విశాఖపట్నం

ఆగమోక్తంగా ప్రారంభమైన మహా యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 11: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని నృసింహవనంలో నవాహ్నిక దీక్షతో ద్వాత్రింశత్‌కుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహా యజ్ఞం సోమవారం ఆగమోక్తంగా ప్రారంభమైంది. నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దేవాలయ వైదిక పరివారం యజ్ఞాంగ ప్రక్రియలను శాస్త్రోక్తంగా జరిపించారు. దేవాలయ అనువంశిక ధర్మకర్త, విజయనగరం పార్లమెంటు సభ్యుడు పూసపాటి అశోకగజపతిరాజు దంపతులు పూజాదికాలకు హాజరయ్యారు. సంధ్యా సమయంలో ముందుగా దేవాలయ ఆస్థానాచార్యులు డాక్టర్ టీపీ.రాజగోపాల్, ప్రధానార్చకుడు గోడవర్తి శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో వైదిక పరివారం పుట్ట వద్దకు వెళ్లి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం నిర్వహించారు. పుట్ట మీద భూదేవి, బొరిగెలో వరాహస్వామిని ఆవానం చేసి మట్టిని తవ్వారు. ఆ మట్టిని వెండి పాత్రలో ఉంచి ఆస్థానాచార్యులు పుట్టమట్టిని, పట్టు వస్త్రాలను శిరస్సున ధరించి ధర్మకర్త అశోకగజపతిరాజు దంపతులు, ఈవో రామచంద్రమోహన్ దంపతులతో పాటు రుత్వికులు, ఉద్యోగులు వెంటరాగ అంతాకలిసి ప్రదక్షిణ పూర్వకంగా యాగశాలలోకి ప్రవేశించారు. అక్కడ అంకురార్పణ, పాలికాది దేవతలను ఆవాహన చేసారు. అంకురాలలో హవనం చేసి షోడశోపచారాలతో పూజించి మృత్స్యంగ్రహణం, అంకురార్పణ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఆరాధన, మంగళ నిరాజనంతో తొలిరోజు కార్యక్రమాన్ని పూర్తి చేసారు. కాగా ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, వాస్తుహోమం, నాదస్వరం, పరిషత్, రక్షాబంధనం, రుత్విక్‌వరణం, మంగళాశాసనం నిర్వహించారు. యజ్ఞంలో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి ప్రాతఃకాల ఆరాధన,్ధ్వజస్తంభ ప్రతిష్ఠ, అష్టదిక్పాలక ఆరాధన, అరణి ఆరాధన, అగ్నిమధనం, కుండాలలో అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభారాధన, చక్రాబ్జ మండలారాధన, అగ్నిముఖం, లఘ పూర్ణాహుతి, మహానివేదన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి హాజరుకానున్నారని ఆస్ధానాచార్యులు తెలియజేసారు.

అవంతి వ్యాఖ్యలు హాస్యాస్పదం
సింహాచలం, మార్చి 11: అనకాపల్లి ఎంపీ, భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ముత్తెంశెట్టి శ్రీనివాసరావు మంత్రి గంటా శ్రీనివాసరావు పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని 72వ వార్డు టీడీపీ నాయకులు విమర్శించారు. ఆదివారం సింహాచలంలో జరిగిన వైసీపీ సభలో మంత్రి గంటాని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి ముత్తెంశెట్టి చేసిన ఆరోపణలు, విమర్శలను టీడీపీ నాయకులు సోమవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీలను మార్చి స్వార్ద ప్రయోజనాల కోసం లేనిపోని విమర్శలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని నేతలు వ్యాఖ్యానించారు. వార్డు అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు పిసిని వరహా నరసింహంతో పాటు అడివివరం సహకార పరపతి సంఘం అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, స్థానిక మార్కెట్ కమిటీ అధ్యక్షుడు లంక సత్తిబాబు, ఎం.కాసుగోపాల్, పంచదార్ల శ్రీనివాసరావు, లండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వైకాపా, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
గోపాలపట్నం, మార్చి 11: అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి పెరుగుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతి, అక్రమాలకు అడ్డులేకుండా పోతోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయగా, నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక మళ్ల లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే గణబాబు ఖండించారు. సోమవారం ఇరువురు వేరువేరుగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. నియోజకవర్గం పరిధిలో సుమారు 8 వేలకు పైగా వైసీపీ సానుబూతి పరుల ఓట్లను అధికార పార్టీ ఉద్దేశపూర్వరకంగా తొలగించిందని విజయప్రసాద్ ఆరోపించారు. ఇందుకుసంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని విజయప్రసాద్ అన్నారు. ఫారం 7 ద్వారా ఓట్లు రద్దు జరుగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గణబాబు స్పష్టం చేసారు. దొంగదొంగ అంటే వైసీపీ నాయకులెందుకు భుజాలు తడుముకుంటున్నారని ఎమ్మెల్యే గణబాబు ఎద్దేవా చేసారు.