విశాఖ

వైసీపీలో అన్నివర్గాల వారికి సముచిత స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఫిబ్రవరి 18: బీసీ సామాజిక వర్గానికి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగానో భరోసా కల్పిస్తుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షులు శరగడం చిన అప్పలనాయుడు అన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తొలిసారిగా చోడవరానికి విచ్చేసిన ఆయన ఇక్కడి దేవాలయంలో పూజలు చేసి కొత్తూరు జంక్షన్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం ధర్మశ్రీతో కలిసి పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రూపొందించిన నవరత్నాల్లో రూపొందించిన పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపీ కొడుతున్నారని ఆయన అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి రూపొందించిన పథకాలకు పేర్లుమార్చి తమ పథకాలుగా ప్రకటిస్తున్నారని ఆయన ఎద్దేవా చేసారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏమీ చేయలేని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు హడావుడిగా ఆయా పథకాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీ సంక్షేమానికి ఏటా 15వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు జగన్‌మోహన్ రెడ్డి ప్రకటింఛారన్నారు. బీసీ సబ్‌ప్లాన్ చట్టానికి భద్రత కల్పిస్తామన్నారు. కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళనం చేసి అన్ని కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా పారదర్శకంగా అన్నివర్గాల వారికి సముచిత స్థానాన్ని కల్పించేందుకు కృషిచేస్తారన్నారు. 139 కులాల వారికి కార్పొరేషన్‌లు ఏర్పాటుచేసేందుకు నిర్ణయించారన్నారు. ఏలూరులో జరిగిన బీసి గర్జనకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారన్నారు. 139 బీసీ కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఏడాదికి 15వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని జగన్ ప్రకటించడం హర్షణీయమన్నారు. గత ఎన్నికలకు ముంధు కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని, రాహూల్‌ను దుయ్యబట్టిన చంద్రబాబు ప్రస్తుతం వారిని పొడుగుతున్నారన్నారు. ప్రపంచంలోనే రోల్‌మోడల్‌గా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచారని, అదే స్థాయిలో జగన్ నిలుస్తారని ఆయన అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత తనపై జగన్‌మోహన్ రెడ్డి ఉంఛారన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు అభ్యర్థుల విజయమే ధ్యేయంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఏడువాక సత్యారావు, బొడ్డేడ సూర్యనారాయణ, పినబోయిన అప్పారావుయాదవ్, సూరిశెట్టి గోవింద, పల్లా నర్సింగరావు, పుల్లేటి వెంకట్రావు, ఓరుగంటి నెహ్రూ, అప్పికొండ లింగబాబు తదితరులు పాల్గొన్నారు.