విశాఖపట్నం

నిబంధనల మేరకే మోదీ సభకు అనుమతి నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: రాజకీయ, మత పరమైన సమావేశాలకు విద్యా సంస్థల మైదానాలు, వసతి గృహాలు ఇవ్వకూడదన్న నిబంధన మేరకే ప్రధాని నరేంద్ర మోదీ సభకు అనుమతి నిరాకరించినట్టు ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు స్పష్టం చేశారు. ఏయూ సెనేట్ మందిరంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015 తరువాత నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ మేరకు కళాశాల జరుగుతున్న సందర్భంలో రాజకీయ, మతపరమైన కార్యకలాపాలకు అనుమతి ఇవ్వలేమన్నారు. గతంలో టీడీపీ మహానాడుకు అనుమతి ఏలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానంగా అప్పటికే ఏయూకు సెలవులు ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం కొత్తగా జిల్లాకో యూనివర్శిటీ ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం పరపతి ఏ మాత్రం తగ్గదన్నారు. అనుబంధ కళాశాలల సంఖ్య తగ్గడం ద్వారా ఆదాయాన్ని మాత్రమే కోల్పోతామన్నారు. ఇదే సందర్భంలో మిగిలిన మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అంశాలపై దృష్టి సారించామన్నారు. దేశంలో 8 రాష్ట్ర యూనివర్శిటీలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు కేంద్రం నిర్ణయించిందని, అందులో ఏయూ ఉందని గుర్తు చేశారు. రూసా పథకం కింద ఇప్పటికే ఏయూకు కేంద్ర రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. భవిష్యత్‌లో మరో రూ.1000 కోట్ల మేర కేంద్ర సాయం అందనుందన్నారు.