విశాఖ

సింహాచలేశునికి స్వర్ణ తులసీ దళాలు కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 21: దక్షిణ భారతదేశంలో శతాబ్దాల చరిత్ర గల శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రంలో కొలువుతీరివున్న శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సబ్బవరం మండలం తవ్వవానిపాలెం గ్రామానికి చెందిన బొక్కం శ్రీనివాసరావు దంపతులు స్వర్ణ తులసీ దళాలను కానుకగా సమర్పించారు. సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే 50 తులసీ దళాలను ప్రత్యేకంగా తయారు చేయించి గురువారం దేవస్థానం అధికారులకు అందజేసారు. ఒక్కో దళం 12 గ్రాములు బరువు ఉంటుంది. స్వామివారికి ప్రతీ మంగళవారం తులసీ దళాలతో ఆర్జిత సేవ నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏకాదశికి స్వర్ణ తులసీ దళార్చన ఆర్జిత సేవగా నిర్వహిస్తున్నారు.సుమారు 2116 రూపాయల టిక్కెట్టు పై నిర్వహిస్తున్న తులసీ దళార్చనకు భక్తుల నుండి విశేషమైన స్పందన వస్తున్న నేపధ్యంలో తులసీ దళాలను మరింత నాణ్యతతో తయారు చేయించాలని నిర్ణయించిన అధికారులు భక్తులకు పిలుపు నిచ్చారు. ఈ నేపధ్యంలో ముందుకు వచ్చిన శ్రీనివాసరావు దంపతులు 50 తులసీ దళాలను కానుకగా సమర్పించారు. ఈ దళాలతో ఆలయానికి వచ్చిన దాతలకు ఈవో వెంకటేశ్వరరావు, అర్చక పరివారంతో కలిసి స్వాగతం పలికారు. బేడా మండపంలో ప్రదక్షిణగా తీసుకువెళ్లి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. తులసీ దళాలను మూలవిరాట్ పాదల చెంత ఉంచారు. బేడా మండపంలో ఆశీర్వాదం అనంతరం ఈవో వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులకు దాతలు అందజేసారు. వీటితో పాటు మరి కొంత మంది భక్తులు కూడా స్వర్ణ తులసీ దళాలను స్వామివారికి కానుకగా సమర్పిస్తున్నారు. నగరంలోని ప్రముఖ నగల వ్యాపార సంస్థ తులసీ దళాలను తయారు చేస్తోంది. గురువారం దాత సమర్పించిన 50 తులసీ దళాలతో కలిపి ఇప్పటి వరకు సుమారు 100 దళాలను అధికారులు సేకరించారు. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన చేయాలంటే ద్వాదశ నామాలతో కలుపుకొని సుమారు 120 వరకు అవసరం ఉంటుంది. ఈ నేపధ్యంలో దళాలు దేవస్థానానికి వచ్చిన తరువాత ప్రత్యేకంగా మూహుర్తాన్ని నిర్ణయించి దాతల పేరున స్వర్ణ తులసీ దళార్చన చేస్తామని అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో దేవాలయ ఏఈవో పులి రామారావు, ఆస్థానాచార్యులు డాక్టర్ టీపీ.రాజగోపాల్ తో పాటు అర్చక పరివారం పాల్గొన్నారు.
* దాతలకు పెద్దపీట వేస్తాం - ఈవోః భగవంతుడికి అనేక రూపాల్లో కానుకలు సమర్పిస్తున్న దాతలకు పెద్దపీట వేస్తామని ఈవో వెంకటేశ్వరరావు ప్రకటించారు. 25 లక్షల రూపాయలతో స్వర్ణ తులసీ దళాలను సమర్పించిన శ్రీనివాసరావు దంపతులను అర్చక పరివారం ఆశీర్వదించగా, ఈవో అభినందించారు. సంపాదనలో భగవంతుడికి కొంత భాగాన్ని సమర్పించడం గొప్ప కార్యమని అన్నారు. దేవస్థానం అభివృద్ధిలో కూడా దాతలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.