విశాఖ

మెట్రోకు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 2: విశాఖ మెట్రోరైలుకు మంచి రోజులు వస్తున్నాయా! జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఔననే అన్పిస్తోంది. విభజనకు ముందు విశాఖలో మెట్రోరైల్ నిర్మాణానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓకె చెప్పింది. అనంతరం కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెట్రోరైల్ ప్రతిపాదన శరవేగంతో తెరమీదకొచ్చింది. ఇదే సందర్భంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి, గుంటూరు, విజయవాడ మెట్రోరైల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో విశాఖ మెట్రోరైల్ ప్రతిపాదన స్తబ్ధంగా ఉండిపోయింది. దీంతో ఇక మెట్రోరైల్ రాదననుకుంటున్న తరుణంలో మెట్రోరైల్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి ఇటీవల విశాఖలో పర్యటించి అధికారులతో సమీక్షించడం, కలెక్టర్‌ను కలిసి కొన్ని ప్రతిపాదనలు చేయడంతో మరోసారి మెట్రోరైల్‌పై ఆశలు చిగురించాయి. విశాఖలో మూడు కారిడార్లతో 42.5 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణానికి సంబంధించి ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమగ్ర సర్వే జరిగింది. దీనికి సుమారు రూ.13,500 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. మూడు కారిడార్లుగా మెట్రోరైల్ నిర్మించాలని ప్రతిపాదించారు. కొమ్మాది నుంచి గాజువాక (30.38 కిలోమీటర్లు), పాతపోష్ట్ఫాసు నుంచి గురుద్వారా (5.2 కిమీ), తాటిచెట్లపాలెం నుంచి పార్క్ హోటల్ (7.2కిమీ) వరకూ మూడు కారిడార్లుగా మెట్రోరైల్ నిర్మాణానికి సర్వే పూర్తి చేశారు. దీనికి సంబంధించి సమగ్ర పథక నివేదిక (డిపిఆర్)ను ఎనిమిది నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి నివేదించింది. అయితే అప్పటి పరిస్థితుల నేపథ్యంలో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై కేంద్రం పెద్దగా సుమఖత వ్యక్తం చేయలేదు. దీంతో మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రతిపాదన అటకెక్కిందనే అంతా భావించారు. తాజాగా కేంద్రం విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుటు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక విధి విధానాలు ఖరారు కావడమే మిగిలింది. మెట్రోరైల్ ప్రాజెక్టుకయ్యే ఖర్చులో 60 శాతం ప్రైవేటు సంస్థల నుంచి సేకరిస్తారు. మిగిలిన మొత్తంలో 20 శాతం కేంద్రం, మరో 20 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. పిపిపిలో నిర్మితమయ్యే మెట్రోప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కోపరేటివ్ ఏజెన్సీ (జైకా) ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. తాజాగా మెట్రోరైల్ ఎండి రామకృష్ణారెడ్డి విశాఖ పర్యటనలో జివిఎంసి అధికారులతో పలు దఫాలుగా చర్చించారు. ఇప్పటికే ప్రతిపాదించిన రూట్, భూసేకరణ, స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం ఎండి రామకృష్ణారెడ్డి కలెక్టర్‌తో సమావేశమై మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన కార్యాలయం, డిపోల ఏర్పాటుకు అవసరమైన స్థలాల మంజూరుపై చర్చించారు. తమకు అనువైన స్థలాలను ఎంపిక చేయాల్సిందిగా కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. దీంతో మెట్రోరైల్ ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రతిపాదనలు ముందుకు కదులుతున్నట్టు భావించాల్సిందే.