విశాఖపట్నం

మోదీ అనుకూలురంతా కాంగ్రెస్‌కు శత్రువులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: దేశ ప్రధాని నరేంద్రమోదీకీ అనుకూలంగా ఉండే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు శత్రువులేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలకు పోటీ చేయాలనుకునే అభ్యర్ధుల ధరఖాస్తులకు సంబంధించి గురువారం జగదాంబ జంక్షన్ యల్లమ్మతోట కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అభ్యర్థుల పునశ్చరణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానిన అదోగతి పాల్జేసిన మోదీ ప్రభుత్వం గద్దెదిగడం ఖాయమన్నారు. రోజురోజుకీ కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి బలం పెరుగుతోందన్నారు. దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నేతలు రాహుల్‌కు మద్దత్తునిస్తున్నారన్నారు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం హర్షణీయమన్నారు. మమతా బెనర్జీ సైతం కామన్ మినిమమ్ ప్రొగ్రామ్‌ను (సీఎంపీ)ని తయారుచేయాల్సిందిగా రాహుల్‌ను కోరారన్నారు. 1978లో మాదిరి అప్పటి పరిస్థితులు మళ్ళీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వస్తున్నాయన్నారు. ఇందిరా కాంగ్రెస్ 178 సీట్ల అత్యధిక మెజార్టీతో కేంద్రంలో అధికారంలోక వచ్చిందన్నారు. పీవీవీ రాజు, తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ ఇందిరా కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించగా అప్పట్లో బి-్ఫరం తీసుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాని పరిస్థితులుండగా ఇవి తీసుకున్న ప్రతిఒక్కరూ గెలవడంతో అనూహ్య ఫలితాలతో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిందన్నారు. పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ రామ్‌శర్మ మాట్లాడుతూ సిద్ధాంతాలు, విధానాలు స్పష్టతతో ఉండే కాంగ్రెస్‌పార్టీయే దేశానికి, రాష్ట్రానికి రక్ష అని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీటీతో కాంగ్రెస్‌పార్టీయే రాష్ట్రంలో ఏర్పడనుందన్నారు. నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వచ్చిన ఆశావహుల ధరఖాస్తులే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనడానికి కారణంగా చెబుతున్నాయన్నారు. 15 అసెంబ్లీ స్థానాలకు ఎంపీ స్థానాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయన్నారు. వీటన్నింటినీ పరిశీలించి పార్టీపట్ల,ప్రజలకు విశేషంగా సేవలందించే అభ్యర్థులకే పార్టీ అధిష్టానం టికెట్‌నిస్తుందని, అందువల్ల పార్టీ గెలుపే లక్ష్యంగా అంతా పనిచేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పార్టీ భావజాలం కలిగి దీని సిద్ధాంతాలను, విధానాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్ళే నాయకులు, కార్యకర్తలకే అవకాశం ఉంటుందన్నారు. అనంతపురం నుంచి ఈ నెల 19వ తేదీ నుంచి భరోసాయాత్ర ఉంటుందన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ మంచిదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబే అంటున్నారన్నారు. ప్రత్యేకహోదాను ఇవ్వనంటూ బీజెపీ చెబుతుండగా, కాంగ్రెస్‌పార్టీ ఒక్కటే ఇస్తానంటూ చెబుతోందని, ఇవ్వగలవాడే గొప్ప అంటూ పేర్కొన్నారు. జనసేన, వైసీపీలు దీని గురించి స్పష్టంగా చెప్పలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్ నుచి పారిపోయిన వారంతా బలహీనులేనన్నారు. ప్రత్యర్ధిపార్టీలో వ్యక్తుల బలహీనులేనన్నారు. జగన్‌కు కేసులున్నాయని, అందువలనే బీజెపీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు.