విశాఖ

మత్స్యకారులపై యాదవుల ముప్పేట దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, జూన్ 28: రెండు గ్రామాల్లోని వేర్వేరు సామాజిక వర్గాల మధ్య కొంతకాలంగా నెలకొన్న అంతర్గత కక్షలు ఒకేసారి వీధిన పడ్డాయి. తమ సామాజిక వర్గానికి చెందిన బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆగ్రహంతో యాదవ సామాజిక వర్గం వారు పాయకరావుపేట మండలంలోని సాల్మన్‌పేట మత్స్యకారులపై అదే గ్రామ శివారైన రాజయ్యపేటకు చెందిన యాదవులు ముప్పేట దాడికి దిగారు. ఇంటిలోని పెద్దలు చేపలవేటకు వెళ్లడంతో స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రామ సర్పంచ్ దోనె నాగేశ్వరరావు, ఎంపీటిసి జి. రమణతోపాటు గ్రామంలోని యువకులు, మహిళలు, పసిపిల్లలపై సైతం మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. బందోబస్తులో ఉన్న పోలీసులపై కూడా దాడులకు పాల్పడ్డారు. దాడుల్లో హెచ్‌సి ధర్మారావు, హోంగార్డు అన్నవరం శ్రీనివాసరావు గాయపడ్డారు. ఒకేసారి రాజయ్యపేట గ్రామస్తులంతా కత్తులు, కర్రలు తదితర మారణాయుధాలతో గ్రామంలో ప్రవేశించి కనిపించిన వారందరినీ చితకబాదుతుండటంతో ప్రాణభయంతో పరుగులు తీసారు. ఈ ఘర్షణలో దాదాపు వందమంది తీవ్రంగా గాయపడగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గోపాల అప్పలరాజు (30), సుత్తి సత్తిరాజు (40), గరికిన రాణి (30), గోసా నాగేశ్వరరావు(50) వీరందరూ ప్రాణాపాయ స్థితిలో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తుని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో చాలామంది తుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే పాయకరావుపేట మండలంలోని మత్స్యకార గ్రామమైన పాల్మన్‌పేట స్కూల్‌కు అదే గ్రామ శివారు రాజయ్యపేటకు చెందిన పిల్లలు రోజూ చదువుకు వెళ్లి వస్తుంటారు. రాజయ్యపేటకు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన బాలికల పట్ల పాల్మన్‌పేట మత్స్యకారుల పిల్లలు అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈనెల 24న పాల్మన్‌పేట గ్రామస్తులు రాజయ్యపేట వస్తుండగా అక్కడ వారిపై దాడికి పాల్పడ్డారు. తమపట్ల యాదవ సామాజిక వర్గీయులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారని బాధితులు పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఈ విషయం తెలుసుకున్న రాజయ్యపేట గ్రామస్తులు మరింత ఆగ్రహావేశాలతో రెచ్చిపోయి సొంత పనిపై తూర్పుగోదావరి జిల్లా సమ్మంగి మండలం వేమవరం వెళ్లిన మత్స్యకారులపై మరోసారి దాడికి పాల్పడ్డారు. అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ ఇంతటితో ఆగకుండా మంగళవారం రాజయ్యపేట గ్రామస్తులంతా పాల్మన్‌పేట గ్రామ మత్స్యకారులపై ముప్పెట దాడికి దిగారు. గ్రామ సర్పంచ్, ఎంపీటిసిలతోపాటు ఇతర గ్రామంలో కనిపించిన వారంతా కత్తులు, గునపాలు తదితర మారణాయుదాలుతో తీవ్రస్థాయిలో చితకబాదారు. ఇంటిలోని టీవిలు, ఫ్రిజ్‌లు తదితర ఫర్నీచర్‌లతోపాటు ఇంటిముందున్న బైక్‌లను సైతం ధ్వంసం చేసారు. విషయం తెలుసుకున్న పాయకరావుపేట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దాడికి పాల్పడిన రాజయ్యపేట గ్రామస్తులు పరారయ్యారు. నక్కపల్లి సర్కిల్ ఇనస్పెక్టర్ రాంబాబు నేతృత్వంలో పెద్దఎత్తున పోలీసు బలగాలు మొహరించి సంఘటనా స్థలంలో ప్రత్యేక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసారు. ఎస్పీ రాహూల్‌దేవ్ శర్మ, ఎఎస్పి ఐశ్వర్య రస్తోగి, అడిషనల్ డిఐజి రాజ్‌కుమార్, ఆర్డీవో కె. సూర్యారావుతోపాటు స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత గ్రామాన్ని సందర్శించి ప్రాణభయంతో విలవిల్లాడుతున్న బాధిత మత్స్యకారులను ఓదార్చారు. ఈ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, మీకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
సుజల స్రవంతి ప్రాజెక్టుపై కోటి సంతకాల సేకరణ
మాడుగుల, జూన్ 28: రైతులు శుభిక్షంగా ఉంటేనే గ్రామంతో పాటు దేశమే అన్ని విధాలుగా భాగుంటుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ మంగళవారం మాడుగులలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పి.వి.జి.కుమార్ ఆధ్యక్షతన స్థానిక దేవి ఆడిటోరియం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు శంకుస్థాప పనులు చేపట్టారన్నారు. ఈ పథకం పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఆ లక్ష్యంతోనే ఈ పథకాన్ని ఆయన రూపొందించడం జరిగిందన్నారు. వై.ఎస్. హయాంలో ఈ ప్రాజెక్టు కోసం ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆయన మరణానంతరం ఈ పథకం అసంపూర్తిగా నిలిచిపోయిందన్నారు. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో అన్ని విధాలా ఆర్థికంగా, భౌగోళికంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు మాత్రమే వెనుకంజలో ఉన్నాయన్నారు. ఈ పథకం పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొలుపర్తి సత్యవతి, కొణతాల అనుచరులు అడపా నర్సింహమూర్తి, మలసాల కిశోర్, బొడ్డేటి సూర్యనారాయణ, గొల్లబిల్లి శ్రీరామమూర్తి, మాజీ సర్పంచ్ దంగేటి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.