విశాఖ

19 నుండి పాలనకు ఎమ్మెల్యే గుడివాడ శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూన్ 16: జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ నుండి వైసీపీ తరపున శాసనసభ్యునిగా ఎన్నికైన గుడివాడ అమర్‌నాథ్ ఈనెల 19నుండి పరిపాలన కార్యక్రమాల వేగవంతానికి శ్రీకారం చుట్టనున్నారు. సోమ, మంగళవారం రెండురోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మరుసటిరోజు బుధవారం అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో పరిపాలనా కార్యక్రమాల అమలుపై సమీక్షకు శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే అమర్‌నాథ్ ఆంధ్రభూమికి తెలిపారు. అక్కడి నుండి వరుసగా మూడురోజులపాటు అనకాపల్లి, కశింకోట మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షలకు శ్రీకారం చుట్టనున్నారు. వర్షాభావం ఎక్కువగా ఉన్నందున అనకాపల్లి పట్టణంతోపాటు గ్రామాల్లో సైతం నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్‌ల ద్వారా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని ప్రజల ముంగిటకు అందించేందుకు సత్వర చర్యలను తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే గుడివాడ తెలిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల సమస్యలపై ఇప్పటికే తనకు అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి అటు పార్టీశ్రేణులతోను, ఇటు ప్రజలతోను మమేకమవుతూ అధికారులను అనుసంధానం చేసుకుంటూ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తన పరిపాలనను క్రమేపీ వేగవంతం చేస్తానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడతానని ఎమ్మెల్యే అమర్‌నాథ్ తెలిపారు.