విశాఖ

విశాఖలో మరో అంతర్జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 29: విశాఖ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. భాగస్వామ్య సదస్సు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన అనంతరం బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల మధ్య ఇంధన సామర్థ్యం, ఇంధన పొదుపుపై ఇటీవల విశాఖలో రెండు రోజుల సమావేశం జరిగింది. తాజాగా వేగంగా జరుగుతున్న పట్టణీకరణపై బ్రిక్స్ దేశాల సమావేశం విశాఖలో నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 14 నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశం విశాఖ నగరంలో నిర్వహిస్తారు. సదస్సు నిర్వహణకు సంబంధించి కేంద్ర పట్టణ పరిపాలన సంయుక్త కార్యదర్శి ఆనంద్ శుక్రవారం విశాఖలో పర్యటించి పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే బ్రిక్స్ నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహించేందుకు గాను ప్రభుత్వం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి 577 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారు. ఐదు దేశాల ప్రతినిధులతో పాటు ఆర్థికాభివృద్ధి సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, రీసెర్చ్ అండ్ అకడమిక్ సంస్థలు, ఫిక్కీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఎడికి, కెఎఫ్‌డబ్ల్యు, వంటి సంస్థల నుంచి ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడ సదస్సును ప్రారంభిస్తారని, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. సదస్సులో భాగంగా ఆరు ప్లీనరీలు జరుగుతాయన్నారు. రెండవ రోజున స్మార్ట్‌సిటీస్ కాన్‌క్లేవ్, పట్టణ పరిసరాల్లో వాతావరణ మార్పులు అంశాలపై ప్లీనరీలు జరుగుతాయన్నారు. మూడవ రోజున రీసిలియంట్ వాటర్, వాటర్ అండ్ శానిటేషన్ మేనేజ్‌మెంట్, న్యూటౌన్స్ అండ్ రీజనల్ ప్లానింగ్, అర్బన్ రినైసెన్స్ - న్యూ రిఫార్మ్స్‌పై ప్లీనరీలు జరుగుతాయన్నారు. బ్రిక్స్ సదస్సు నిర్వహణకు ఎక్కవ సమయం లేనందున తరచు స్టీరింగ్ కమిటీ సమావేశమై అన్ని అంశాలను సమీక్షించాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాలవలవన్ మాట్లాడుతూ బ్రిక్స్ దేశాల సదస్సు నిర్వహణ మన రాష్ట్రానికి లభించిన అద్భుత అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నవ్యాంధ్ర అభివృద్ధికి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బ్రిక్స్ సదస్సు సమర్ధ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు కమిటీలను నియమించడం జరిగిందని వివరించారు. విదేశీ ప్రతినిధులను స్వాగతించేందుకు ఢిల్లీ, ముంబై, విశాఖ విమానాశ్రయాల్లో రిసెప్షన్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.