విశాఖ

విఘ్నేశ్వరాలయ హుండీ ఆదాయం లెక్కింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఫిబ్రవరి 18: స్థానిక స్వయంభూ విఘ్నేశ్వర స్వామి ఆలయం హుండీ లెక్కింపు సోమవారం జరిగింది. 40రోజులకు సుమారు 87వేల 189 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ సందర్భంగా ఇవో సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాలకు తరచూ మూడునెలలకు, 45రోజులకు హుండీ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుందని, అదే విధంగా స్థానిక స్వయంభూ విఘ్నేశ్వర స్వామి హుండీ ఆదాయం 40రోజుల్లోనే 87వేల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. ఆలయానికి ఆదాయం గణనీయంగా పెరిగిందని కార్యనిర్వహణాధికారి ఎస్‌వివి సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కొడమంచిలి గణేష్, ఉత్సవ కమిటీ చైర్మన్ చేకూరి శ్రీరామ్మూర్తిరాజుతోపాటు విశాఖకు చెందిన శ్రీహరి సేవకులు పాల్గొన్నారు.

చంద్రన్న రంగస్థల కళావేదిక ప్రారంభం
చోడవరం, ఫిబ్రవరి 18: స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయ ఉత్సవ రోజుల్లో ఏర్పాటుచేసే సాంస్క్రతిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా కళావేదికను చంద్రన్న కళావేదికను నిర్మాణం చేసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అన్నారు. గతంలో ఇక్కడ ఏర్పాటు చేసుకునే సాంస్క్రతిక కార్యక్రమాలకు కొన్ని సమయాల్లో ఇబ్బందులుండేవని, ప్రస్తుతం నిర్మించిన కళావేదిక అన్నివిధాలా యోగ్యంగా ఉంటుందన్నారు. ప్రధానంగా శివరాత్రి రోజుల్లో ఇక్కడ నిర్వహించుకునే సాంస్క్రతిక కార్యక్రమాలకు అనువుగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. సురభి వంటి నాటకాలు ఏర్పాటుకు ఈ కళావేదిక మరింత అనువుగా ఉంటుందన్నారు. అలాగే శివరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది అత్యంత వేడుకగా నిర్వహించుకునేందుకు ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రధానంగా స్వామివారి శివరాత్రి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు ఇప్పటికే పూజా కార్యక్రమాలతోపాటు అన్ని కార్యక్రమాలకు సంబందించిన కార్యాచరణ రూపొందించినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు చంద్రన్న కళావేదిక శిలాఫలకాన్ని ప్రారంభించడంతోపాటు పురాణ మండపంలో శివరాత్రి కల్యాణ మహోత్సవాల వాల్‌పోస్టర్లను ఉత్సవ కమిటీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జెడ్పీటిసి కనిశెట్టి మత్స్యరాజు, మాజీ గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మాజీ ఎంపీపీ గూనూరు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ దొమ్మెసి అప్పలనర్స గిరి, ఎంఫీపీ కొండతల్లి, ఉత్సవ కమిటీ చైర్మన్ పసుమర్తి మల్లిక్, ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి గణేష్, ఇవో ఎన్‌ఎల్‌ఎన్ శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.