విశాఖ

ఉల్లాసంగా బుడగల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 19: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో రెండో విడత అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగుతుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్.టి.ఆర్. క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బెలూన్ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకలలో రెండో రోజైన శనివారం ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులతో పాటు గిరిజనులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్న బెలూన్ల విహంగ విహారాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన బెలూన్లను చూసేందుకు వచ్చిన జనంతో ఈ ప్రాంతం కిటకిటలాడి నూతన శోభను సంతరించుకుంది. బెలూన్ ఉత్సవాల ప్రారంభం రోజు అదరహో అనిపించగా, రెండో రోజు ఈ వేడుకలు చూపరులను మరింత ఆకట్టుకుని ఔరా అనిపించాయి. దట్టంగా కురుస్తున్న పొంగ మంచు కారణంగా బెలూన్ల విన్యాసం ఆలస్యంగా ప్రారంభవౌతున్నప్పటికీ ముందుగా క్రీడా మైదానానికి చేరుకునే పర్యాటకులు, స్థానికులు, గిరిజనులు నిరీక్షిస్తూ బెలూన్ల ప్రదర్శనను ఆశక్తిగా తిలకిస్తున్నారు. బెలూన్ల ఫెస్టివల్‌ను వీక్షించేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న జనాన్ని చూసి విదేశీ ప్రతినిధులైన బెలూన్ల నిర్వాహకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వీటిని ఎగురవేస్తున్నారు. ఒకదాని వెనుక మరొకటి గాలిలో ఎగిరే బెలూన్లు చూపరులను కనువిందు చేస్తున్నాయి. అయితే గాలి దిశ ఆధారంగా ప్రయాణించే బెలూన్లు దిగేటప్పుడు మాత్రం కొంత అంతరాయం ఏర్పడుతుండడంతో బెలూన్ల దిశ ఎటువైపు వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుంది. మొదటి రోజు అదృష్టవశాత్త కొందరికి ప్రమాదం తప్పగా, మరికొందరు సునాయసంగా బెలూన్లలో విహరించారు. ఎన్.టి.ఆర్. క్రీడా మైదానం నుంచి ఆకాశానికి ఎగిరే బెలూన్లు అరకులోయకు దూరంగా కొండలు, గుట్టలు, పంట పొలాలపై దిగుతుండడంతో ఇందులో విహరించే వారు కొందరు స్వల్ప గాయాలకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో బెలూన్లలో విహరించే వారిలో కొంత భయాందోళన నెలకొన్నప్పటికీ గాలిలో ఎగిరే ఈ విన్యాసంలో పాలుపంచుకునేందుకు పోటీ పడుతున్నారు. అరకులోయలో నిర్వహిస్తున్న బెలూన్ ఫెస్టివల్‌లో 15 దేశాలకు చెందిన వివిధ ఆకృతులు కలిగిన బెలూన్లు గాలిలో విహరిస్తూ పలువురిని అలరిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు అఖిలప్రియ, కిడారి శ్రావణ్‌కుమార్ బెలూన్లలో విహరించారు. అదేవిధంగా పలువురు పర్యాటకులు, స్థానికులు హాట్ ఎయిర్ బెలూన్లలో విహరించి తీయటి అనుభూతిని పొందారు. సినీ కథనాయకుడు నందమూరి బాలక్రిష్ణ సతీమణి నారా బ్రాహ్మణి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సతీమణి కుటుంభ సభ్యులతో కలిసి బెలూన్లు ఎగురవేసే ప్రాంగణానికి చేరుకున్నారు. కాగా బెలూన్ ఫెస్టివల్ ఆదివారంతో ముగుస్తుండడంతో చివరి రోజు ఈ ఉత్సవానికి మరింత ఆదరణ లభించే అవకాశం కనిపిస్తోంది.