,జనవరి 2: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పోటీకి వేళ అయింది. ఈ నెల నాల్గొవ తేది నుంచి దేశంలోని 4,300 నగరాల్లోని ప్రజలకు అందుతున్న సేవలు, వౌలికవసతులు,పారిశుధ్య నిర్వహణ, బహిరంగ మల మూత్ర విసర్జన నిర్మూలన,రవాణా వ్యవస్థ, తడి-పొడి చెత్త సేకరణ,తదితర అంశాలను పరిశీలించి వాటి ద్వారా కేంద్రం నుంచే అధికార బృందం మార్కులు ఇవ్వనుంది. అయితే ఈ బృందం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌లో పర్యటించి ఆయా వసతులను పరిశీలించేందుకు జీవీ ఎంసీ అధికార యాంత్రాంగం రంగం సిద్దం చేస్తోంది. అయితే తొలిసారిగా నగరాలకు అవార్డులు ప్రకటించిన 2015లో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ విధానంపై పోటీల్లో పాల్గొన్న జీవీ ఎంసీకి దేశంలోనే 237వ స్థానం లభించింది. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఏ విధంగా మార్కులు సాధించాలో తెలుసుకున్న అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంతో 2016లో ఏకంగా 237వ ర్యాంక్ నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. ఇదే స్పూర్తితో 2017లో మరోసారి స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంక్‌ల్లో మరింత మెరుగ్గా ఉండటంతో మూడో స్థానం సాధించగా, 2018లో మాత్రం నగర ప్రజల నుంచి స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఢిల్లీలో రాజకీయ పైరీవులు కొరవ్వడంతో మూడో స్థానం కాస్త ఏడో స్థానానికి దిగజారింది. అయితే దీనికి ప్రధానం కారణం జీవీ ఎంసీ అధికార యాంత్రాంగం ఎంతో ఉన్న సిబ్బంది అందరితోనే నెల రోజుల పాటు స్వచ్చసర్వేక్షన్‌పై అవగాహన, సిటిజన్ ఫీడ్‌బ్యాంక్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా 2019లో మరోసారి స్వచ్ఛ సర్వేక్షన్ పరిశీలన కేంద్రం బృందం ఈ నెల నాల్గోవ తేది నుంచి నగరంలో పర్యటించనుంది.
* జనవరి నాలుగు నుంచి దేశ వ్యాప్తంగా సర్వే
కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సర్వే ఈ ఏడాది జనవరి నాల్గోవ తేది నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే గతేడాది ఈ సర్వేబృందం సర్వే ముగిసే సమయంలో వచ్చి నగరాన్ని పరిశీలించినప్పటికీ ఈ ఏడాది మాత్రం ప్రారంభం నుంచే పరిశీలించే అవకాశం ఉండటంతో జీవీఎంసీ ప్రజారోగ్య విభాగాధికారులు, స్వచ్చ సర్వేక్షన్ ఐఈసీ విభాగ సిబ్బంది సన్నద్దమవుతున్నారు. అయితే తనిఖీ వచ్చే బృందం వివరాలు మాత్రం జీవీ ఎంసీ అధికారులకు కూడా తెలియకుండా రహస్యంగానే ఉంచడం విశేషం. మరో విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీ ఎంసీకి 163 పాయింట్లు లభించాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌లో వంద పాయింట్లు సొంతం చేసుకొగా, ఫిర్యాదుల విషయంలో జీవీ ఎంసీ స్పందనకు 45.18శాతం, స్వచ్చతాయాప్ వినియోగంలో 0.82శాతం, సమస్య పరిష్కారం అయిన తరువాత ప్రజలు ఇవ్వాల్సిన ఫీడ్‌బ్యాక్‌లో కేవలం 17 పాయింట్లు సాధించింది. అయితే 2018లో ఏపీలోని ఐదో ర్యాంక్ సాధించిన తిరుపతి నగరం ప్రస్తుతం 167పాయింట్లుతో అగ్రభాగన నిలవడంతోపాటు, ఆరో ర్యాంక్ సాధించిన విజయవాడ 129 పాయింట్ల సాధించింది. అయితే ఈ ఏడాది విశాఖ నగరాన్ని తొలిస్థానంలో ఉంచేందుకు జీవీ ఎంసీ కమిషనర్ హరినారాయణన్ సూచనలతో అధికార యాంత్రాగమంతా కృషి చేస్తున్నారు. ఈ సర్వేలో కీలకపాత్ర పోషించాల్సిన ప్రజలు కూడా తగిన విధంగానే సమాయత్తం మవుతున్నారు. మహా విశాఖ నగరాన్ని టాప్ 3లోచోటు దక్కించుకునేందుకు జీవీ ఎంసీ అధికారులు ప్రజలను చైతన్య పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

* తొలిస్థానమే లక్ష్యం: జీవీ ఎంసీ కమిషనర్
కేంద్రం ప్రకటించే స్వచ్చ సర్వేక్షణ్ పోటీల్లో ఈ ఏడాది మహా విశాఖ నగరం తొలిస్థానం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మా అధికారులతో పాటు ప్రజలు కూడా పారిశుద్ధ్యం, ఇతర వసతుల విషయంలో శ్రద్దగా ఉంటూ గ్రేటర్‌సీటిని టాప్ వన్‌లో నిలిపి ఉంచాల్సిన బాధ్యత ఉంది. ఈ ఏడాది విశాఖ నగరం దేశంలోనే తొలిస్థానం సాధిస్తుందని ఆశిస్తున్నాం. కేంద్ర బృందానికి ప్రజలంతా సహకిరించి, నగరాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.