విశాఖపట్నం

మెరుగైన వైద్యసేవలందిచడమే లక్ష్యంగా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం,జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నూతన వైద్యులంతా జిల్లాకు చేరుకున్నారు. దీనిలో భాగంగా బుధవారం డి ఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుపతిరావును మర్యాద పూర్వకంగా కలసి నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా డి ఎంహెచ్‌వో కొత్త వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలోని 91 పీహెచ్‌సీలకు వైద్యుల పోస్టులను భర్తీ చేశామని, ఈ నేపథ్యంలో ప్రజలకు వైద్యసేవలు అందించే విషయంలో ఎటువంటి లోపాలు, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విధుల పట్ల బాధ్యతాయుతంగా పనిచేయాలని, గ్రామీణ స్థాయి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొవాలన్నారు. గత రెండు రోజులుగా 30 మంది వరకూ వైద్యులు విశాఖకు వచ్చారని, త్వరలోనే మిగిలన వారు కూడా వారికి కేటాయించిన విధుల్లో చేరుతారన్నారు. ముఖ్యంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులంతా సమయపాలన పాటిస్తూ, నిత్యం గిరిజనులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలందించాలని కోరారు. ప్రభుత్వం ఆరోగ్యశాఖ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రోగలకు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి జీవనరాణి, ఇతర వైద్యులు పాల్గొన్నారు.
కేజీహెచ్ నర్సింగ్ సూపరిండింటెంట్‌గా భాగ్యలక్ష్మీ
విశాఖపట్నం, జనవరి 23: కేజీహెచ్ ఆసుపత్రి గ్రేడ్-2 నర్సింగ్ సూపరిండింటెంట్‌గా బి.్భగ్యలక్ష్మీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆరోగ్యశాఖలో జరిగిన పదోన్నతుల్లో హెడ్‌నర్సు నుంచి గ్రేడ్-2 సూపరిండింటెంట్‌గా పదోన్నతి లభించడంతో ఆమె బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్శింగ్ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన వంతు బాధ్యతగా పనిచేస్తానన్నారు. అలాగే కేజీహెచ్‌లోని అన్ని వార్డుల్లో నర్శింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. ఏపీ నర్సింగ్ అసోసియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు అందించిన భాగలక్ష్మీకి కేజీహెచ్ ఆసుపత్రి నర్శింగ్ సిబ్బందితో పాటు, ఇతర ఆసుపత్రుల సిబ్బంది, ఏపీ నర్శింగ్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నర్శింగ్ అసోసియేషన్ నాయకులు పి.వరలక్ష్మీ,శాంతమ్మ, ఉపాధ్యక్షురాలు మద్దిరాల ఇందిర, తదితరులు పాల్గొన్నారు.