విశాఖపట్నం

మాదిగల హక్కుల సాధనకై పోరాటం ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలను అణగదొక్కలనే ప్రయాత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంపై మాదిగులంతా వారి హక్కుల సాధనకు ఐక్యపోరాటాలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పొరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నగరంలోని బుధవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన వ్యక్తులకు రాష్ట్రంలో కీలక పదవులను అందిస్తున్న టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మాల, మాదిగల జనాభా నిష్పత్తిలో ఎలాంటి తేడా లేనప్పటికీ చంద్రబాబు నాయుడు మాటలకు అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ చైర్మన్ కారం శివాజీ, జూపూడి ప్రభాకర్, మంత్రి నక్కా ఆనందబాబు వీరంతా మాల కులానికి చెందిన వారని, కనీసం మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఎస్సీలను ఎ,బి,సి,డి వర్గీకరణ చేశారని,అదే విధానాన్ని ఏపీలో ఎందుకు అమలు పర్చడం లేదని ప్రశ్నించారు. ఆగ్రవర్ణకులాలకు న్యాయం చేసే విధంగా ప్రకటించిన రిజర్వేషన్ల విషయాన్ని మేము స్వాగతిస్తున్నామని, అయితే పదిశాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తే మిగిలిన అగ్ర కులాల వారి మాటేమిటిని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నాలుగేన్నరేళ్లలో నాలుగువేలు కేటాయించామని ప్రకటిస్తున్న ప్రభుత్వం కనీసం నాలుగు వందల కోట్లు కూడా ఖర్చు చేసిన ధాఖాలాలేవన్నారు. మాదిగల హక్కుల సాధనకు ఫిబ్రవరి 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పది లక్షల మందితో మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. పది లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తామని మహాసభను జయప్రదం చేసేందుకు ఇప్పటికే ప్రకాశం జిల్లా కొత్తపట్నం సాగరతీరం నన్నూరిగార్డెన్స్‌లో మాదిగల విశ్వరూప సమాయత్త మహాసభలు ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించామన్నారు. 13 జిల్లాల్లోను ఎమ్మార్పీఎస్, అనుబంధ విద్యార్ధి, ఉద్యోగ, యువసేన, మహిళా, న్యాయవాదులు, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకుల నుండి తగు సూచనలు స్వీకరించిన అనంతరం 20 రకాలైన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రథ, బైక్, సైకిల్‌యాత్రలు చేస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సారధ్యంలో ఈ మహాసభ జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో మాదిగలు, రెల్లికులస్థులు 40 లక్షలకు పైగా ఉన్నారని ఈ నేపధ్యంలో మాలలు, మాదిగలు రిజర్వేషన్లను సమానంగా పంచుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో మాదిగల సంఖ్య తక్కువుగా ఉందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. మహాసభ జరిగే నాటికి 37 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి మాదిగల్లో చైతన్యం తీసుకువచ్చామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేతలు ఆనందరావు, వంశీ, చెంగళ శ్రీనివాసరావు, అలమండ ప్రసాద్, రవికుమార్, రత్నకుమార్, చెంగళ చిన్న, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.