విశాఖ

పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత టీడీపీ దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జనవరి 19: అయ్యన్నయువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు అయ్యన్న కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించిన విజయ్‌కు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈసందర్భంగా గత నాలుగున్నరేళ్ళలో వార్డు పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేసారు. ఈసందర్భంగా వార్డు ప్రజలు పలు సమస్యలను విజయ్‌దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈసందర్భంగా విజయ్ ప్రకటించారు. 27వ వార్డులో 13.64 కోట్లతో మంత్రి అయ్యన్నపాత్రుడు అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఈకార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు , టీడీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

చిన్నారి చదువు కోసం 20 వేల ఆర్థిక సహాయం
నర్సీపట్నం, జనవరి 19: తల్లి లేని చిన్నారి చదువు కోసం స్థానిక శ్రీ రామాంజనేయ వస్త్రాలయం అధినేత కాశపురాంబాబు 20 వేల రూపాయల ఆర్ధిక సహకారం అందించారు. పట్టణంలోని రెల్లివీధికి చెందిన హరీష్, స్రవంతి దంపతులకు అఖిల అనే రెండేళ్ళ పాప ఉంది. ఇటీవల తల్లి స్రవంతి అకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిలేని అఖిల చదువు నిమిత్తం రాంబాబు ఈ ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో పాపను ఆదుకోవాలని ఉద్దేశ్యంతో 20 వేల రూపాయలు అఖిల తాతగారు అయిన బాలచంద్రరావుకు అందజేసినట్లు తెలిపారు. ఉదారంగా తన మనుమరాలు చదువు నిమిత్తం ఆర్ధిక సహాయం అందజేసిన రాంబాబుకు బాలచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈమొత్తాన్ని పాప పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేస్తామని ఆయన తెలిపారు.

వామలింగేశ్వర ఆలయంలో శనిత్రయోదశి ప్రత్యేక పూజలు
మాకవరపాలెం, జనవరి 19: మండలంలోని పైడిపాల సమీపంలో ఉన్న వామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం శనిత్రయోదశి పురష్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు నవగ్రహ హోమం, గణపతి హోమం , రుద్రహోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులతో పాటు ఆలయ ధర్మకర్త చాగంటి జగ్గరాజు పాల్గొన్నారు. ఆలయ పురోహితుడు దొరబాబు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఈహోమం నిర్వహించారు.