విశాఖపట్నం

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం,జనవరి 23: ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్ట్యా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, పూర్తిస్థాయిలో అందేలా చూడాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నగరంలో బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన చినరాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు, వితంతువులకు అందిస్తున్న ఫించన్లును సకాలంలో అందేలా చూడాలన్నారు. అదే విధంగా త్వరలోనే రాజమహేంద్రవరంలో నిర్వహించే జయహో బీసీ సదస్సును విజయవంతం చేయాడానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వారీగా వెనుకబడిన వర్గాల నాయకులను, ప్రతినిధులను సమన్వయం పర్చుకొని సదస్సును విజయవంతం చేయాలన్నారు. అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయాడానికి నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమీకరించాలన్నారు. రాష్ట్ర రోడ్లు,్భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయపధాన నడిపించడానికి పార్టీ శ్రేణులు మరింత కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, గణబాబు, వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే రెహమాన్, గవిరెడ్డి రామానాయుడు, అర్భన్, రూరల్ ప్రధాన కార్యదర్శులు వెంకటపట్ట్భారామ్, నాగజగదేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి, మత్స్యరాస మణికుమారి, గంటెల సుమన, గండి బాబ్జీ, కార్యదర్శి ఎండీ నజరీ, రాజమండ్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు.