విశాఖపట్నం

మన్యం సమస్యలపై మాస్టర్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 17: గిరిజన గ్రామాలలో నెలకొన్న అన్ని రకాల సమస్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఎన్.యువరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి. ఎ. కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల, పంచాయతీ, గ్రామాలు, కుగ్రామాల వారీగా ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయన్నది ప్రస్తుతం ఎవరికీ తెలియదని, ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా దీనిపై సరైన అవగాహన లేదని అన్నారు. దీనివలన గ్రామాలలో నెలకొన్న అనేక సమస్యలు వెలుగుచూడడం లేదని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలోని సమస్యపై ఇంతవరకు సరైన సమాచారం లేకపోవడంతో గిరిజనుల కష్టాలను, ఇబ్బందులను పరిష్కరించేందుకు వీలుకావడం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలోని సమస్యను గుర్తించి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలనే ఆలోచన చేసినట్టు ఆయన చెప్పారు. ఏజెన్సీలోని ప్రతి గ్రామంలోనూ ఉన్న సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి గ్రామ సమస్యలపై మాస్టర్ ప్లాన్ రూపోందించి ‘సమస్యల విజన్’ అనే డాక్యుమెంట్‌ను వచ్చే పాలకవర్గ సమావేశానికి సిద్ధం చేయాలని ఆయన సూచించారు. మన్యం సమస్యలపై తయారు చేసే సమస్యల విజన్‌ను పార్లమెంట్, శాసన, శాసనసభ్యులకు, ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులందరికీ అందచేస్తామని ఆయన చెప్పారు. ఈ డాక్యుమెంట్‌ను ఆధారంగా చేసి గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని ఆయన అన్నారు. గిరిజన గ్రామాలలో నెలకొన్న అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావని, నిధుల అందుబాటును బట్టి ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరించగలమని ఆయన పేర్కొన్నారు. ఐ.టి.డి.ఎ. పాలకవర్గ సమావేశాలను నిర్వహిస్తుండడం వలన సభ్యులు లేవనెత్తుతున్న సమస్యలను చాలా వరకు పరిష్కరించగలుగుతున్నట్టు కలెక్టర్ చెప్పారు. గిరిజన ప్రాంతంలో ఒకవైపు వ్యాధుల వ్యాప్తి, మరోవైపు డాక్టర్ల కొరత వంటి పరిస్థితులతో ఇబ్బందులు ఉన్నట్టు ఆయన చెప్పారు. అయితే సాధ్యమైనంత వరకు ఇబ్బందులను అధిగమిస్తూ వ్యాధుల ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయ న అన్నారు. గిరిజన గ్రామాలలో సి.సి.రోడ్ల నిర్మాణాన్ని జోరు గా చేపడుతున్నట్టు యువరాజు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న సి.సి.రోడ్ల నిర్మాణానికి పంచాయతీలు 50 శాతం నిధులను భరించాల్సి ఉండగా పంచాయతీ ల భాగస్వామ్యాన్ని పది శాతానికి తగ్గించాలని ముఖ్యమం త్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఆయన చెప్పారు. ప్రత్యేక అభివృ ద్ధి కార్యక్రమం కింద జిల్లాకు మంజూరైన వంద కోట్ల రూపాయలలో 43 కోట్ల రూపాయలను ఏజెన్సీలోనే వెచ్చించినట్టు ఆయన తెలిపారు. ఈ నిధులతో చాలావరకు మంచినీటి పథకాల నిర్మాణాన్ని చేపట్టగా కొన్ని చోట్ల నీటి పథకాల నిర్మా ణం పూర్తికావలసి ఉందని ఆయన అన్నారు. గిరిజన ఉప ప్రణాళిక నిధులతో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కోరామని, ఈ విషయమై శాసనసభ్యులు కూడా దృష్టి సారించి ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పాడేరు, అరకులోయ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్, అన్ని శాఖలకు చెందిన జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, ఎం.పి.పి., జెడ్పీటీసీలు పాల్గొన్నారు.