విశాఖపట్నం

త్వరలో హెల్త్‌సిటీని ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 2: ముడసర్లోవ రహదారిలో చేపట్టిన హెల్త్‌సిటీలో ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని హెల్త్‌సిటీ యజమానులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వచ్చే నెల మార్చి నాటికి పూర్తికాని ప్రాజెక్టులకు కేటాయించిన స్థలాలను వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెల్త్‌సిటీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.8 కోట్లు ఎపిఐఐసి ద్వారా ఖర్చు చేయనున్నట్టు సిఎం హామీ ఇచ్చారు. హెల్త్‌సిటీలో ఆసుపత్రుల నిర్మాణానికి స్థలాలు పొందిన వారంతా తమ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తే విశాఖ ఒక హెల్త్ హబ్‌గా రూపొందుతుందన్నారు. దీనిపై ఎపిఐఐసి చైర్మన్ టి కృష్ణయ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా, హెల్త్‌సిటీ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌వికె అప్పారావు, కార్యదర్శి విష్ణుప్రసాద్‌లతో సిఎం చంద్రబాబు చర్చించారు. హెల్త్‌సిటీ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రస్తుత స్థితి గతులను వివరించారు. ఇప్పటికే అయిదు ఆసుపత్రులు ప్రారంభించామని, డిసెంబర్ నాటికి మరో ఐదు ఆసుపత్రులు ప్రారంభం కానున్నాయన్నారు. వచ్చే మార్చి నాటికి మరో 10 ఆసుపత్రులు నిర్మాణం పూర్తవుతాయన్నారు. హెల్త్‌సిటీకి ఐలా ప్రతిపత్తి కల్పించాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఐసియులో పడకలకు లగ్జరీ టాక్స్ నుంచి మినహాయించాలని సంఘ ప్రతినిధులు సిఎం చంద్రబాకు విజ్ఞప్తి చేశారు. హెల్త్‌సిటీలో 50 శాతం ప్రాజెక్టులు పూర్తయితే ఐలా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఫార్మశీ కాంగ్రెస్ బ్రోచర్ ఆవిష్కరణ
ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ 68వ మహా సభలకు విశాఖ వేదిక కానుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది డిసెంబర్ 16 నుంచి మూడు రోజుల పాటు మహా సభలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను సిఎం చంద్రబాబు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐపిసిఎ ప్రతినిధులు వీరమణి నేతృత్వంలో సిఎంను కలిసి మహా సభలకు ఆహ్వానించారు. సుమారు 10వేల మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరవుతున్నారన్నారు. ఫార్మశీకి చెందిన శాస్తవ్రేత్తలు, కంపెనీల యజనానులు, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఐపిసిఎ ప్రతినిధులు డాక్టర్ రావు, టివి నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి రూ. 25 లక్షలకు టోకరా
గాజువాక, జూలై 2: నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి బ్యాంకులో 25 లక్షల 46 వేల రూపాయలను కాజేసిన 10 మందిపై బ్యాంకు అధికారులు గాజువాక పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి గాజువాక పోలీసులు అందించిన వివరాలిలా వున్నాయి. గాజువాక ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న బ్యాంకు ఆఫ్ ఇండియా గాజువాక బ్రాంచ్‌లో శ్రీశైలం ఉమామహేశ్వరరావు, పి.జగన్నాథం బంగారు ధ్రువీకరణ కర్తలుగా పని చేస్తున్నారు. వీరి సహకారంతో గాజువాక ప్రాంతానికి చెందిన 8 మంది గత మూడేళ్లుగా నకిలీ బంగారాన్ని బ్యాంకులో కుదువ పెట్టి సుమారు 25 లక్షల 46 వేల రూపాయలను రుణాన్ని పొందారు. అయితే బంగారంపై రుణం పొందిన వ్యక్తులు తిరిగి బ్యాంకు రుణాన్ని చెల్లించడం లేదు. ఈ తరుణంలో బ్యాంకు అధికారులు బంగారాన్ని వారి నిబంధనల ప్రకారం బహిరంగ వేలం వేసేందుకు సిద్ధం అయ్యారు. దీంట్లో భాగంగా బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని పరిశీలించారు. అయితే బంగారం నకిలీదని బ్యాంకు అధికారుల నిర్ధారించుకున్నారు. వెంటనే బ్యాంకులో బంగారం ధ్రువీకరణ చేసే ఉమామహేశ్వరరావు, జగన్నాథంపై గాజువాక పోలీసులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ రంజిత్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఉమామహేశ్వరరావు, జగన్నాథం సహకారంతోనే నకిలీ బంగారంపై ఎనిమిది మంది వ్యక్తులు రుణం తీసుకున్నారని బ్యాంకు అధికారులు ఆరోపిస్తున్నారు. రుణం పొందిన వ్యక్తుల పూర్తి వివరాలు కోసం బ్యాంకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉమామహేశ్వరరావు, జగన్నాథం బినామీలే నకిలీ బంగారం పెట్టి బ్యాంకులో రుణం పొందినట్లు బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. దీనిపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ బంగారం పెట్టి రుణం పొందిన వ్యక్తులతో పాటు ఉమాహేశ్వరరావు, జగన్నాథం కోసం పోలీసులు అనే్వషిస్తున్నారు.