విశాఖపట్నం

ఈ ఆఫీస్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి నిత్యం జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఇక మీదట ఈ ఆఫీస్ ద్వారానే జరగాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రజావాణిలో పాల్గొన్న ఆయన, అక్కడే అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. నేటి నుంచి మూడు నెలల గడువు ఇస్తున్నామని, అప్పటి నుంచి ప్రభుత్వ శాఖల్లో జరిగే కార్యకలాపాలన్ని ఈ ఆఫీస్ ద్వారానే జరగాలన్నారు. అనంతరం 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో 50 శాతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, మిగిలిన అంశాలను ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. మంచినీరు, పారిశుద్ధ్యం ఏర్పాట్లను జీవీఎంసీ, మెమొంటోలు, అల్పాహారం పౌర సరఫరాల శాఖ, ఆహ్వానాలు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల సదుపాయాలను రెవెన్యూ శాఖ చూడాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించిని అంశాలతో శకటాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గడచిన మూడేళ్లలో ఒక్కసారి కూడా అవార్డులు అందుకోని ఉద్యోగులను ఈ సారి మెరిట్ సర్ట్ఫికెట్లకు సిఫారసు చేయాలని సూచించారు. దీనికోసం సిఫారసు చేసే ఉద్యోగులపై గతంలో ఎటువంటి ఆరోపణలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ విషయంలో ఎదురయ్యే విమర్శలకు ఆయా శాఖల ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దినేష్‌కుమార్, డీఆర్‌ఓ చంద్రశేఖర రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

డీఎస్‌టీ శాస్తవ్రేత్తకు గీతంలో సన్మానం
ఆరిలోవ, జనవరి 21: భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఎంకే శింగ్ గీతం డీమ్డ్ యూనివర్శిటీని సోమవారం సందర్శించారు. విశ్వవిద్యాలయంలో పరిశోధకులతో ఈ సందర్భంగా ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం డాక్టర్ శింగ్‌ను గీతం విద్యా సంస్థల అధ్యక్షుడ శ్రీ భరత్ సత్కరించారు. ఈ సందర్భంగా శింగ్ మాట్లాడుతూ స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న శ్రీ భరత్ నేతృత్వంలో గీతం విద్యా సంస్థలు మరింత పురోభివృద్ధి సాధిస్తాయని ఆకాంక్షించారు. గీతం పరిశోధకులకు డీఎస్‌టీ అందిస్తున్న సహకారాన్ని శ్రీ భరత్ కొనియాడారు. కార్యక్రమంలో గీతం యూజీసీ వ్యవహారాల డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ రామకృష్ణ తదితరులు అభినందించారు.