విశాఖపట్నం

పచ్చదనం పరిఢవిల్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 29: వనం - మనం కార్యక్రమంలో భాగంగా 2029 నాటికి 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యమని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోనున్న పార్కులో 67వ వనమహోత్సవంలో భాగంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జె.నివాస్, జెసి-2 డి.వెంకటరెడ్డి తదితరులు శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 43 శాతం పచ్చదనం ఉందని 50 శాతం పచ్చదనం సాధించే వరకు ఉద్యమరీతిలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాల్సి ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం పెంచడం సాధ్యమన్నారు. రాష్టవ్య్రాప్తంగా నేడు కోటి మొక్కలు నాటుతుండగా, విశాఖ జిల్లాలో 15 నుండి 20 లక్షల మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. పరిశ్రమలు పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. పరిశ్రమలు, పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటుతున్నట్టు పేర్కొన్నారు. వచ్చే రెండు,మూడు మాసాల్లో మొక్కల సంరక్షణపై దృష్టిపెడతామన్నారు. నాటిన మొక్కల్లో 85 నుండి 90 శాతం సంరక్షించేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాల్లో వీలున్న చోటల్లా మొక్కలు నాటాల్సి ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటిన వివరాలన్నింటినీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ తెలిసేందుకు వీలుగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. నగరంలో గ్రీన్ విశాఖలో భాగంగా మరో 16 లక్షల మొక్కలు నాటాల్సి ఉందని, వాటిని వచ్చే రెండు, మూడు మాసాల్లో నాటించేందుకు చర్యలు చేపడతామన్నారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి ఏఓ ప్రకాశరావు తదితర విభాగాధిపతులు వరుసగా మొక్కలు నాటారు.