విశాఖపట్నం

సందేశాత్మక పుస్తకాలకు ప్రజాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: సందేశాత్మక పుస్తకాలకు ప్రజాదరణ ఎల్లప్పుడూ ఉంటుందని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏయూ హిందీ భవన్‌లో రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన 3అసాధ్యుడు అనితర సాధ్యుడు2 పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యార్లగడ్డ రాసిన అనేక పుస్తకాలు ఎంతో ప్రజాదరణ పొందాయని, అందరి ఆదరాభిమానాలు పొందిన విలక్షణ రచయితగా కొనియాడారు. అమెరికా అధ్యక్షుని జీవితంపై ఆయన రాసిన పుస్తకమే కాకుండా పలు గ్రంధాలు అవార్డులు అందుకున్నాయన్నారు. ప్రపంచంలోనే విలక్షణ నాయకుడు ట్రంప్‌పై పుస్తకం రాయడం యార్లగడ్డ తీరుకు అద్దం పడుతుందన్నారు. పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ మాట్లాడుతూ ట్రంప్ జీవిత విశేషాలు తెలుసుకునేందుకు దాదాపు 6000 పేజీలు చదవాల్సి వచ్చిందన్నారు. అమెరికాలో ఎంతో మంది అభిప్రాయాలు సేకరించి పుస్తకాన్ని 150 పేజీలతో తీసుకువచ్చానన్నారు. ఈ రచనలో ట్రంప్ వ్యక్తిగత జీవితంతో పాటు పలు రాజకీయ అంశాలను ప్రస్తావించానన్నారు. అమెరికాలో ఉంటున్న ప్రతి తెలుగు వ్యక్తి ఈ పుస్తకాన్ని చదవాలన్నారు. కార్యక్రమంలో పలువురు రచయితలు, మేథావులు పాల్గొన్నారు.