విశాఖపట్నం

టికెట్ల ఖరారులో జనసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 11: కొత్త పార్టీ జనసేన సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతోంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా తొలి జాబితాను విడుదల చేసేందుకు అధినేత కసరత్తు చేస్తున్నారు. వచ్చే 24 గంటల్లో తొలి జాబితాకు అధినేత పవన్ కల్యాణ్ ఆమోద ముద్ర వేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి జాబితాలో విశాఖ జిల్లాకు సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురి పేర్లు ఖరారయ్యే అవకాశాలున్నాయి. తొలి జాబితాలోనే అరకు పార్లమెంట్ పరిధిలోని పాడేరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పీ బాలరాజు పేరును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. వీటితో పాటు అభ్యంతరాలు లేకుండా, ఒకే పేరు పరిశీలనకు వచ్చిన అసెంబ్లీ సెగ్మెంట్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్‌కుమార్, చోడవరం నుంచి పీవిఎస్‌ఎన్ రాజు, భీమిలి నుంచి ఆలివర్ రాయ్, పాయకరావుపేట నుంచి రాజారావు, విశాఖ సౌత్ నుంచి గిరిధర్ పేర్లు అధినేత పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా విశాఖ జిల్లా గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ గాజువాకతో పాటు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ స్థానాల్లో ఒకదాని నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే గాజువాక స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, కోన తాతారావు ఆశిస్తున్నారు. ఇక ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో వడపోత కొనసాగుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖ పశ్చిమ నుంచి పీవీ సురేష్, డాక్టర్ పీ సునీతి, విశాఖ ఉత్తర నుంచి బొడ్డేపల్లి రఘు, ఉషాకిరణ్, గుంటూరు భారతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విశాఖ తూర్పు నుంచి బొలిశెట్టి సత్య, రాఘవరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే బొలిశెట్టి సత్య విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు అధినేతకు స్పష్టం చేశారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని డాక్టర్ సీహెచ్ పార్ధసారధి పేరును ఇప్పటికే ఖరారు చేసిన దృష్ట్యా విశాఖలో సత్య అభ్యర్థిత్వంపై స్పష్టత రాలేదు. గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తే గాజువాక అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న కోన తాతారావు అభ్యర్థిత్వాన్ని విశాఖ పార్లమెంట్ స్థానానికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 14న రాజమహేంద్ర వరంలో జనసేన బహిరంగ సభ అనంతరం టికెట్ల ఖరారుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.