విశాఖ

టీడీపీని వీడేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 19: తనకు ఉన్నతమైన స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితులలోనూ వీడేది లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ స్పష్టం చేసారు. అరకులోయలో నిర్వహిస్తున్న హట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె శనివారం విలేఖరులతో మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను మంత్రి వద్ద 34ఆంధ్రభూమి22 ప్రస్తావించగా తనపై గిట్టనివారు ఇటువంటి దుస్ప్రచారం చేస్తున్నారని ఖండించారు. తాను ఇంతటి ఉన్నత స్థానంలో ఉన్నానంటే అందుకు తెలుగుదేశం పార్టీయే కారణమని, ఇటువంటి పార్టీని ఎందుకు విడిచిపెడతానని ఆమె ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్టు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి తమ ప్రభుత్వం ఇతోధికమైన కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆమె అన్నారు. తమ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉండడంతో మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారని ఆమె అన్నారు. గతంలో తన తల్లిదండ్రులు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ప్రజా సేవను ఎన్నడూ మరువలేదని, వారి బాటలో తాను నడుచుకుంటూ ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నట్టు అఖిలప్రియ చెప్పారు.

పొగ మంచుతో అవస్థలు పడుతున్న ప్రజలు
కోటవుటర్ల, జనవరి 19: చలిగాలుల ఉదృతితో పాటు దట్టంగా పడుతున్న మంచు వలన ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. వారం రోజుల నుంచి విపరీతంగా పడుతున్న పొగ మంచు కారణంగా ఉదయం తొమ్మిది గంటల వరకు సూర్యోదయం కావడం లేదు. సాయంత్రం మూడు గంటల నుంచే చలిగాలులు వీస్తుండడంతో పనులపై బయటకు వెళ్ళిన ప్రజలు తొందరగా ఇళ్ళకు చేరుకుంటున్నారు. అలాగే ఉదయం తొమ్మిది గంటల దాటిన తరువాతే ప్రజలు బయటకు వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు.

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయండి
పాయకరావుపేట, జనవరి 19: డి ఎస్సీ 1998, 2008,2012 కామన్ మెరిట్‌లో సెలక్ట్ కాబడి నష్టపోయిన బీ ఇడి అభ్యర్థులకు న్యాయం చేయాలని పీ ఆర్‌టీయు రాష్ట్ర నాయకులు గాదె శ్రీనివాసులనాయుడికి వినతి పత్రం అందజేసారు. శనివారం పట్టణంలో సమ్యమంతుల రెడ్డి ప్రాథమిక పాఠశాలలో ఎపీ బీ ఇడీ స్టూడెంట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు జిల్లా వెలుగులం జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1998,2008,2012లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగే విధంగా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో బీ ఇ డీ అభ్యర్థులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
కొయ్యూరు,జనవరి 19: పౌష్టికాహారం తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రగతిసిరి స్వచ్చంద సంస్థ ప్రతినిధి గెడ్డం విజయలక్ష్మి సూచించారు. మండలంలోని డౌనూరు పంచాయతీ నిమ్మలపాలెం గ్రామంలో క్రై సంస్థ , ప్రగతిసిరి స్వచ్చంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు పౌష్టికాహార లోపంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పౌష్టికాహార లోపం వలన కలిగే ఇబ్బందులను వివరించారు. గర్భిణీ స్ర్తిలు, బాలింతలు, కిశోర బాలికలు సరైన పోషకాహారం తీసుకోక పోవడం వలన రక్తహీనతతో పాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు . మారుమూల ప్రాంతాల గిరిజనులకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు వీలుగా బాలల సంఘాలు , యువజన , మహిళాగ్రూప్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో 18 గ్రామాల్లో ఈ గ్రూప్‌ల ద్వారా ఆదివాసీలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సమస్యలను అధికారులకు తెలిపే విధంగా వీరిని సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సంస్థ కార్యకర్తలు లక్ష్మి, రమణమ్మలు పాల్గొన్నారు.