విశాఖ

ఎన్టీ ఆర్ మంజూరు చేసిన డిగ్రీ కళాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జనవరి 23: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సహకారంతోనే ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉందని రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కోటి 40 లక్షలతో నూతనంగా నిర్మించిన బాలికల వసతి గృహాన్ని , అదనపు తరగతి గదులను , డైనింగ్ హాల్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 12 డిగ్రీ కళాశాలల్లో నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో మాత్రమే పూర్తి స్థాయిలో అన్ని వసతులు ఉన్నాయన్నారు. 1983లో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఎన్టీ ఆర్ తనను పిలిచి ఏం కావాలో కోరుకో అని అడిగారన్నారు. డిగ్రీ కళాశాల కావాలని అడుగగా, తక్షణమే మంజూరు చేసారని గుర్తు చేసారు. అనంతరం అప్పటి సబ్ కలెక్టర్ జయప్రకాష్‌నారాయణ భవనాల నిర్మాణానికి 16 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసారన్నారు. గత మూడు దశాబ్దాల కాలంగా కళాశాలలో అనేక మంది విద్యార్థులు చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు పలువురు విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. కళాశాలకు అన్ని వసతులతో పాటు అవసరమైన లెక్చరర్స్‌ను కూడా నియమించడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో ఈ కళాశాల మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేసారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రావు, అధ్యాపకులు, సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.
25న నర్సీపట్నం , యలమంచిలి డిగ్రీ కళాశాలల్లో యువపార్లమెంట్
నర్సీపట్నం, జనవరి 23: స్థానిక అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 25వ తేదీన యువ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ జిల్లా మేనేజర్ రాజేంద్రన్ తెలిపారు. బుధవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నం డివిజన్‌కు సంబంధించి ప్రభుత్వ కళాశాల, అనకాపల్లి డివిజన్‌కు సంబంధించి యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈకార్యక్రమం నిర్వహిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగే యువ పార్లమెంట్ కార్యక్రమాన్ని యువతీయువకుల భాగస్వామ్యంతో నిర్వహిస్తామన్నారు. యువతీయువకుల్లో పార్లమెంట్, చట్టసభలు, రాజ్యాంగం పట్ల అవగాహన, చట్టసభల యొక్క అధికారాలు, మహిళా రిజర్వేషన్లు, జాతీయ సమైఖ్యత, ఎన్నికలు,అవినీతి సంస్కరణలు, అధ్యక్షుల విధులు తదితర అంశాలపై చర్చలు నిర్వహిస్తామన్నారు. తద్వారా యువతలో సామాజిక చైతన్యం కలిగిస్తామని వివరించారు. ఆయా డివిజన్లలోని డిగ్రీ కళాశాలల్లో చదువుకుంటున్న 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీయువకులు ఈయువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు రెండు పాస్‌పోర్టు సైజ్‌ఫోటోలు, ఆధార్ కార్డు, విద్యార్హత సర్ట్ఫికెట్ జెరాక్స్ కాఫీలు , పుట్టిన తేదీ ధృవపత్రాలను నర్సీపట్నం , యలమంచిలి డిగ్రీ కళాశాలల్లో పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. కళాశాలల ప్రిన్సిపల్స్ వెంకట్రావు, మాల్యాద్రి, సెట్విస్ మూర్తి, ఇతర అధ్యాపకులు ఈకార్యక్రమాన్ని సమన్వయం చేస్తారని తెలిపారు.
కొత్తూరులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజికి ప్రతిపాదన
*ఎన్‌ఆర్‌జిఎస్ ప్రోజెక్టు డైరెక్టర్ దయానిధి
అనకాపల్లిటౌన్, జనవరి 23: కొత్తూరుగ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి ప్రతిపాదన చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌జిఇఎస్ ప్రోజెక్టుడైరెక్టర్ బి దయానిధి తెలిపారు. డైయల్ యువర్ కలెక్టర్‌కు శారదానగర్ 6వ వీధికి చెందిన ముత్యాల సంద్యా అనే మహిళ గత మూడురోజులు క్రితం పోన్‌చేసి డ్రైనేజీ సమస్యపై పిర్యాధుచేసిన మేరకు కలెక్టర్ కె భాస్కర్ ఆదేశాలమేరకు బుధవారం ఆయన కొత్తూరు శారదానగర్‌లో పర్యాటించారు. పిర్యాదు చేసిన మహిళ సంద్య ఇంటికి స్వయంగా వెళ్ళి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐదువేల జనాభాకలిగిన ప్రతీ గ్రామంలోఅండర్ గ్రౌండ్ డ్రైనేజిని నిర్మించడానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తుందన్నారు.శారానగర్ రోడ్డు విస్తరణలో భాగంగా నిర్మించనున్న డ్రైనేజి కాలువకు ఆనుసందానం చేస్తూ ఆయా విధుల్లో అండర్ గ్రౌండు డ్రైనేజిని నిర్మించడం జరుగుతుందన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాధన తయారుచేసి నివేధిక అందజేయాలని జెఇ విజయలక్ష్మి, డీఇ దుర్గాప్రసాద్‌కు ఆదేశించారు.ఆయన వెంట ఎంపీడీవో వెంకట రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.