విశాఖ

లూలూరు నిర్వాసితులు 330 మందికి రూ.5.9 కోట్ల ఉపాధి పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చెయ్యపేట, జూలై 12: మండలంలోని లూలూరు వద్ద నిర్మితమవుతున్న సైనిక శిక్షణ కేంద్రం వలన భూములు కోల్పోయిన రైతులు, ఉపాధి కోల్పోయిన కూలీలు 330మందికి 5కోట్ల 90లక్షల ఉపాధి పనిదినాల పరిహారం కింద మంగళవారం అందజేశారు. ఎల్‌బి పుర అగ్రహారంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ యువరాజ్, అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు ముఖ్య అతిధులుగా పాల్గొని నిర్వాసితులకు పరిహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఎన్ యువరాజ్ మాట్లాడుతు, గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఫ్యాకేజీ లూలూరు నిర్వాసితులకు దక్కిందన్నారు. అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతు, తనకు ఎవ్వరూ చెప్పక పోయిన నిర్వాసితులు రోడ్డు ప్రక్కన టెంటు వేసుకొని చేస్తున్న దీక్షలను చూసి వారివద్దకు వెళ్లి లూలూరు సమస్యను తెలుసుకున్నానన్నారు. రైతు సంఘ ప్రతినిధులను మంత్రి పారికర్ వద్దకు తీసుకొని వెళ్లి రైతులు కోరిన విధంగా ఫ్యాకేజీ దక్కేలా చేయగలిగానన్నారు. లూలూరు నిర్వాసితులకు ఇంత మంచి ప్యాకేజీ దక్కటానికి జిల్లా కలెక్టర్, ఆర్‌డిఒ, స్దానిక తహశీల్దార్ అందించిన సహాయ సహకారాలు మరువలేనివన్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏ వివరాలడిగినా నిమిషాల్లో వాటిని అందజేసి, రైతులకు ఇంత మంచి ప్యాకేజీ దక్కటానికి రెవెన్యూ అధికారులు కారకులయ్యారని ఆయన వారిని అభినందించారు. చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు మాట్లాడుతు, చోడవరం నియోజకవర్గాన్ని వ్యవసాయాధిరిత పరిశ్రమలతో అభివృద్ధి చేయాలని ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావును కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ పద్మావతి, గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, పినపోలు వెంకటేశ్వర్లు, లూలూరు భూనిర్వాసిత సంఘం నాయకులు కోవెల జనార్ధనరావు పాల్గొన్నారు.