విశాఖ

నేడు లక్ష ప్రమిదల దీపారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఫిబ్రవరి 14: భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని స్థానిక ఎన్టీ ఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం లక్ష ప్రమిదల దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏటా భీష్మ ఏకాదశి రోజున నిర్వహించే ఈకార్యక్రమాన్ని ఈ ఏడాది మరింత అట్టహాసంగా నిర్వహించేందుకు షిర్డీసాయి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలు దీపాలు వెలిగించేందుకు అనువుగా స్టేడియంను తీర్చిదిద్దారు. రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. వెంకటేశ్వరస్వామి నిలువెత్తు విగ్రహాన్ని ప్రమిదలతో మహిళలు తీర్చిదిద్దారు. ఈకార్యక్రమాన్ని పురష్కరించుకుని శ్రీ షిర్డీసాయి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. శుక్రవారం తెల్లవారు జామున కాకడ హారతి( మేలుకొలుపు)తో ప్రారంభమై నిత్య పూజ, నిత్య హోమం జరుగుతాయి. రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, సతీమణి పద్మావతి దంపతులు ఈ వేడుకలను ప్రారంభిస్తారు. 108 మంది దంపతులచే ఆలయ ఆవరణలో సామూహిక సత్యసాయి వ్రతాలను ఆచరిస్తారు. వ్రతాలు చేయించుకునే దంపతులకు సాయిబాబా వారి ప్రతిమను అందజేస్తారు. మధ్యాహ్నాం 12 గంటలకు స్వామి వారికి హారతి, అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతాయి. సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్టీ ఆర్ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధన జరుగుతుంది. వేలాది మంది మహిళలు పాల్గొననుండడంతో ఆలయ కమిటీ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసారు.

బీసీ గర్జనను విజయవంతం చేయాలి
నర్సీపట్నం, ఫిబ్రవరి 14: వైసీపీ ఆధ్వర్యంలో ఈనె 17న ఏలూరులో జరిగే రాష్ట్ర స్థాయి బీసీ గర్జనను విజయవంతం చేయాలని ఆపార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొటాన రాము పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బీసీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కార్చుతున్నారన్నారు. ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన బీసీలను టీడీపీ ఓటు బ్యాంకుగానే చూస్తోందన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఎందుకు పనికి రాని వృత్తి పరికరాలు అందించి మోసం చేస్తున్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీల ఆర్ధిక స్థితి గతులపై అధ్యయనం చేసారన్నారు. వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డితోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం నవరత్నాల్లో అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే బీసీలను ఆర్ధికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అనంతరం ఏలూరు బీసీ గర్జన వాల్ పోస్టర్‌ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు అంకంరెడ్డి జమీలు, సుర్ల సత్యనారాయణ, శెట్టి నూకరాజు, రుత్తల సత్యనారాయణ, కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్ తమరాన అప్పలనాయుడు, గుడిబండ నాగేశ్వరరావు, జి. లచ్చబాబు, తదితరులు పాల్గొన్నారు.

మెమో జారీపై కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరసన
నర్సీపట్నం, ఫిబ్రవరి 14: ఉద్యోగ భద్రతను కల్పించకపోగా తమను అవమానిస్తూ ప్రభుత్వం మెమోను జారీ చేయడంపై కాంట్రాక్ట్ లెక్చరర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. అసోషియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాల వద్ద ప్రభుత్వం జారీ చేసిన మెమో కాపీలను దగ్ధం చేసారు. ఈసందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్ అసోషియేషన్ రాష్ట్ర కార్యదర్శి బీ ఎస్ ఆర్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్లను తీవ్రంగా మోసం చేసిందన్నారు. ఉద్యోగ భద్రతను కల్పిస్తామని చెప్పిన పాలకులు అసలు ప్రభుత్వ ఉద్యోగులే కాదని అవమానించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం నియమించిన ఎమ్మెల్సీల కమిటీల సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని , కాంట్రాక్ట్ లెక్చరర్లకు బేసిక్‌తో పాటు డీ ఎ కూడా వర్తింపు చేయాలని డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు పాల్గొన్నారు.

బలిఘట్టం, ఉత్తర వాహిని రోడ్డు పనులు ప్రారంభం
నర్సీపట్నం, ఫిబ్రవరి 14 : మున్సిపాలిటీ పరిధి బలిఘట్టం మెయిన్ రోడ్డు నుండి ఉత్తర వాహిని వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. సుమారు 10 లక్షల రూపాయలతో 200 కిలో మీటర్ల పొడవునా సీసీ రోడ్డు , డ్రైనేజీ పనులు చేట్టారు. గురువారం రోడ్డు పనులను రోడ్లు , భవనాల శాఖ డీ ఇ ఇ వేణుగోపాల్ పరిశీలించారు.

చంద్రన్న బీమా నిరుపేదలకు వరం
గొలుగొండ, ఫిబ్రవరి 14: నిరుపేదలకు చంద్రన్న బీమా వరం వంటిదని దేశం పార్టీ నాయకులు తుమ్మగుంట అప్పలనాయుడు అన్నారు. పుత్తడిగైరంపేట పంచాయతీ శివారు అప్పన్నదొరపాలెంలో గత రెండు రోజుల క్రితం ఊడా మల్లేశ్వరరావు మృతి చెందాడు. మృతుని కుటుంబానికి బుధవారం ఐదువేల రూపాయలను ఆయన భార్యకు చంద్రన్న బీమా పథకం ద్వారా అందించారు. ఈసందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పేదలకు వరం వంటిదన్నారు. కుటుంబ యాజమాని మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు చంద్రన్నబీమా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈకార్యక్రమంలో దేశం పార్టీ నాయకులు, బీమా మిత్ర సభ్యులు పాల్గొన్నారు.

అక్రమ కేసులు ఎత్తివేయాలి
రావికమతం, ఫిబ్రవరి 14: ఏకపక్షంగా బనాయించిన కేసులు ఎత్తివేయాలని పలు సంఘాలకు చెందిన దళితులు గురువారం కొత్తకోటలో ర్యాలీ నిర్వహించిన నిరసన తెలిపారు. ఈనెల 10న గ్రామంలో రెండు వర్గాలకు చెందిన యువకులు మధ్య తలెత్తిన వివాదంలో పోలీసులు ఏకపక్షంగా నలుగురు దళిత యువకులపై అక్రమంగా కేసులు బనాయించారని అంబేడ్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు మల్లేటిరాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ కులానికి చెందిన యువకుల వద్ద తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాలని కోరగా అగ్రవర్ణానికి చెందిన ప్రేమ్‌చంద్, అతని మిత్రులు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. దాడికి కారణం అయిన అగ్రవర్ణాలకు చెందిన యువకులను వదిలిపెట్టి పోలీసులు తమ కులానికి చెందిన నలుగురు యువకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తక్షణం అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేసారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌చార్జ్ సీ ఐకు అందజేసారు.

భక్తిశ్రద్ధలతోదుర్గాదేవి ఆలయప్రతిష్ట
రావికమతం, ఫిబ్రవరి 14: మండలంలో మరుపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో దుర్గాదేవి విగ్రహాన్ని గురువారం శాస్త్రోక్తంగా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో జి.శ్రీనివాసరావు నిర్మించిన ఈ ఆలయాన్ని రాచకొండ ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేసారు. చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు దర్శించి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం గ్రామంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు .