విశాఖపట్నం

ప్రజలను ఆకర్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 21:ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి కొనసాగిస్తున్నాం. మన కష్టాన్ని వివరిస్తూ ప్రజలను ఆకర్షించే బాధ్యత నాయకులదే నంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలకు దిశానిర్ధేశం చేశారు. అమరావతి నుంచి పార్టీ నాయకులు, ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేప పథకాలతో పాటు కేంద్రం రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మండల, గ్రామస్థాయి ప్రజలకు ఈ విషయాలు వివరించడం కార్యకర్తల కర్తవ్యమన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. బీసీ అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించేందుకు రాజమహేంద్రవరంలో నిర్వహించే జయహో బీసీ సదస్సు విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో బీసీలు పాల్గొనేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరి, పీలా గోవింద్, ఎమ్మెల్సీ పప్పల చలపతి రావు, నగర పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్, అర్బన్, రూరల్ ప్రధాన కార్యదర్శులు చోడే పట్ట్భా, బుద్ధ నాగజగదీశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి ఎండీ నజీర్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన యువకులు
నగరంలో నాలుగు నియోజకవర్గాలకు చెందిన పలువురు యువకులు టీడీపీలో చేరారు. వీరికి నగర పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వీరంతా పార్టీలో చేరినట్టు ఆయన వెల్లడించారు.