విశాఖ

సింహగిరిపై సోలార్ వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఆగస్టు 28: సింహాచలం కొండపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రూ. 6 కోట్ల వ్యయంతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి, దేవస్థానానికి అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. సింహాచలం కొండపై నూతనంగా నిర్మించిన వంటశాలను ఆదివారం ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదే అంశాన్ని వెల్లడించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు ఆరు నెలల కాల వ్యవధిలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింహాచలం కొండ దిగువన రూ. 6 కోట్ల వ్యయంతో అత్యాధునిక, మెగా కల్యాణ మండపం నిర్మించనున్నామని, సుమారు 2000 మంది కూర్చునే వీలుగా దీన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. అలాగే పాత బస్టాండ్ ప్రాంతంలో రూ.4 కోట్లతో కల్యాణ మండపంతో పాటు డార్మెటరీ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్టు తెలిపారు. మరో 80 లక్షల రూపాయలతో పుష్కరిణిని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. విశాఖలో చేపట్టిన హెలిటూరిజంలో సింహాచలం దేవాలయాన్ని చేర్చడం ద్వారా సందర్శకులను ఆకట్టుకునే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే కైలాసగిరి నుంచి సింహాచలం కొండపైకి రోప్ ఏర్పాటు అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు.
ముగిసిన వరుణ యాగం
సింహాద్రి అప్పన్న సన్నిధిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వరుణ యాగం ఆదివారంతో ముగిసింది. చివరి రోజున పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కె రామచంద్రమోహన్‌తో పాటు మంత్రి గంటా పాల్గొన్నారు. అనంతరం మంత్రి గంటా కొండపై త్రిపురాంతక స్వామిని దర్శించుకున్నారు.