విశాఖ

విభిన్న కార్యక్రమాల ద్వారా గిరిజనులకు చేరువవుతున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి. మాడుగుల. ఫిబ్రవరి 14: మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో యువకులను మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులు కాకుండా ఉండటం కోసం, గిరిజనులకు చేరువకావడానికి పోలీసు శాఖ వినుత్న ప్రయాత్నాలు చేస్తుంది. మారుమూల ప్రాంతాలలో అభివృద్ధికు దూరంగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకుని వారిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం కోసం వాలీబాల్ పోటీలు నిర్వహించడం, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు, ఉపాధి చూపించడం వంటి కార్యక్రమాలు చేసి గిరిజనులకు చేరువఅవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు, గిరిజనులకు చేయూతనివ్వడంలో జి. మాడుగుల పోలీసులు ముందున్నారని చెప్పవచ్చు. మండల పరిధిలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి సుమారు వందకు పైగా వాలీబాల్ జట్లుతో మెగా వాలీబాల్ టోర్నీ నిర్వహించి ప్రదమ స్థానం,ద్వితీయ స్థానం, తృతీయ స్థానం లో నిలిచిన వారికి వరుసగా రూ. 50,20, 10 వేలు చొప్పున బహుమతులు ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించారు. అంతటితో ఆగకుండా రెండు రోజులు క్రీడలలో పాల్గొన్న గిరిజనులు, యువతతో జిల్లా రూరల్ ఎస్పి బాబుజీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుని సహపంక్తి బోజనాలు చేసి గిరిజనులతో మమేకం అయ్యారు. ఈ కార్యక్రమంతో ఈ ప్రాంత గిరిజనులకు పోలీసుల మీద నమ్మకం ఏర్పడిందని చెప్పవచ్చు. యువతలో ప్రతిభను వెలికి తీయడంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వార రైతులకు ఎరువులు, వృద్ధులకు రగ్గులు, మహిళలకు వంట పాత్రలు, దోమల నుంచి రక్షణగా దోమ తెరలు పంపిణీ చేసి గిరిజనులకు చేరువవుతున్నారు. మారు మూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం కోసం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నూతనంగా రహదారులు నిర్మణం జరిగేలా చూస్తు, రహదారులు మంజూరుకు ప్రభుత్వానికి పోలీసు శాఖ నుంచి సిఫార్సులు కూడా చేస్తున్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్యనైనా మా దృష్టికి తీసుకువస్తే సంబందిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. ఎదిఏమైనా మన్యంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో పట్టు కోసం పోలీసులు శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు గిరిజనులు స్వీకరిస్తారో వేచి చూడాల్సిందే.
ప్రసాద్ నియమకం పై హర్షం
జి.మాడుగుల. ఫిబ్రవరి 14: జీ.జీ.సీ. చైర్మన్ గా ఎం.వి.వి. ప్రసాద్ నియమకం పట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తంచేసారు. గురువారం స్థానిక విలేఖరులతో వారు మాట్లాడుతు తెలుగుదేశం పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తు, పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రసాద్ కు పార్టీ మంచి గుర్తింపునిచ్చిందని అభిప్రాయపడ్డారు. తెలుకుదేశం పార్టీలో నిబద్ధతగా పని చేస్తే ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని అన్నారు. మన్యంలో పార్టీ కోసం పని చేస్తున్న వారికి ఇంతటి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు దేశం పార్టీ నాయకులు సోమెలి చిట్టిబాబు, కిముడు కళ్యాణం, సమిరె డ్డి నాగబ్బాయి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
దొర్ల వీధీలో మంచి నీటి ఎద్దడి
మాడుగుల. ఫిబ్రవరి 14: మండల కేంద్రంలోని దొర్ల వీధీ లో మంచినీటి బోరు మరమ్మత్తులకు గురై నెలలు గడుస్తున్న అధికారులు పటించుకోవడం లేదని దొర్ల వీధీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు వేసవికాలంలో తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు చెపుతున్న , పిన చేసే విషయంలో అధికారుల మాటలు నీటి మూటలుగా మిగిలిపోతుంది. సుమారు 200 కుటుంబాలు నివాసముంటున్న ఈ వీధీలో ఒక్క బోరు మాత్రమే ఉందని అది కూడా ప్రస్తుతం మరమ్మత్తులకు గురైందని, ఇప్పుడు తాగు నీరు కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొవలసి వస్తుందని అన్నారు. వేసవికాలం దాపరిస్తున్న సమయంలో మంచి నీరు బోర్లు బాగుచేసి ప్రజల అవసరాలు తీర్చాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

మన్యం అభివృద్ధి జరగాలంటే మళ్ళీ తేదేపా అధికారంలోకి రావాలి
పాడేరు.్ఫబ్రవరి 14: గిరిజన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. స్థానిక క్యాంప్ కార్యలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతు గిరిజన ప్రాంత అభివృద్ధికు గిరిజనుల సంక్షేమానికి, తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏజెన్సీ ఘణనీయమైన అభివృద్ధి సాదించినప్పటికి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నట్టు ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతలో శతశాతం అభివృద్ధిను చూడవచ్చునని ఆమె చెప్పారు. దీనిని గిరిజనులంతా గుర్తించి ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టాలని ఆమెకోరారు. ప్రభుత్వ అమలు చేస్తున్న అనేక సం క్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని గ్రామ, గ్రామానా ప్రచారం చేసి గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన బాద్యత పార్టీ శ్రేణులపై ఉందని అమె చెప్పారు. యాబే ఏళ్ళకు పింఛన్ ఇవ్వడం, మహిళలకు పసుపు, కుంకుమ పథకాలతో గిరిజనులకు ఎంతగానో మేలు జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని,కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పొలుపర్తి గోవింద్ మాష్టారు, మండల పార్టీ అధ్యక్షుడు ఉల్లి రామారావు, వంజంగి కాంతమ్మ, బొర్రా నాగరాజు, విజయరాణి, కొట్టగుళ్లి సుబ్బారావు, రొబ్బి రాము, బూర మహేష్, చిట్టిబాబు, కుమారి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ కట్టడాలపై అధికారుల కొరడా
మాడుగుల.్ఫబ్రవరి 14: మండలంలోని అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించారు. పంచాయతీ స్థలాలలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతుందని జిల్లా కలెక్టర్‌కు పిర్యాధు అందటంతో నరీపట్నం పంచాయతీ డివిజనల్ అధికారిణి ఆర్.శిరీషా గురువారం పంచాయతీ కేంద్రాన్ని పరిశీలించారు. పంచాయతీ లో గాంధీ పార్కు వద్ద కట్టడాలు, వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఆక్రమణకు గురైన భూమి, బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన హల్వా దుఖాణం, దొర్ల వీధీ లో స్థలాలను ఆమె పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాల గూర్చి సమాగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీ విస్తరణ అధికారి కె.అప్పారావును అదేశించారు. ఇదీలా ఉండగా పంచాయతీ కార్యలయంలో వివిధ పంచాయితీల కార్యదర్శులతో సమావేసం ఏర్పాటు చేసి ఇంటి పన్నుల వివిరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు.