విజయవాడ

విద్యుత్ కొనుగోళ్లపై పునఃపరిశీలన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 16: ప్రైవేట్ సంస్థల నుండి గతంలో జరిగిన కరెంట్ కొనుగోళ్ల విషయంలో పునఃపరిశీలన చేయాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పూలేదని వైకాపా శాసనసభ్యుడు వరప్రసాద్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు, అప్పటి ధర, తదితర అంశాలపై పునఃపరిశీలన చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీ నేతలు అవాకులు చవాకులు పేలటం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర అవసరాలకు సరిపోయే విద్యుత్ ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థల వద్ద కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తప్పులు జరగపోతే ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అప్పటి ప్రభుత్వానికి ముందుజాగ్రత్త ఉండటంలో ఎలాంటి తప్పూలేదని, జాగ్రత్త పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు అన్నివిధాలా సంపూర్ణ న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాపులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఈ కారణంగానే ఈ సామాజిక వర్గ ప్రజలు సీఎం జగన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వరప్రసాద్ వివరించారు.
ఇసుక విధానం ప్రకటించండి
ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని వెంటనే ప్రకటించాలని బీజేపీ ఎమ్యెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంపై ఏమైనా తప్పులు జరిగి ఉంటే విచారణ కమిటీని నియమించాలని కోరారు. వెంటనే ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రకటించాలని, ఈవిషయంలో మీనమేషాలు లెక్కించవద్దని కోరారు. ఇసుకతో ముడిపడిన లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారని మాధవ్ పేర్కొన్నారు. ఇసుక రవాణాతో ముడిపడినవారు ప్రస్తుతం దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మాదిరి తప్పులు ప్రస్తుత ప్రభుత్వం చేయకుండా ఇసుక పాలసీని వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉందని మాధవ్ కోరారు.
సదావర్తి భూములపై విచారణ జరిపించాలి
ఇంద్రకీలాద్రి : సదావర్తి భూములను బినామీల ద్వారా కొట్టేసే ప్రయత్నం చేశారని వైకాపా శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి విమర్శించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సదావర్తి భూముల వ్యవహారంలో విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుమారు 3నెలల వ్యవధిలో విజిలెన్స్ రిపోర్ట్ వెలుగు చూస్తుందని, నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. 60కోట్ల ఆదాయం కోల్పోయామని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు వైకాపా నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ పరిరక్షకులుగా ఉన్నామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
బాబు ఆటలు సాగవ్:జోగి
గుడిని, గుడిలో లింగాన్ని మింగేయాలని చూస్తున్నారని వైకాపా శాసనసభ్యుడు జోగి రమేష్ టీడీపీని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ భూములను చౌకగా కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేశారని, అయినా వైసీపీ ప్రభుత్వం వద్ద వారి ఆటలు సాగవని హెచ్చరించారు.