విశాఖ

రైతు నాయకులపై ఆక్రమ కేసులు ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, మార్చి 14: రైతు నాయకులపై పెట్టిన ఆక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మునగపాకలో స్థానిక విలేఖర్ల సమావేశంలో సిపిఎం జిల్లా నాయకుడు పి బాలకృష్ణ మాట్లాడుతూ పంటసాయం కౌలు రైతులకు కూడా ఇవ్వాలని మునగపాకలో ఆందోళన సిపిఐ సిపిఎం, జనసేన పార్టీలతో కలిసి చేయడం జరిగిందని ఆయన అన్నారు. కౌలు రైతులకు పంటసాయం అందించాలని, ఎల్‌ఇసి కార్డులు ఇచ్చి స్కేల్ ఆప్ పైనాన్స్ ప్రకారం కౌలు రైతులకు వడ్డిలేని రుణాలు ఇచ్చి 20 సంవత్సరాలు కౌలు చట్టాన్ని అమలు చేయాలని అఖిల పక్ష పార్టీలు కోరడం జరిగిందని అన్నారు.కౌలు రౌతులు రక్షణకోసం రాస్తారోకో తహశీల్ధార్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని నెపంతో మొత్తం 11మంది నాయకులుపై ఆక్రమ కేసులు బనాయించడాన్ని సిపిఎం పార్టీ నాయకుల తీవ్రంగా ఖండించారు. ఆళ్ల మహేశ్వరావు, బ్రహ్మజీ మాట్లాడుతూ చేతకాని బిజెపి,టిడిపి ప్రభుత్వలు న్యాయం కోసం పోరాటాలు చేస్తున్న నాయకులపై కేసులు పెట్టడం అన్యాయం అని వారు ఆరోపింఛారు. 11మంది నాయకులపై పెట్టిన కేసులు రద్దుచేయాలని, పంటసాయం నిజమైన కౌలు రైతులకు అందించాలని వారు డిమాండ్ చేసారు.

ఇసుక ఆక్రమ రవాణాను అడ్డుకుంటాం
మునగపాక, మార్చి 14: శారదానది ఉప కాలువల ద్వారా ఆక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్‌లను స్వాదీనం చేసుకొని ట్రాక్టర్ యజమానులపై కేసులు పెడతామని స్థానిక ఎస్‌ఐ కుమారస్వామీ హెచ్చరించారు. గురువారం మండలంలో గల గంటవానిపాలెం గ్రామం సమీపంలో ఆక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను స్థానిక పోలీసులు పట్టుకొని ఇసుక ట్రాక్టర్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎస్‌ఐ కుమారస్వామీ మాట్లాడుతూ ఎన్నికలు సమీపంచాయి ఏ అధికారి పట్టించుకోరు అనే నేపంతో ట్రాక్టర్ యజమానులు శారదా నది నుండి గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి, వేకువ జాములో ఆక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారని, వారిపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసామని, ఆక్రమ ఇసుక రవాణా కార్యక్రమాన్ని వదులుకోవాలని ఆయన ఇసుక ట్రాక్టర్‌ల యజమానులకు హెచ్చరించారు.

యలమంచిలిలో జనసేన పార్టీని ఆశీర్వదించండి
మునగపాక, మార్చి 14: యలమంచిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపుకోసం ప్రజలంతా సహకారం అందించాలని జనసేన మునగపాక మండల నేత పెంటకోట విజయ్ కోరారు. గురువారం మండలంలో పల్లపు ఆనందపురం, కుమారపురం గ్రామాల్లో జనసేన నాయకులు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీని యలమంచిలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రైతుల పొలాల్లోకి వెళ్లి మహిళా రైతులతో ముచ్చటించారు. యలమంచిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుందరపువిజయ్‌కుమార్ పోటీ చేస్తున్నారని ఆయన గతంలోనే నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, ఆయన గెలుపుతోనే నియోజకవర్గంలో పేదల సమస్యలు పరిష్కారమవుతాయని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఆడారి కన్నబాబు, కె. సరోజిని, పలువురు నేతలు పాల్గొన్నారు.