విశాఖపట్నం

వౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: రైల్వేలో వౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన విశాఖ నుంచి గాంధీగ్రాం వరకూ ఏసీ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైలు ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రధాని మోదీ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. రూ.10 కోట్లతో చేపట్టిన స్టేషన్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అలాగే రూ.50 లక్షలతో నిర్మించిన లాంజ్‌ను ప్రారంభించి, విమానాశ్రయాల్లో లాంజ్‌లకు ధీటుగా వీటిని నిర్మించామన్నారు. గత కొంత కాలంగా రైలు ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగానే కొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే విశాఖ నుంచి గాంధీగ్రాంకు 28 ఏసీ కోచ్‌లతో కొత్త రైలును ప్రారంభించామన్నారు. ఈ రైలు పూర్తిగా ఏసీ కోచ్‌లతోనే నడుస్తుందన్నారు. అధునాత సీటింగ్, టాయిలెట్లతో ఎంతో పరిశుభ్రంగా ఉండే ఈ రైలు గాంధీగ్రాం ప్రయాణీకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఇటువంటి రైళ్లను భవిష్యత్‌లో మరిన్ని విశాఖకు తెస్తామన్నారు. వాల్తేరు డివిజన్‌కు ముకుల్ శరణ్ మాధుర్ డీఆర్‌ఎంగా వచ్చినప్పటి నుంచి ప్రయాణీకుల వౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారన్నారు. ఆయన చొరవతోనే పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు.