విశాఖ

మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతిపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, నవంబర్ 21: పెదబయలు మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై పాడేరు సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ చురుకుగా విచారణ చేపడుతున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని, దాదాపు మూడు కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టినట్టు పలు సంఘాల నేతలు పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారికి ఇటీవల పిర్యాదు చేసారు. దీంతో స్పందించిన ఆయన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించి విచారణ అధికారిగా సబ్ కలెక్టర్‌ను నియమించారు. దీంతో గత పది రోజులుగా మరుగుదొడ్ల అక్రమాలపై సబ్ కలెక్టర్ విచారణ చేపడుతూ పలు గ్రామాల్లో చోటుచేసుకున్న లోపాలను, అధికారుల తప్పిదాలను గుర్తించారు. ఇందులోభాగంగా పెదబయలు మండలంలోని బొంగరం, లింగేటి పంచాయతీ మగ్గంవీధి, గోమంగి పంచాయతీ సల్దిమామిడి గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించి ఆయా గ్రామాల్లో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోవడాన్ని ఆయన గుర్తించి, వీటిని పూర్తి చేయకుండానే కంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై త్వరలోనే విచారణ పూర్తి చేసి నివేదికను ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారికి సమర్పించేందుకు సబ్ కలెక్టర్ చర్యలు చేపట్టారు.

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత
పాడేరు, నవంబర్ 21: విశాఖ మన్యంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి, సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, స్థానిక ప్రధమ శ్రేణి జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కె.శారద పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పత్రికలకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ప్లాస్టిక్ నిషేదానికి అందరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం అధికం కావడంతో దీని వ్యర్థాలు భూమిలోకి చేరి భూగర్భ జలాలు కాలుష్యవౌతున్నాయని వారు పేర్కొన్నారు. దీనివలన వ్యాధులు వ్యాప్తి చెందుతూ ప్రాణాపాయ పరిస్థితి సంబవిస్తుందని వారు అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన జీవ రాళులకే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు పొంచి ఉందని వారు హెచ్చరించారు. దీనిని ప్రజలంతా గుర్తించి ప్లాస్టిక్ వినియోగానికి చరమగీతం పాడడమే కాకుండా బహిరంగ ప్రదేశాలలో, రహదారుల పక్కన వ్యర్థ పదార్థాలను వేయరాదని, నిర్ధేశించిన ప్రాంతాల్లో, చెత్త కుండీల్లో మాత్రమే వ్యర్థాలను వేయాలని వారు సూచించారు. పాడేరు పట్టణంలో వ్యాపార దుకాణాల ముందు చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని వారు ఆదేశించారు. రోడ్లపై చెత్త వేసే వ్యాపారులను సి.సి.కెమెరాలతో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.