విశాఖ

తక్కువ వడ్డీకే డిసిసిబి రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 25 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే రుణ సదుపాయాన్ని ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా వినియోగదారులకు కల్పిస్తున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ సుకుమారవర్మ తెలిపారు. గురువారం డైమండ్ పార్కు వద్ద బ్యాంకు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రుణమేళా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకులంటే కేవలం రైతుల కోసమే అనే అపోహ ప్రజల్లో ఉందని, అన్ని బ్యాంకుల మాదిరిగానే సహకార బ్యాంకులు ప్రజలకు పలు సేవలు అందిస్తాయని అన్నారు. ప్రజలకు ఈ బ్యాంకులపై అవగాహన కలిగించడానికి ప్రతినెలా రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించామని అన్నారు. జిల్లాలో మొత్తం 28 బ్రాంచిలలో నెలకి ఒకరోజు చొప్పున రుణమేళా కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. గృహ నిర్మాణం, కొనుగోలుకు తనఖా రుణాలు ఖాతాదారులకు తక్కువ వడ్డీకే సరళమైన నిబందనలు, సులభ వాయిదా పద్ధతుల్లో అందజేస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ రుణమేళాకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని ఖాతాదారులంతా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ డి.వి.వి.ఎస్. వర్మ, డిజిఎం అన్నపూర్ణ, ద్వారకా నగర బ్రాంచ్ మేనేజర్ బేగం, అసిస్టెంట్ మేనేజర్లు కళ్యాణి, గాయత్రీ, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.