విశాఖపట్నం

25న జాతీయ ఓటర్ల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: ఈ నెల 25న జరగనున్న జాతీయ ఓటర్ల దినోత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి తేజ్ భరత్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి రిటర్నింగ్ అధికారులు, డీఈఓ, ఇంటర్ బోర్డు అధికారి, ఎన్‌సీసీ, యువజన సంక్షేమ శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా ఓటరుగా నమోదైన యువతకు ఎపిక్ కార్డులు అందజేయాలన్నారు. అలాగే ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న వారిని, స్వాతంత్య్ర సమరయోధులను, ఉత్తమ బీఎల్‌ఓలను, అత్యధికంగా ఓటర్ల నమోదు చేయించిన కళాశాల ప్రిన్సిపాల్స్‌ను సత్కరించాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా అన్ని కళాశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు జిల్లా స్థాయిలో ఈనెల 22న కృష్ణా కళాశాలలోను, రాష్ట్ర స్థాయి పోటీలను ఈ నెల 24న విజయవాడలోను నిర్వహించనున్నట్టు తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని 25వ తేదీ ఉదయం 8 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించి ర్యాలీగా చిల్డ్రన్స్ థియేటర్‌కు ర్యాలీగా రావాలని సూచించారు.