విశాఖ

వ్యవసాయ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, జనవరి 23: తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా విశాఖ జిల్లాను కరువుప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందని ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ విమర్శించారు. స్థానిక గోవిందరావు భవనంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు వైఎన్ భద్రం అధ్యక్షతన బుధవారం వ్యవసాయ రంగ సంక్షోభం, వలస కూలీల నివారణ బాధ్యత ప్రభుత్వానిదే అనే అంశంపై ఉపాధికూలీలతో అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆదినారాయణ మాట్లాడుతూ గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా తక్కువ వర్షపాతం నమోదై అటు రైతులు, ఇటు వ్యవసాయ కూలీలు తీవ్రంగా నష్టపోయినా విశాఖను కరువు జిల్లాగా ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వం చిన్నచూపుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే రైతులు వలసకూలీలుగా మారుతున్నారని ఆయన ఆరోపించారు. వలసకూలీలను నివారించాలంటే ఉపాధి హామీ పథకంలో రెండువందల రోజులు పని దినాలు ప్రకటించి ఐదువందలు రోజుకూలీ ఇచ్చి ఇతర రక్షణ సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మరో ముఖ్య అతిధి అసిస్టెంట్ లేబర్ కమీషనర్ రమ్య మాట్లాడుతూ ఉపాధి కూలీలకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుద్వారా భీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.వెంటనే ఉపాధికూలీలు బోర్డులో సభ్యులుగా నమోదుచేయించుకొని ప్రతీ ఎడాది భీమాను రెన్యూవల్ చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.ఎండీవో వెంకట రమణ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు అప్పగించిన పని దినాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పనులుల్లోగాని, చెల్లింపుల్లోగానీ ఎటువంటి సమస్య వచ్చినా తమకు తెలియజేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు పెంటకోట సత్యనారాయణ, సిసిఐ మండల కార్యదర్శి ఆడారి అప్పారావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కోన లక్ష్మిణ, శ్రీరామదాసు అబ్బులు వివిధ మండలాలు నుండి ఉపాధి కూలీలు, వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.
గాలిభీమవరంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల పంపిణీ
సబ్బవరం, జనవరి 23 : మండలంలోని గాలిభీమవరంలో బుధవారం శ్రీ సీతారాముల వారి తీర్థమహోత్సవం సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈపోటీలకు సుమారు 23 మంది మహిళలు హాజరయ్యారు. వారిలో పి.సునీత ప్రథమ బహుమతి, పి. వెంకట లక్ష్మి ద్వితీయ బహుమతి, జి.్భవానీ తృతీయ బహుమతులను కైవశం చేసుకున్నారు. వారికి ఆలయ కమిటీ ముందుగా ప్రకటించిన విధంగా గృహోపకరణాలైన గ్రైండరు, మిక్సీ,కుక్కర్ లాంటి ఉపకరణాలను పంపిణీ చేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతీ మహిలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమానికి గ్రామ మాజీ ఉపసర్పంచు గొర్లిరాజేష్ అధ్యక్షత వహించగా మండల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు పాలిశెట్టి సురేష్ రాజ్ ముఖ్య అతిధిగాహాజరయి మాట్లాడుతూ ఇలాంటి పోటీలు మహిళల్లో ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతాయన్నారు. కేవలం పిల్లల పోషణ, వంటింటికే పరిమితమవుతూ ప్రస్తుత యాంత్రీకరణ జీవితంలో ఇలాంటి పోటీల్లో పాల్గొనటం వలన వారిలో సృజనాత్మకత బయటపడుతుందన్నారు. ఈకార్యక్రమంలో యూత్ సభ్యులు పి.బంగారునాయుడు, పి.వెంకటేష్, సండ్రాన ఐలనాయుడు, పి.నాగేష్, గంటా అప్పారావులు పాల్గొన్నారు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.