బిజినెస్

విశాఖ స్టీల్‌లో కన్వర్టర్ ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవంతంగా ఫ్రీ హీటింగ్ * మిలియన్ టన్నుల ఉత్పత్తి పెరుగుతుంది: సిఎండి

విశాఖపట్నం, మార్చి 14: విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్)లోని స్టీల్ మెల్ట్ షాప్-1 (ఎస్‌ఎంఎస్)లో 384 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన కన్వర్టర్-1ను సిఎండి పొన్నపల్లి మధుసూదన్ సోమవారం ప్రారంభించారు. ఎస్‌ఎంఎస్ విభాగంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆధునీకరించిన కన్వర్టర్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఎండి మధుసూదన్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం లైటింగ్ అఫ్ చేసి ఫ్రీ హీటింగ్‌ను విజయవంతంగా ప్రారంభించడంతో అధికారులు, ఉద్యోగులు కరతాళధ్వనులతో హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ కన్వర్టర్ ఆధునీకరణ పనులను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు. సమష్టి కృషి ఫలితంగానే కన్వర్టర్ ఆధునీకరణను పూర్తి చేయగలిగామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం సామర్థ్యం విస్తరణ ద్వారా 6.3 మిలియన్ టన్నులకు చేరుకుందని, ఆధునీకరణతో మరో మిలియన్ టన్ను సామర్థ్యం పెరుగుతుందన్నారు. కన్వర్టర్-1 ఏర్పాటుచేసి 25 సంవత్సరాలు పూర్తి అయిందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కన్వర్టర్‌ను నెలకొల్పామన్నారు. ఓరిజినల్ లే అవుట్‌ను అలాగే ఉంచి కన్వర్టర్ ఆధునీకరణను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కర్మాగారం పూర్వ సిఎండిలు యండమూరి శివసాగరరావు, ఎపి చౌదరి మాట్లాడుతూ కన్వర్టర్ ఆధునీకరణ ఓ అద్భుతమని కొనియాడారు. దేశంలోని ఉక్కు పరిశ్రమ మొత్తం విశాఖ ఉక్కు కనబరుస్తున్న మెరుగైన పనితీరును గమనిస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్న వైజాగ్ స్టీల్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో భద్రతా పరంగా మెరుగైన చర్యలు తీసుకోవడం అభినందనీయమని, అధికారులు, ఉద్యోగులు ఇదే పనితీరు కనబరిచి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.