విశాఖపట్నం

భూములిచ్చే రైతులకు తాయిలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: రైతుల నుంచి భూములు తీసుకునేందుకు విశాఖ మెట్రోరీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (వీఎంఆర్‌డీఏ) సరికొత్త పంథాన ఎంచుకుంది. ఇప్పటికే నగర శివార్లలోని పెందుర్తి, ఆనందపురం, భీమునిపట్నం మండలాలతో పాటు గాజువాక, పరవాడ, సబ్బవరం మండలాల పరిధిలోని ట్రై జంక్షన్‌లో భూముల సమీకరణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో భూ సమీకరణకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో వీఎంఆర్‌డీఏ ఆయా ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహిస్తూ రైతులకు భూములు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తోంది. ఆనందపురం మండలం రామవరంలో 300 ఎకరాలు, దబ్బందలో 65 ఎకరాలు, భీమిలి మండలం కొత్తవసలసలో 95 ఎకరాలు, పెందుర్తి మండలం ముదపాకలో 560.66 ఎకరాలు, ఎస్‌ఆర్ పురంలో 95 ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే పెందుర్తి మండలం ఎస్‌ఆర్ పురం, భీమునిపట్నం మండలం కొత్తవలస, ఆనందపురం మండలం దబ్బంద గ్రామాల్లో గ్రామసభల నిర్వహణ పూర్తి చేసింది. వీఎంఆర్‌డీఏ కమిషనర్ బసంత్ కుమార్ గ్రామాల్లో సభలు నిర్వహిస్తూ రైతులను భూములిచ్చేలా సిద్ధం చేస్తున్నారు. భూములిచ్చే రైతులకు చట్టప్రకారం పరిహారంతో పాటు నగర పరిధిలో ఇళ్లు ఇస్తామంటూ తాయిలాలు ఎరవేస్తున్నారు. కొద్ది రోజుల కిందట సబ్బవరం, గాజువాక, పరవాడ మండలాల పరిధిలోని ట్రై జంక్షన్‌లో 900 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి ఐదు గ్రామాల్లో జరిగిన సభల్లో రైతులు తాము భూములు ఇచ్చేది లేదంటూ ఎదురుతిరిగారు. 2013 భూ సేకరణ చట్టం నిబంధనల మేరకు తమకు పరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడంతో ట్రైజంక్షన్ భూ సమీకరణ ముందుకు సాగలేదు. దీంతో రైతులను మచ్చిక చేసుకుంటేనే సమీకరణ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయని భావించిన వీఎంఆర్‌డీఏ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది.
తాజాగా పెందుర్తి మండలం ముదపాకలో శనివారం జరిగిన గ్రామసభలో రైతులతో వీఎంఆర్‌డీఏ కమిషనర్ బసంత్ కుమార్ స్వయంగా సమావేశమయ్యారు. వీఎంఆర్‌డీఏ భూములను సమీకరించి గృహనిర్మాణాల నిమిత్తం అభివృద్ధి చేస్తామని, రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసానిస్తున్నారు. ముదపాకలో సమీకరించే భూములకు సంబంధించి అత్యధికంగా పట్టా భూములు ఉన్నాయని, పట్టా రైతులకు కూడా నిబంధనల మేరకు లబ్దిచేకూరుతుందని వివరిస్తున్నారు. ఈనెల 27 వరకూ భూ సమీకరణకు సంబంధించి రైతుల నుంచి అంగీకారం, అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. దీనిపై సందేహాలుంటే రెవెన్యూ, వీఎంఆర్‌డీఏను సంప్రదించాల్సిందిగా కోరారు. రైతుల అభ్యంతరాలను ఫారం-2 ద్వారా రాత పూర్వకంగా తెలపాలన్నారు. ముదపాకలో 500పై చిలుకు ఎకరాలకు గాను 300 మంది రైతులు తమ సమ్మతి తెలిపారని, వీరిలో 140 మంది ఆక్రమణ దారులు కాగా, 136మంది అసైన్డ్ రైతులున్నారన్నారు. గ్రామసభలో వీఎంఆర్‌డీఏ ఎస్టేట్ అధికారి మురళీ, విశాఖ ఆర్డీఓ తేజ్ భరత్, చీఫ్ అర్బన్ ప్లానర్ భవానీ శంకర్, వీఎంఆర్‌డీఏ, పెందుర్తి తహశీల్దార్లు పాల్గొన్నారు.