విశాఖ

పది పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, మార్చి 14: పదవ తరగతి పరీక్షల ప్రశాంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు చేస్తుంది. పాఠశాల వ్యవస్థలో పదవ తరగతి పరీక్షలకు ఉన్న ప్రాధాన్యాత అంతా ఇంతా కాదు. విద్యార్ధుల భవితవ్యానికి పదవ తరగతిలో వచ్చే మార్కులతోపాటు విషయ పరిజ్ఞానం, భాష పట్ల పట్టును ఈ పలితాలు వెల్లడిస్తాయి. విద్యార్ధులు వారి అభిరుచికి అనుగుణంగా అడుగులు వేయడంతోపాటు, పదవ తరగతిలో వచ్చే మార్కుల కోలమానంగా తదుపరి విద్యాభ్యాసానికి సీట్లు లభిస్తాయి.ఈనెల 18నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం అనకాపల్లి పట్టణంతోపాటు మండలంలోని 12 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా మండల విద్యాశాఖాధికారి ఎం దివాకర్ తెలిపారు. పట్టణంలో ఉన్న జీవిఎంసీ పాఠశాలలు 6 జెఎంజె స్కూల్, ఏఎంఎఎ పాఠశాల, మండలంలోని తుమ్మపాల, కూడ్రం, మామిడిపాలెం, కొప్పాక మొత్తం 12 పరిక్షా కేంద్రాలను ఎంపిక చేసి పక్కా ఏర్పాట్లుచేస్తున్నారు. ఆయా పరీక్షాకేంద్రాల్లో మొత్తం 2824 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు.ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్ధులు 691, విద్యార్ధినిలు 672మొత్తం 1363మంది కాగాప్రైవేట్ పాఠాలలకు సంబందించి 836 మంది విద్యార్ధులు, 625మంది విద్యార్ధినిలు మొత్తం 1461 ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు ఎంఇవో దివాకర్ తెలిపారు.ఈ ఏడాది పరీక్షలు పక్కాగా నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించిదన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు ప్రత్యేక స్క్వాడ్ టీంలు పర్యవేక్షించనున్నాయన్నారు.ప్రతీ కేంద్రంలోను విద్యుత్, మంచినీటి సదుపాయం మరుగుదొడ్లు, మెడికల్, సీలింగ్‌ప్యాన్లు తదితర వౌలిక వసతులు పక్కాగా ఏర్పాటు చేసామన్నారు.సమస్యాత్మకంగా ఉన్న కొన్ని కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రభుత్వ ఆదేశాలమేరకు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఎక్కడా నెలపై కూర్చోని పరీక్షలు రాయకుండా అన్ని కేంద్రాల్లో బెంచీలను ఏర్పాటు చేసామన్నారు. పరీక్షా సమయానికి అరగంట ముందు ఆయా పరీక్షాకేంద్రాలకు విద్యార్ధులు చేరుకోవాలని సూచించారు. విద్యార్ధులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయాకేంద్రాలు వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.